ETV Bharat / health

మిరాకిల్ : వీపు నిండా మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? - ఇలా చేస్తే ఒక్క పింపుల్‌ కూడా ఉండదు! - Tips To Control Pimples - TIPS TO CONTROL PIMPLES

Tips To Get Rid Of Acne On Back : ముఖంపైన పింపుల్స్‌ గురించి అందరికీ తెలుసు. కానీ.. కొందరికి వీపు మీద కూడా తీవ్రంగా మొటిమలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మరి.. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Acne On Back
Tips To Get Rid Of Acne On Back (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 11:55 AM IST

How To Control Pimples On Back : చాలా మందికి ముఖంపైన మొటిమలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి కొంతమంది నాచురల్‌ టిప్స్‌ పాటిస్తే.. మరికొందరు క్రీమ్స్‌, లోషన్స్‌ ఉపయోగిస్తారు. అయితే, కొంతమంది ఫేస్​తోపాటుగా వీపు పైనా మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మరి.. వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్‌ శైలజ సూరపనేని' కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నూనెలు ఎక్కువగా విడుదలవడంతో :
మన శరీరంలో ముఖంతో పోలిస్తే.. బాడీ మీద చర్మరంధ్రాలు పెద్దగా ఉంటాయి. వీటి నుంచి ఎక్కువగా నూనెలు విడుదలవుతాయి. అయితే, ఈ నూనెలు అధికంగా విడుదలవ్వడం వల్ల మృతకణాలు, దుమ్ము.. చర్మరంధ్రాల్లో పేరుకుపోయి, వాటిల్లోకి బ్యాక్టీరియా చేరి మొటిమలు, కురుపులు తయారవుతాయట. అలాగే చెమట, జిడ్డు కారణంగా కూడా వీపు పైన కురుపులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి.. వ్యాయామం చేసినా, బయటికి వెళ్లొచ్చినా వెంటనే స్నానం చేయాలని సూచిస్తున్నారు.

వీపు పైన మొటిమలతో ఇబ్బంది పడేవారు ఆయిల్‌ బేస్‌డ్‌ స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ను వాడొద్దని డాక్టర్‌ శైలజ సూరపనేని సూచిస్తున్నారు. వీటికి బదులుగా నాన్‌కమడోజెనిక్‌ ఉత్పత్తులను వాడడం మంచిదట. అలాగే పగలు బెంజైల్‌ పెరాక్సైడ్, క్లిండమైసిన్, నైట్‌ టైమ్‌లో రెటినాల్‌ క్రీములు వీపు పైన అప్లై చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య ఉంటే యాంటీబయాటిక్స్‌ వాడాలి. ఒకవేళ ఇన్ని ప్రయాత్నాలు చేసినా కూడా సమస్య తగ్గకపోతే లేజర్, కెమికల్‌ పీల్స్‌ చేయించుకోవాలి.

ఈ ఫేస్​ ప్యాక్​ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!

ఈ నాచురల్‌ టిప్స్‌ పాటించండి!

  • స్నానం చేసేటప్పుడు బకెట్‌లో కొద్దిగా కల్లుప్పు వేసుకుని స్నానం చేయండి.
  • అలాగే కప్పు నీటిలో ఓట్స్‌ పొడిని కొద్దిసేపు నానబెట్టి, ఆ మిశ్రమాన్ని మొటిమలున్న చోట రాయాలి. తర్వాత ఒక 15 నిమిషాలయ్యాక స్నానం చేస్తే కొన్ని రోజుల్లోనే సమస్య తగ్గిపోతుంది.
  • అలాగే స్పూను చొప్పున బేకింగ్‌ సోడా, దాల్చినచెక్క పొడి, నిమ్మరసం, తేనె తీసుకుని తగినంత నీటిని కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వీపు పైన రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాని వారానికోసారి ట్రై చేయొచ్చు.
  • పావుకప్పు వాటర్‌లో రెండు స్పూన్ల యాపిల్‌ సెడార్‌ వినెగర్‌ కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ వాటర్‌ని యాక్నే ఉన్నచోట స్ప్రే చేసి, 15 నిమిషాల తర్వాత తడి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా డైలీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!

ఈ అలవాట్లు మీలో ఉంటే - ఒక్క మొటిమ కూడా మీ ముఖంపై కనపడదు! పైగా గ్లోయింగ్​ స్కిన్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.