ETV Bharat / health

వయసును బట్టి నిద్ర - మీరు ఎన్ని గంటలు పడుకోవాలో తెలుసా? - How Many Hours Sleep Required

How Much Sleep Do You Need?: తగినంత నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. దానికి వివిధ రకాల కారణాలు ఉంటున్నాయి. అయితే.. వయసు బట్టి ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు తెలుసా?

How Many Hours Sleep Do You Need
How Many Hours Sleep Do You Need
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 12:00 PM IST

How Many Hours Sleep Do You Need?: మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన పోషకాహారం ఎంత అవసరమో.. రోజూ తగినంత నిద్ర కూడా అంతే అవసరం. అలాగే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నా.. ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ పనులు, నైట్ షిప్ట్స్, కుటుంబ బాధ్యతలు, ఒత్తిడి.. ఇలా కారణాలేవైనా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి సరైన నిద్రలేకపోతే పిల్లలకైనా, పెద్దలకైనా ఆరోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ నిద్రలేమి దీర్ఘకాలంగా కొనసాగితే గుండె జబ్బులు, బీపీ, డయాబెటిస్, ఊబకాయం, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా.. సరైన నిద్రలేకపోతే ఒత్తిడి, ఆకలి, జీవక్రియలను నియంత్రించే హార్మోన్లు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ డైలీ తగినంత నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిద్ర సమయం వయసును బట్టి అవసరం ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో.. వయసు ఆధారంగా ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలనేది వివరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

  • నవజాత శిశువులు (0-3 నెలలు): నవజాత శిశువులకు సాధారణంగా రోజుకు దాదాపు 14-17 గంటల నిద్ర అవసరం.
  • 4-11 నెలలు ఉన్న శిశువులు : వీరు రోజుకు 12-15 గంటలపాటు నిద్ర పోవడం అవసరం.
  • 1-2 ఏళ్లు ఉన్న చిన్నారులు : వీరు ఆరోగ్యంగా ఉండడానికి రోజుకు సుమారు 11-14 గంటల నిద్ర అవసరం.
  • 3-5 సంవత్సరాలు ఉన్న పిల్లలు : ఈ చిన్నారులకు తగినంత విశ్రాంతి అవసరం. వీరికి రోజూ 10-13 గంటల నిద్ర అవసరం.
  • 6-12 సంవత్సరాలు ఉన్న పిల్లలు : పాఠశాలకు వెళ్లే వయసు ఉన్న ఈ పిల్లల నిద్ర వ్యవధి రోజూ 9-12 గంటలుగా ఉండాలి.
  • 13-18 ఏళ్లు ఉన్నవారు(టీనేజర్లు): వీరు రోజుకు 8-10 గంటలు నిద్రపోవడం అవసరం.
  • 18-60 ఏళ్లు ఉన్నవారు : ఈ వయసు వారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7-9 గంటలు నిద్ర పోవాలి.
  • 60 సంవత్సరాలు పైబడినవారు : ఈ వయసు వారిలో కొన్ని శరీర ప్రక్రియలు నెమ్మదిస్తాయి. చాలా మంది వృద్ధులు కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. అలాకాకుండా ఉండాలంటే వీరికి డైలీ 7-8 గంటలు నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే.. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఇవి కేవలం సూచనలు మాత్రమే. ఒత్తిడి స్థాయిలు, జీవనశైలి ఎంపికలు, జన్యుశాస్త్రం, వైద్య సమస్యలతో బాధపడేవారు సహా అనేక కారణాలతో ప్రతి వ్యక్తి నిద్రించే వేళలు మారవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరికీ డైలీ తగినంత నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి.. అందుకోసం సౌకర్యవంతమైన నిద్ర వాతావరణం, అలవాట్లు ఏర్పాటుచేసుకోవడం ముఖ్యం. అయితే ఏవైనా అంతర్లీన నిద్ర రుగ్మతలు లేదా ఆరోగ్య సమస్యలను తోసిపుచ్చడానికి.. మీరు తరచుగా నిద్రపోవడానికి లేదా పగటిపూట అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు.

నిద్ర లేవగానే తలనొప్పి వేధిస్తోందా? - అయితే కారణాలు ఇవే!

60 సెకన్లలో గాఢ నిద్ర - చంటి పాపలా పడుకుంటారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.