ETV Bharat / health

మండే ఎండలకు హోమ్ రెమిడీ - టమాట, క్యారెట్లతో ఫేస్ ప్యాక్ చేసుకోండిలా! - How To Make Tomato Carrot Face Pack

How To Make Tomato Carrot Face Pack : మెరిసే చర్మాన్ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. కానీ ఆ మెరుపు కోసం ఏవేవో క్రీములకు బదులు ఇంట్లోనే మీరే ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అది కూడా మనకు ఎప్పుడూ టమాటా, క్యారెట్, ముల్తానీ మట్టితో చేసుకోవచ్చు. అదేలానో ఈ స్టోరీలో చూద్దాం.

How To Make Tomato Carrot Face Pack
How To Make Tomato Carrot Face Pack
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 5:49 PM IST

How To Make Tomato Carrot Face Pack : ఎల్లప్పుడూ ఫ్రెష్ గా, అందంగా కనిపించాలంటే పార్లర్ ఒక్కటే మార్గమని ఎవరన్నారు? చర్మం పాడవకుండా ఉండాలంటే రకరకాల ఖరీదైన క్రీములు రాసుకోవాల్సిందే అని ఎవరు చెప్పారు? ఒక్కసారి మీ వంటగదిని పూర్తిగా పరిశీలించండి. చర్మ ఆరోగ్యాన్ని పెంచే అనేక పదార్థాలను అక్కడ మీకు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం తినే ఆహారం రసాయనాలతో కూడి ఉంటే, పీల్చే గాలి కాలుష్యంతో నిండి ఉంటుంది. యూవీ కిరణాలు, దుమ్ము, ధూళితో పాటు రకరకాల టాక్సిన్ల ప్రభావం చర్మంపై చాలా రకాలుగా పడుతుంది. కాబట్టి మనం చర్మం విషయంలో తప్పకుండా శ్రద్ధ వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి నుంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని సహజమైన పదార్థాలతో తయారు చేసుకునే ఫేస్​ మాస్క్​లు చేసుకోవచ్చు. టమాట, క్యారెట్, ముల్తానీ మట్టితో ఈజీగా ఫేస్​ ప్యాక్స్​ చేసుకోవచ్చు. వాటి ఉపయోగాలు తయారీ విధానం తెలుసుకుందాం.

టమాట, క్యారెట్ ఉపయోగాలు

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా కలిగిన పదార్థాల్లో టమాట ఒకటి. చర్మానికి అవసరమైన తేమను నిలపుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి టమాట చక్కగా ఉపయోగపడుతుంది. ఇక క్యారెట్​లో​ విటమిన్లు, ఖనిజాల, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేయడమే కాక చర్మానికి కొత్త జీవం పోస్తాయి. అలాగే క్యారెట్‌లోని విటమిన్- సీ కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. దీంట్లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మ పనితీరును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

ముల్తానీ మట్టి ఉపయోగాలు

ఆయుర్వేదంలో ముల్తానీ మట్టికి చాలా ప్రాధాన్యం ఉంది. చాలా రకాల సౌందర్య సాధనాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు. ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేసేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే మొటిమలను తొలగించడంలో, చర్మానికి ఆక్సిజన్ సహాయపడుతుంది. వాటితో పాటు మచ్చలను మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మ ఛాయను మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.

టమాట, క్యారెట్, ముల్తానీ మట్టి ఫేస్​ ప్యాక్​ తయారీ

కావలసిన పదార్థాలు:

  • ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి
  • క్యారెట్ రసం ఒక టేబుల్ స్పూన్
  • ఒక టేబుల్ స్పూన్ టమోట రసం

క్యారెట్ చక్కగా కడిగి తురుమి దాంట్లో నుంచి రసాన్ని పిండాలి. అలాగే సగం టమాటను మెత్తగా చేసి, దాని రసాన్ని తీయాలి. ఈ రెండు రసాలను తీసుకుని ముల్తానీ మట్టిలో కలిపి చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడ భాగానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

టమాట, క్యారెట్, ముల్తానీ మట్టితో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్​ను వారానికి ఒకసారి రాసుకోవచ్చు. ఇవి అన్ని సహజమైన పదార్థాలే అయినప్పటకీ కొందరికి ఎలర్జీ కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పదార్థమైనా మొదట మీ మోచేతిపై ఉపయోగించిన తర్వాత ముఖానికి, మెడకు రాసుకోవడం మంచిది.

'వాటర్​ వెయిట్' సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా? - water retention in body symptoms

తరచూ ఫేస్​ వాష్ చేస్తున్నారా? వేసవిలో ఇలా అస్సలు చేయొద్దు! - tips for skin in summer season

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.