How To Control Frustration : ఎంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయినా కూడా ఏదో ఒక సందర్భంలో సహనం కోల్పోవడం సహజం. కొంతమంది బస్ కోసం వెయిట్ చేస్తూ.. అది లేట్‌గా వస్తే సహనం కోల్పోతుంటారు. ఇంకా మరికొందరు బాగా ఆకలిగా ఉండి ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఆ ఫుడ్ లేట్‌గా సర్వ్ చేసినా కూడా సహనం కోల్పోతుంటారు. అప్పుడు అందరూ ఆ ఫ్రస్ట్రేషన్‌కు గురైన వ్యక్తిని చులకనగా చూస్తారు. అయితే.. ఇలా మనం ఫ్రస్ట్రేషన్‌కు లోనవ్వకుండా ఉండాలంటే రోజువారీ దినచర్యలో కొన్ని రకాల పద్ధతులను ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫ్రస్ట్రేషన్ వస్తే ఈ టిప్స్ పాటించండి..
గట్టిగా ఊపిరి పీల్చండి..
సహజంగానే మనం ఎప్పుడో ఒకసారైనా సహనం కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోతాం. అలాంటప్పుడు మనకు తెలుస్తుంది.. మనం ఎవరిమీదో గట్టిగా అరవడం లాంటివి చేస్తామని. అందుకే ఇలాంటి సమయంలో గట్టిగా ఊపిరి పీల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడుకు ఆక్సీజన్ ఎక్కువగా అంది.. మనల్ని కూల్ చేస్తుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. అలాగే మనకు ఉద్వేగాన్ని కలగజేసే కండరాలను రిలాక్స్ చేస్తుందని తెలియజేస్తున్నారు.
కాస్త ఆలోచించండి..
ఫ్రస్ట్రేషన్ దశలోకి వెళ్లే ముందు.. అసలు ఆ పరిస్థితికి గల కారణాలను ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ముందు ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచించండి. అంతే గానీ.. సహనం కోల్పోతే అందరి ముందు పరువు పోవడం తప్ప, ప్రత్యేకంగా ఒనగూరేది ఏదీ ఉండదని గుర్తుంచుకోండి.
వ్యాయామం..
మనం ఎదుర్కొనే ఫ్రస్ట్రేషన్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. సహనం కోల్పోయే దశలో అక్కడి నుంచి అలా.. కొద్ది దూరం నడవాలని అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ఎండార్ఫిన్లు శరీరంలో విడుదలవుతాయని తెలియజేస్తున్నారు.
డైరీ రాయడం..
డైరీ రాయడం వల్ల ఫ్రస్ట్రేషన్‌ను తగ్గించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగంటే.. మనం సహనం కోల్పోయే సందర్భాలు ఎటువంటి సమయాల్లో, ఎవరి వల్ల ఎదురవుతున్నాయి, అనేది మొత్తం ఒక డైరీలో రాయడం వల్ల.. అలాంటి టైంలో ప్రశాంతంగా ఉండేలా అలవాటు చేసుకోవచ్చని అంటున్నారు. ఆ డైరీని మీ బ్యాగులో పెట్టుకుని ఉంటే ప్రతి సందర్భాన్ని నోట్ చేసుకోవచ్చట.
యోగా, ధ్యానం..
మనం రోజువారీ జీవితంలో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకోవడం వల్ల ఫ్రస్ట్రేషన్‌ను తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటిని సాధన చేయడం వల్ల ప్రశాంతమైన జీవన విధానం మనకు అలవాటవుతుందని అంటున్నారు. ప్రతి రోజు వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో రకాల ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని తెలియజేస్తున్నారు.
హిప్ ఫ్యాట్ ఇబ్బంది పెడుతోందా? ఈ టిప్స్‌తో వెన్నలా కరగడం పక్కా!
ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండాలా? - ఈ జాగ్రత్తలు మీ మైండ్‌లో ఉండాల్సిందే!
కూరలో నూనె ఎక్కువైందా ?- ఈ టిప్స్‌తో ఆయిల్ తగ్గడమే కాదు టేస్ట్ కూడా సూపర్!