How to Check the Purity of Iodized Salt: వంటల్లో ఉప్పు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని పదార్థాలు వేసినా.. ఉప్పు లేకపోతే అంతే! ఎవ్వరూ ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేరు. ఉప్పునకు అంత ప్రాముఖ్యత ఉంది. అయితే.. ఉప్పు వంట రుచిని ఎంతగా పెంచుతుందో.. ఆరోగ్యాన్ని అంతగా దెబ్బ తీస్తుంది అంటారు వైద్యులు. స్వచ్ఛమైన ఉప్పే ప్రమాదం అంటుంటే.. కల్తీ ఉప్పు ఇంకెంత ప్రమాదం కలిగిస్తుందో కదా! అందుకే.. మీ ఉప్పు క్వాలిటీని చెక్ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం తినే తిండి నుంచి తాగే నీళ్ల వరకు ప్రతిదీ కల్తీ అవుతోంది. అయితే.. ఇతర పదార్థాల కల్తీని గుర్తించడం చాలా మందికి తెలుసు కావొచ్చుగానీ.. ఉప్పు కల్తీని చెక్ చేయడం అందరికీ తెలియదు. అందుకే.. అయోడైజ్డ్ ఉప్పు కల్తీని సులభంగా గుర్తించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని టిప్స్ అందిస్తోంది. వాటి ద్వారా ఉప్పు కల్తీని కనిపెట్టేద్దాం!
దుకాణాల్లో దొరికే తిండి - ఎందులో ఉప్పు ఎక్కువగా ఉంటుందో తెలుసా?
బంగాళాదుంప ద్వారా :
- ముందు ఒక బంగాళాదుంపను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక ముక్క తీసుకుని దానిపై ఉప్పు వేయాలి.
- ఒక నిమిషం తర్వాత ఆ ముక్కపై రెండు చుక్కల నిమ్మరసం వేయండి.
- ఇప్పుడు ఆ బంగాళాదుంప రంగు మారకపోతే.. మీరు వాడే అయోడైజ్డ్ ఉప్పు కల్తీ కాలేదని అర్థం.
- ఒకవేళ మీరు వాడేది కల్తీ అయోడైజ్డ్ ఉప్పు అయితే.. బంగాళాదుంప ముక్క బ్లూ కలర్లోకి మారుతుంది.
నీటి ద్వారా:
- ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
- స్వచ్ఛమైన ఉప్పు పూర్తిగా కరిగిపోతుంది.
- అలా కాకుండా ఉప్పు కరగకుండా అడుగన నిలిచిపోతే అది కల్తీదని గుర్తించాలి.
నిప్పు ద్వారా:
- ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాలి.
- స్వచ్ఛమైన ఉప్పు కరిగి, తెల్లటి పొగను రిలీజ్ చేస్తుంది.
- అదే ఉప్పు కల్తీ అయితే నల్లటి పొగతో పాటు దుర్వాసన రిలీజ్ చేస్తుంది.
ఉప్పు వాడకం ఎలా తగ్గించాలో తెలియట్లేదా - ఈ టిప్స్ పాటించండి!
కాటన్‌బాల్ ద్వారా:
- ఒక గిన్నెలో కొంచెం నీరు తీసుకుని దానికి 1-2 టీస్పూన్ల ఉప్పు కలుపుకోవాలి.
- ఇప్పుడు కాటన్ బాల్ లేదా కొద్దిగా కాటన్ తీసుకుని ఉప్పు నీటి మిశ్రమంలో వేసుకోవాలి.
- దూదిని నీటిలో ఓ 5 నిమిషాలు ఉంచండి.
- ఉప్పు కల్తీ అయితే కాటన్ రంగు మారిపోతుంది.
శరీరంపై కల్తీ ఉప్పు ప్రభావాలు:
- కల్తీ ఉప్పు తినడం వల్ల తీవ్రమైన కాలేయ వ్యాధి వస్తుంది.
- జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
- జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు మంట, నొప్పి ఇబ్బంది పెడతాయి.
- కల్తీ ఉప్పు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌తో బాధపడేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- మెదడు, మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది.
- ఇది కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది.
- కల్తీ ఉప్పు తినడం వల్ల గౌట్ సమస్య తీవ్రమవుతుంది.
మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటున్నారా ? అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవట!
అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు! -