Tips to Change Straight Hair to Curly: అందంగా కనిపించడంలో ముఖ వర్చస్సు మాత్రమే కాదు.. జుట్టుదీ కీలకపాత్రే. అందుకే మహిళలు.. ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడుతుంటారు. అయితే.. కొందరు తమకు ఉన్న జుట్టుకు బదులుగా వేరే రకం జుట్టు ఉంటే బాగుండు అనుకుంటారు. ఇలాంటి వారిలో కర్లీ హెయిర్ కోరుకునేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. మీ జుట్టునే కర్లీగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
హెయిర్ కర్లీగా మార్చే ముందు పాటించాల్సిన టిప్స్:
- మార్కెట్లో కర్ల్ పెంచే షాంపూ, కండీషనర్లు లభిస్తాయని.. వాటి సాయంతో తలస్నానం చేసి జుట్టు ఆరనివ్వాలి.
- ఈ ప్రొడక్ట్స్ కర్ల్స్ పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ చేస్తాయి. జుట్టు ఒకవేళ తడిగా ఉంటే కర్ల్ క్రీమ్, జెల్ వంటి అప్లై చేయమంటున్నారు.
- తర్వాత దువ్వెన లేదా వేళ్ల సాయంతో చిక్కులు లేకుండా నీట్‌గా దువ్వుకోవాలి.
- అయితే.. జుట్టు చిక్కులు లేకుండా చేసే క్రమంలో జుట్టును గట్టిగా లాగడం చేయొద్దని, స్మూత్‌గా చిక్కులు లేకుండా దువ్వుకోవాలని నిపుణులు అంటున్నారు.
- ఇప్పుడు మీ జుట్టు పొడవు, మందం బట్టి జుట్టును చిన్న చిన్న భాగాలుగా సెపరేట్ చేయాలి.
- ఇలా చేయడం వల్ల పని ఈజీ అవుతుంది. అలాగే కర్ల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందని అంటున్నారు.
కర్ల్ చేసే పద్ధతులు: పైన చెప్పిన టిప్స్ ఫాలో అయిన తర్వాత ఇప్పుడు చెప్పే పద్ధతుల్లో ఏదైనా ఒక విధానంలో మీ స్ట్రెయిట్ హెయిర్‌ను కర్లీగా మార్చుకోవచ్చు. ఆ పద్ధతులు ఏంటంటే..
1. ఫింగర్ కాయిలింగ్ (Finger Coiling): ముందుగా మీ జుట్టులో కొంత భాగాన్ని తీసుకుని దాని మీ వేలుకు రౌండ్‌గా చుట్టుకోవాలి. పై నుంచి మొదలు పెట్టి కింది వరకు అలానే చుట్టుకోవాలి. ఇప్పుడు కర్ల్‌ను అలానే ఉంచి జాగ్రత్తగా ఫింగర్‌ను రిమూవ్ చేయాలి. ఇలా జుట్టు మొత్తాన్ని ఇదే పద్ధతిలో చేసుకోవాలి. నిమిషాల్లోనే కర్లీ హెయిర్ సెట్ అవుతుంది.
2. ట్విస్ట్ అవుట్(Twist Out): జుట్టులో కొంత భాగాన్ని తీసుకోవాలి. దానిని రెండు పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒకదాని తర్వాత ఒక దాన్ని కలుపుకుంటూ గట్టిగా రౌండ్‌గా తిప్పాలి. లాస్ట్‌కు క్లిప్ పెట్టి కొద్దిసేపు వదిలేయాలి. ఇలా జుట్టు మొత్తాన్ని అలానే చేసి.. కొద్దిసేపటి తర్వాత క్లిప్ తీసి జుట్టును లూజ్ చేసుకోవాలి. నిమిషాల్లోనే కర్లీ హెయిర్ సెట్ అవుతుంది.
3. బంటు నాట్స్(Bantu Knots): జుట్టులో కొంత భాగాన్ని తీసుకుని దానిని రౌండ్‌గా గట్టిగా తిప్పి.. తలపైన ముడిగా చుట్టి దానిని క్లిప్‌తో సెట్ చేసుకోవాలి. ఇలా జుట్టు మొత్తం చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ముడి విప్పితే సరి. అందమైన కర్లీ హెయిర్ రెడీ అవుతుంది.
పైన చెప్పిన పద్ధతుల్లో ఏదో ఒక దానిని ట్రై చేస్తే నిమిషాల్లోనే మీ స్ట్రెయిట్ హెయిర్ కర్లీగా మారుతుంది. జుట్టు కూడా అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. అయితే.. హెయిర్ కర్లీ చేసుకున్న తర్వాత జుట్టును పదే పదే దువ్వడం, అనవసరంగా తాకడం లాంటివి చేయొద్దని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.