ETV Bharat / health

చెద పురుగులు ఇంటిని గుల్ల చేస్తున్నాయా ? - ఈ నేచురల్​ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్​ ఇట్టే సాల్వ్​! - How To Control Termites In House

How To Get Rid Of Termites :ఇంట్లో చెక్క వస్తువులు ఉన్నాయంటే చెదలు పట్టడం గ్యారెంటీ. వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అయితే చెద పురుగులను నివారించాలంటే ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

Get Rid Of Termites
How To Get Rid Of Termites (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 1:37 PM IST

How To Get Rid Of Termites : సాధారణంగానే చెక్కతో చేసిన ఫర్నిచర్‌, కిటికీలు, తలుపులకు చెదలు పడుతుంటాయి. ఇక వర్షాకాలంలో గాలిలోని అధిక తేమ కారణంగా ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే చెదలను నివారించడానికి చాలా మంది పెస్ట్​ కంట్రోలర్స్​ వాడుతుంటారు. కాగా, ఇందులోని కెమికల్స్​ వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే నేచురల్​గానే చెద పురుగులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకోసం కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

లవంగాలు : చెద పురుగులను నివారించడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం ముందుగా కొన్ని లవంగాలను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని చెద పురుగులున్న చోట స్ప్రే చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల లవంగాల వాసనకు చెద పురుగులు నాశనమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

వేప నూనె : చెద పురుగులను నివారించడంలో వేప నూనె కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని అంటున్నారు. ముందుగా వేప నూనెను ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని చెదలు పట్టిన చోట స్ప్రే చేయండి. లేకపోతే ఒక పొడి వస్త్రంపై కొద్దిగా వేప నూనెను పోసి చెదలున్న చోట రాయొచ్చు. ఇలా చేస్తే.. చెద పురుగులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ స్ప్రేని కిటికీలు, తలుపులు, గది మూలల్లో స్ప్రే చేయడం వల్ల దోమలు, కీటకాలు రాకుండా ఉంటాయట.

వెనిగర్ : మనం ఇంట్లో క్లీన్‌ చేయడానికి, వంటల్లో ఉపయోగించే వెనిగర్‌తో చెద పురుగులను ఈజీగా నాశనం చేయవచ్చు. అది ఎలా అంటే.. ముందుగా ఒక కప్పులో నిమ్మరసం పిండండి.. ఇందులో వెనిగర్‌ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని చెక్క ఫర్నీచర్‌పై స్ప్రే చేయండి. ఇలా చేస్తే.. చెద పురుగులు పోతాయని నిపుణులంటున్నారు.

2012లో 'జర్నల్ ఆఫ్ ఎంటమోలాజికల్ సైన్స్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెనిగర్.. చెద పురుగులను నివారించడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని జియోంగ్‌సాంగ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్‌ చాంగ్-యోంగ్ ఓ' పాల్గొన్నారు. చెద పురుగులను నివారించడంలో వెనిగర్‌ బాగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

వెల్లుల్లి, వేపనూనె: 8 వెల్లుల్లి రెబ్బలను పీల్ చేసి 1 కప్పు నీటిలో వేయండి. అందులో కొన్ని చుక్కల వేప నూనె వేసి కలిపి.. ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి.. చెద పురుగులు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేస్తే.. మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. చెదపురుగులను తొలగించేందుకు ఈ ద్రవం ఎంతో మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు!

మీ ఇంట్లో ఎలుకలు దూరి ఇబ్బంది పెడుతున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో పరార్​!

అలర్ట్ : బొద్దింకల స్ప్రేతో మీ ఆరోగ్యానికీ ముప్పు - చాలా సింపుల్​గా ఇలా తరిమికొట్టండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.