ETV Bharat / health

కూరలో మసాలా ఎక్కువైందా? డోంట్​ వర్రీ- ఈ ఇంటి చిట్కాలతో అంతా సెట్​! - Reduce Spiciness Tips - REDUCE SPICINESS TIPS

How To Reduce Spiciness In Curry : కూరలో కారం ఎక్కువైతే నెయ్యి వేసుకుని తగ్గించవ్చు. కానీ మసాలా ఎక్కువైతే ఘాటు అస్సలు భరింతచలేం కదా. మీ కూరలో ఎక్కువైన ఘాటను చిటికెలో తగ్గించే చిట్కాలు మీ కోసం..

How To Reduce Spiciness In Curry
How To Reduce Spiciness In Curry
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 8:55 AM IST

How To Reduce Spiciness In Curry : కూరల్లో ఉప్పు, కారంతో పాటు మసాలాలు కూడా దట్టంగా వేసుకుని తినడం భారతీయులకు అలవాటు! మసాలా దినుసులు లేనిదే కొన్ని కూరలు అస్సలు తినలేం కూడా. అలా అని మసాలాలు కొంచెం అటూ ఇటూ అయినా కూరలో ఘాటు ఎక్కువ అవుతుంది. తర్వాత మీరు వండిన కూర లేదా గ్రేవీ చెత్త కుండీ పాలు అవుతుంది.

వాస్తవానికి ప్రతిసారి కూరల్లో మసాలాలు సరిగ్గా వేయడం అంత సులువు కాదండోయ్. ఈ విషయం ప్రతి రోజూ వంట చేసే వారికి బాగా తెలుసు. కాబట్టి కూరలో మసాలు ఎక్కువైతే దాన్ని తిరిగి సరిచేయడానికి కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే చాలట. ఇవి కూరకు మరింత రుచిని కూడా అందిస్తాయట. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.

ద్రవాలు
అనుకోకుండా కూరల్లో మసాలాలు ఎక్కువైనప్పుడు దాంట్లో నీరు, టమాటో సాస్, ఉడకబెట్టిన చింతపండు పులుసు లాంటివి కలపవచ్చు. ఇది మసాలా ఫ్లేవర్​ను పీల్చుకుని ఘాటు తగ్గిస్తాయి.

కొబ్బరిపాలు
కొబ్బరి పాలు, క్రీములు సుగంధ ద్రవ్యాలను తటస్తం చేయడంలో చక్కగా ఉపయోగపడతాయి. కొబ్బరిపాలను కూరలో కలపి ఉడికించడం ద్వారా మసాలా ఘాటు సులభంగా తగ్గుతుంది.

పాల పదార్థాలు
పెరుగు లేదా వెన్న లాంటి పాల ఉత్పత్తులు మసాలా ఘాటను నిరోధించగలుగుతాయి. వీటిని కూరలో కలిపి కాసేపు వేడి సెగలో ఉంచారంటే కూర ఘాటు తగ్గి రుచిగా మారడం ఖాయం.

తీపి పదార్థాలు
చక్కెర, తేనె వంటి తియ్యటి పదార్థాలతో పాటు ఆపిల్ తురుము లాంటివి ఘాటును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. కూరలో ఘాటు ఎక్కువైనప్పుడు వీటిలో ఏది కలిపినా, కాస్త తీపి దనం వచ్చి ఘాటు తగ్గుతుంది.

ఆమ్ల పదార్థాలు
నిమ్మరసం, వెనిగర్ లాంటి ఆమ్ల పదార్థాలు మసాలా ఘాటును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కిచెన్​లో ఎప్పుడూ లభించే ఈ పదార్థాలు కూరలో ఎక్కువైన మసాలాను తగ్గించి చక్కటి రుచిని అందిస్తాయి.

బంగాళాదుంపలు
ఉడికించిన బంగాళాదుంపలు, అన్నం, బ్రెడ్ వంటి పదార్థాలు కూడా అదనపు మసాలాలను చక్కగా గ్రహిస్తాయి. మీ కూరలో మసాలా ఎక్కువైనప్పుడు వీటిని వేసి కాసేపు ఉడికిస్తే, కూర తిరిగి మాములు స్థితికి వస్తుంది. వీటితో పాటు క్యారెట్, బఠానీలు వంటి కొన్ని కూరగాయలు కూడా కూరలో ఎక్కువైన మసాలా దినుసుల ఘాటును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మీ కూర క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా పెంచుతాయి అనడంలో కన్ఫ్యూజన్ అవసరం లేదు.

డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, క్వినోవా- మీ లివర్ హెల్దీగా ఉండాలంటే ఇవి తినాల్సిందే! - Best Food For Liver Health

మజ్జిగలో ఉప్పు కలిపి తాగుతున్నారా? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు! - Buttermilk with salt side effects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.