ETV Bharat / health

కూరలో కారం ఎక్కువైందా ? టెన్షన్​ అక్కర్లేదు, ఈ టిప్స్​ పాటిస్తే అంతా సెట్​! - How To Reduce Extra Spice in curry

How To Reduce Extra Spice in Curry : ఎంతో ఇష్టపడి వండుకున్న కూరల్లో ఎప్పుడో ఒకసారి కారం, మసాలా ఎక్కువవుతూ ఉంటాయి. దీంతో అటు తినలేం.. ఇటు పడేయలేం. ఇకపై ఆ టెన్షన్​ అక్కర్లేదు. కూరలో కారం, మసాలా ఘాటు ఎక్కువైనా కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోనే స్పైసీనెస్​ తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

How To Reduce Extra Spice
How To Reduce Extra Spice
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 5:40 PM IST

How To Reduce Extra Spice in Curries : వంట చేయడమనేది ఒక కల. అది అందరికీ అంత సులభంగా, తొందరగా రాదు. ఎన్నో ఏళ్ల నుంచి రోజూ వంట చేసే వారు కూడా ఒక్కోసారి పొరపాటున కూరలో ఉప్పు లేదా కారం ఎక్కువగా వేస్తారు. అందుకే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎంత మంచి వంటకమైనా తేడా కొడితే డస్ట్‌బిన్‌ పాలవ్వాల్సిందే. ఇదిలా ఉంటే, మనం వండే మాంసాహారమైన లేదా శాకాహారమైనా దానికి సరిపడా కారం ఉంటేనే రుచిగా ఉంటుంది. లేకపోతే ఆ వంటకం అంత రుచిగా ఉండదు. అయితే, ఒక్కొసారి ఏదో ఆలోచన వల్ల కూరలో కారం ఎక్కువవుతుంది. దీంతో ఏం చేయాలి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కానీ, మీ కిచెన్‌లో ఉండే మిగతా పదార్థాలతోనే కూరలో కారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

నెయ్యి, వెన్నతో ఈజీగా కారం తగ్గించుకోవచ్చు : ఆహార పదార్థాలకు నెయ్యి లేదా వెన్నెను యాడ్‌ చేయడం ఆ వంట టేస్టే మారిపోతుంది. కానీ, కూరలో కారం ఎక్కువైతే కూడా నెయ్యి లేదా వెన్నె వేయడం వల్ల ఆ ఘాటు తగ్గుతుందని మీకు తెలుసా ? అవునండీ, ఈ సారి కూరలో కారం ఎక్కువైతే ఒకసారి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కారం మొత్తం తగ్గిపోవాల్సిందేనని నిపుణులంటున్నారు. ఇలా కూరలోకి కొద్దిగా నెయ్యి, వెన్నెను కలిపితే ఇంకా టేస్ట్‌ పెరగడం పక్కా అంటున్నారు.

మీ కూరలో ఉప్పు ఎక్కువైందా? ఈ ఈజీ టిప్స్​తో అంతా సెట్!

చక్కెర : ప్రతి వంటింట్లో చక్కెర కచ్చితంగా ఉంటుంది. అయితే, దీనిని టీ, కాఫీలు, స్వీట్లు తయారు చేయడానికే కాకుండా, కూరలో కారం తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇలా కూరలో కారం ఎక్కువైతే కొద్దిగా చక్కెర యాడ్‌ చేయడమనే చిట్కాను చాలా పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నా కూడా, చాలా మందికి ఈ విషయం తెలియదు. కూరలో షుగర్​ యాడ్​ చేస్తే కారం తగ్గడమే కాదు టేస్ట్​ కూడా అద్దిరిపోద్ది.

మెంతులతో కారం మాయం : చేపల పులుసులో చాలా మంది టేస్ట్‌ కోసం మెంతుల పొడిని వేస్తుంటారు. అయితే, కూరలో కారం ఎక్కువైతే కూడా కొన్ని మెంతులను వేయించి పొడి చేసి యాడ్‌ చేసుకోవచ్చు. సహజంగా మెంతులలో ఉండే వగరు, చేదు గుణాల వల్ల కారం, ఘాటు తగ్గుతుంది. మరి మెంతుల పొడిని ఈ సారి ఇలా వాడండి.

నిమ్మరసంతో : నాన్‌వెజ్‌ వంటకాలు ఏవైనా సరే ఒక నిమ్మకాయను పిండి తింటే ఆ టేస్ట్‌ ఎంతో అదిరిపోతుంది. అయితే, కూరలో కారం, ఘాటు ఎక్కువైతే ఒక నిమ్మకాయను మొత్తం పిండండి. దీంతో మొత్తం కారం సెట్‌ అవ్వాల్సిందే. ఇలా వంటింట్లో ఉండే వివిధ రకాల పదార్థాల వల్ల కూరలో కారాన్ని ఈజీగా తగ్గించుకోండి. కాబట్టి, ఇక నుంచి కూరలో కారం ఎక్కువైందని టెన్షన్‌ పడకండీ!

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.