How To Store Pulses For Long Time At Home : తెలుగు వారి వంటకాలలో ప్రధానమైనది పప్పు. అందుకే కనీసం వారంలో ఒకసారైనా భోజనంలో ఇది ఉండాల్సిందే. అయితే పూర్వకాలంలో పప్పు దినుసులను ఏడాదికి సరిపడా కొనుగోలు చేసేవారు. కానీ, అది కాస్త ప్రస్తుతం నెలరోజులకు మారింది. ఎక్కువకాలం నిల్వ చేస్తే పాడైపోయే ప్రమాదముండటం కూడా ఒక కారణం. అంతే కాకుండా చీమలు, పురుగులు తదితర కీటకాలు చేరి వాటిని పాడుచేసే ప్రమాదముందని చాలా మంది పప్పు దినుసులను నిల్వ ఉంచడానికి వెనుకంజ వేస్తున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచవచ్చు. అవెేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పులనేవి పోషకాలకు నిలయం. వీటిలో అధిక మోతాదులో ప్రోటీన్లు, విటమిన్-బి, ఫైబర్, పొటాషీయం ఉంటాయి. అంతే కాకుండా వీటిని తింటే శరీరానికి క్యాలరీలు సైతం తక్కువ సంఖ్యలో లభిస్తాయి. అందుకే చాలా మంది డాక్టర్లు పప్పులనే అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా పప్పులనేవి మనకు రెండు రకాలుగా లభిస్తాయి. ఒకటి పొట్టుతో ఉన్న పప్పు, రెండోది పొట్టు లేకుండా విరిగిన పప్పు. ఈ పొట్టుతో ఉన్న పప్పులలో పోషకవిలువలు అధికంగా ఉంటాయి. దానితో పాటు వీటికి ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది.
పొట్టులేని పప్పులను నిల్వ ఉంచే చిట్కాలు
- సాధారణంగా పొట్టులేని పప్పుల్లో నీటి శాతం అధికంగా ఉండి త్వరగా పాడైపోయే అవకాశముంది. అందుకే వీటిని ఎండలో పూర్తిగా తేమశాతం పోయేవరకూ ఎండబెట్టాలి. అనంతరం వీటిని ఏదైనా డబ్బాలలో నిల్వఉంచవచ్చు. ప్లాస్టిక్ డబ్బాలను వాడకుండా ఉండటం మంచిది.
- పప్పుల్లో పురుగులు చేరకుండా ఉండాలంటే గాజు సీసాలలో భద్రపరచటం మంచిది.
- వీటితో పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచటం ద్వారా అధిక కాలం నిల్వ ఉంచవచ్చు.
- పాత బియ్యం, పప్పులను కలపకూడదు దీనివల్ల పప్పులు త్వరగా పాడైపోయే ప్రమాదముంది.
- శనగలు పురుగులు పట్టకుండా ఉండాలంటే వాటిలో కొన్ని వెల్లుల్ని ముక్కలను వేయాలి.
- వీటితో పాటు పప్పుల్లో ఉండే ఎంజైమ్‌ల ద్వారా ఇవి పాడైపోయే ప్రమాదముంది. దీనిని అరికట్టాలంటే ఫ్రిజ్‌లో ఉంచటమే, వీటిని ఉడకబెట్టి నిల్వ చేయటమో చేయవచ్చు.
- సాధారణంగా నిల్వచేసిన పప్పులను వారానికి ఒకసారి ఎండబెట్టడం ద్వారా అవి మరింత కాలం నిల్వఉండే అవకాశముంది.
ఇవండీ పప్పుదినుసులు వేగంగా పాడవ్వకుండా ఉండే చిట్కాలు. వీటిని పాటించి ఎంచక్కా పప్పు దినుసులను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫ్రిజ్‌లో ఆ 7 వస్తువులను నిల్వ ఉంచుతున్నారా? ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే!
చియా సీడ్స్ Vs అవిసె గింజలు - వీటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి? నిపుణులు ఏం అంటున్నారు?