ETV Bharat / health

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer - HOW MUCH WATER TO DRINK IN SUMMER

How Much Water To Drink In Summer : మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ముందు ముందు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో? వేసవి తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా అనుకుంటున్నారా? ముఖ్యంగా శరీరం హైడ్రేటెడ్​గా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

How Much Water You Should Drink Daily
How Much Water Should Drink In A Day
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 11:02 AM IST

How Much Water To Drink In Summer : వేసవి కాలం వచ్చిందంటే చాలు నీటిని ఎక్కువగా తాగుతుంటాం. దాహం తీరడమే కాకుండా, సూర్యుని తాపాన్ని తట్టుకొని శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోవాలంటే నీరును పుష్కలంగా తాగాల్సిందే. అయితే చాలామంది మనసులో మెదిలే ప్రశ్న ఏంటంటే మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? నిజానికి రోజుకు ఎంత మోతాదులో నీరు తాగాలనేది అందరికీ ఒకేలా ఉండదట. ఫలానా వాళ్లు ఎక్కువ నీరు తాగాలి ఫలానా వాళ్లు తక్కువ తాగాలి అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.

సగటున మనిషికి ఎంత నీరు అవసరం?
సాధారణంగా మనిషి ప్రతిరోజూ 6గ్లాసులు వరకు కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే తాగాలి. ఆరోగ్యంగా ఉండేవారందరూ రోజుకు 4 నుంచి 6 గ్లాసుల నీటిని నేరుగా తాగుతుంటారు. ఇవే కాకుండా ఆహారం, పండ్ల రసాల రూపంలో ఇంకొన్ని నీటిని తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు లాంటి ఇతర నీరు కలిగిన ఆహార పదార్థాలన్నీ కలిపి పురుషులు రోజుకు 15.5 గ్లాసుల నీరు తాగాల్సి ఉండగా, స్త్రీలు 11.5 గ్లాసుల నీటిని శరీరంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇది మాములు మసుషుల సంగతి.

అనారోగ్య సమస్యలు ఉన్నావారు ఎంత నీటికి తీసుకోవాలి?
ఇక వ్యాయామాలు, శారీరక శ్రమ అధికంగా చేసేవారు (చెమట పట్టేలా కష్టపడి పనిచేసేవారు) ఇంకా ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుందట. అలాగే బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ దాహం వేసినప్పుడు కచ్చితంగా ఇంకాస్త ఎక్కువ నీటిని తాగాలి. ఇవే కాకుండా వయసు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ మెడిసిన్​ వేసుకునే వారు తీసుకోవాల్సిన నీటి శాతం వేరుగా ఉంటుంది. థైరాయిడ్​, కిడ్నీ, కాలేయ సమస్యలు లాంటివి ఉన్నవారు వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రోజుకు ఎంత నీరు తాగాలో వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

నీరు సరిగ్గా తీసుకోకపోతే ఏం జరుగుతుంది?
మనిషి శరీరానికి సరైన మోతాదులో నీటిని అందించకపోతే డీహైడ్రేట్​ అవుతారు. దీనివల్ల మూత్ర విసర్జన సమస్యలు, నీరసం, రక్త ప్రసరణలో ఇబ్బందులు, బద్ధకం లాంటి అనేక సమస్యలు వస్తుంటాయి. హైడ్రేటెడ్​గా ఉండేందుకు ఎన్ని పండ్ల రసాలు తాగినా కేవలం స్వచ్ఛమైన నీటిని నేరుగా తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతిరోజూ భోజనానికి అరగంట ముందు తిన్న అరగంట తర్వాత నీరు తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎన్ని టెస్టులు చేసినా వ్యాధి ఏంటో తెలియట్లేదా? ఈ ఒక్క పరీక్షతో ఫుల్ క్లారిటీ! - Biopsy Test

పరగడుపున నిమ్మకాయ నీరు తాగితే ఎన్నో లాభాలు- అధిక బరువుకు ఈజీగా చెక్​! - Drinking Lemon Water benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.