Sleep Requirements By Age : మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు, గాలి ఎంత అవసరమో కంటి నిండా నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. సరైనా నిద్రలేకపోతే పిల్లలకైనా, పెద్దలకైనా చికాకుగా ఉంటుంది. రోజంతా అలసటగా ఉండి ఏ పని చేయాలని అనిపించదు! అయితే.. మనిషికి నిద్ర ఎంత అవసరమనేది వయసును బట్టి మారుతుంటుందని మీకు తెలుసా? అవునండీ.. ఏ వయస్సు వారు ఎంత నిద్రపోవాలనేది అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, స్లీప్ రీసెర్చ్ సొసైటీ నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
నవజాత శిశువులు (0-3 నెలలు) :
అప్పుడే పుట్టిన పాప నుంచి మూడు నెలలలోపు శిశువులకు సరైన నిద్ర చాలా ముఖ్యం. ఎందుకంటే. వీరు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి, నవజాత శిశువులు రోజుకు దాదాపు 14-17 నిద్ర పోయేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
శిశువులు (4-11 నెలలు) :
4-11 నెలలలోపు శిశువులలో మెదడు, శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో వారికి రోజూ 12-15 గంటల నిద్ర అవసరమవుతుందట.
పసిపిల్లలు (1-2 సంవత్సరాలు) :
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి.. రోజుకు 11-14 గంటల నిద్ర అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
3-5 సంవత్సరాల పిల్లలు :
చాలా మంది పిల్లలు ఈ ఏజ్‌లో ప్రైమరీ స్కూల్‌కి వెళ్తుంటారు. ఈ టైమ్‌లో వారు స్కూల్‌లో పిల్లలతో ఆడుకుంటూ.. ఇంట్లో అల్లరి చేస్తూ ఎంతో అలసిపోతుంటారు. కాబట్టి, ఈ దశలో పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా రోజుకు 10-13 గంటలు నిద్రపోయేలా తల్లిదండ్రులు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్కూల్ పిల్లలు (6-12 సంవత్సరాలు) :
స్కూల్‌కు వెళ్లే దశలో పిల్లల ఎదుగుదలలో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏజ్‌లో వారు ఎత్తు పెరుగుతుంటారు. అయితే, పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి రోజుకు కనీసం 9-12 గంటలు నిద్రపోవాలి.
నిద్రలో చెమటలు పడుతున్నాయా? - ఉక్కపోత వల్ల అని లైట్ తీసుకుంటే డేంజర్లో పడ్డట్టే!
టీనేజర్స్ (13-18 సంవత్సరాలు) :
టీనేజర్స్ చాలా మంది ఈ వయసులో తమకు నచ్చిన ఆటలు ఆడటం, చదువుకోవడం వంటి పనుల్లో మునిగిపోతారు. ఈ క్రమంలో వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ దశలో వారి శరీరంలో పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందుతుంటాయి. వీరు హెల్దీగా ఉండటానికి రోజుకు 8-10 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.
పెద్దలు (18-60 సంవత్సరాలు):
ఈ ఏజ్ గ్రూప్‌లో దాదాపు ఎక్కువ మంది జనాలుంటారు. అలాగే మెజార్టీ ప్రజలు ఈ దశలోనే నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కారణాల వల్ల కంటినిండా నిద్రకు దూరమవుతారు. అయితే, ఈ దశలో ఆరోగ్యంగా ఉండటానికి అందరూ రోజుకు 7-9 గంటలు నిద్ర పోవడం చాలా ముఖ్యం.
మీరు ఈ పొజిషన్లోనే పడుకుంటున్నారా? లేకపోతే బోలెడు లాభాలు మిస్ అయినట్లే!
పెద్దలు (61 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్నవారు) :
సాధారణంగానే ఈ వయసు వారిలో కొన్ని శరీర ప్రక్రియలు నెమ్మదిస్తాయి. అలాగే చాలా మంది వృద్ధులు కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. అయితే, వీరు ఆరోగ్యంగా ఉండటానికి డైలీ 7-8 గంటలు నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
అర్ధరాత్రి మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టడం లేదా ? - ఆ టైమ్‌లో ఇలా చేస్తే డీప్ స్లీప్ గ్యారంటీ!
అలర్ట్: మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తోందా ? అయితే మీకు ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టే!