ETV Bharat / health

కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా? - నిపుణులు ఇలా చేయమంటున్నారు! - EXPERTS TIPS FOR GAS PAIN

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 10:08 AM IST

Updated : Sep 14, 2024, 10:52 AM IST

Experts Tips For Gas Pain : ఎప్పుడూ కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కాస్త తిన్నా.. పొట్ట నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు చాలా మంది సోడా, వివిధ రకాల డ్రింక్స్​ తాగుతుంటారు. కానీ.. వీటివల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్​ సమస్య పూర్తిగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరూ చూసేయండి..

Gas Pain
How to Get Rid of Gas Pain (ETV Bharat)

Experts Tips For Gas Pain : ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి కారణాల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. పిల్లలు కూడా గ్యాస్​ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇలా కడుపు పట్టేసినట్టుగా ఉండడానికి కారణాలు ఏంటి ? నేచురల్​గా ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలను ప్రముఖ సర్జికల్​ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ 'డాక్టర్​ టి. లక్ష్మీకాంత్' వివరిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఎంతో కొంత గ్యాస్​ తయారవుతుంటుంది. అది బయటకు వెళ్లకపోతే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆహారం తింటున్నప్పుడు కొంత గాలి కూడా లోపలికి వెళ్తుంది. అలాగే పెద్దపేగులు ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలోనూ పొట్టలో గ్యాస్​ ఏర్పడుతుంది. కొన్నిసార్లు గ్యాస్​ కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు కడుపు నొప్పి, ఉబ్బరంగా ఉండడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, పేగులు ముడివేసినట్టుగా ఎంతో బాధ కలుగుతుంటుంది.

"కడుపు ఉబ్బరంగా అనిపించడానికి అనేక కారణాలుంటాయి. ప్రధానంగా టైమ్​కు ఆహారం తినకపోవడం, కార్బోనేటెడ్​ డ్రింక్స్​ తాగడం, స్ట్రా ద్వారా ఎక్కువ డ్రింక్స్​ తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కొంతమందికి పాలు, పాల పదార్థాలు పడవు. వీరు ఈ ఫుడ్​ తీసుకోవడం వల్ల గ్యాస్​ సమస్య వస్తుంది. మలబద్ధకం కూడా కడుపులో గ్యాస్​ పెరిగేలా చేస్తుంది."-డాక్టర్​ టి. లక్ష్మీకాంత్​

కడుపు ఉబ్బరం తగ్గించుకోవడానికి చిట్కాలు..

  • గ్యాస్​ సమస్య ఉన్నవారు ఎక్కువగా గాలిని మింగకుండా ఆహారం తీసుకోవాలి. ఇలా చేయాలంటే వేగంగా కాకుండా మెల్లిగా నములుతూ ఆహారం తినాలి.
  • అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పడని ఆహారం తినకూడదు.
  • పుదీనా టీ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
  • తినేటప్పుడు మాట్లాడకూడదు.
  • నీళ్లు ఎక్కువగా తాగాలి. ఫైబర్​ ఉండే ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
  • ఫిజీ డ్రింక్స్​, కార్బోనేటెడ్​ డ్రింక్స్​ తక్కువగా తీసుకోవాలి.
  • స్ట్రా ద్వారా డ్రింక్స్​ తీసుకోకూడదు.
  • కొంతమందికి బ్రోకలీ, ఆకుకూరలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.
  • చూయింగ్​ గమ్​లు, కొన్ని రకాల స్వీట్లలో కృత్రిమ చక్కెర ఉంటుంది. ఇవి గ్యాస్​ను కలిగిస్తాయి.
  • రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కాబట్టి, నైట్​ కంటినిండా నిద్రపోవాలి.
  • ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, ప్రశాంతంగా ఉండాలని డాక్టర్​ టి. లక్ష్మీకాంత్​ సూచిస్తున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

గ్యాస్ట్రిక్​ ప్రాబ్లమ్​ తగ్గాలంటే వెళ్లాల్సింది ఆసుపత్రికి కాదు - ఈ అలవాట్లు మార్చుకోవాలి!

గ్యాస్ సమస్య వేధిస్తోందా? అయితే ఈ సింపుల్​ చిట్కాలతో చెక్​ పెట్టేయండి!

Last Updated : Sep 14, 2024, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.