Heatstroke Sympotoms And Precautions : వేసవి సెలవులు, మామిడిపండ్లు చాలా సరదాగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ మండే ఉష్ణోగ్రతలు మాత్రం కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తాయి. ముఖ్యంగా శరీరం బాగా వేడెక్కినప్పుడు దానికది తిరిగి చల్లబడనప్పుడు హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తుంటాయి. శరీరం ఉష్ణోగ్రత 40C లేదా 104F దాటితే ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లే. అలాంటి పరిస్థితిలో శరీర అవయవాలన్నీ తక్షణమే కుప్పకూలి మనిషిని పూర్తిగా నాశనం చేస్తాయి. కేవలం నిమిషాల్లో మనిషి ప్రాణాలను బలి తీసుకునే ప్రదాకరమైన వ్యాధి హీట్ స్ట్రోక్. దీని లక్షణాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.
హీట్ స్ట్రోక్ లక్షణాలేంటి?
- అధిక శరీర ఉష్ణోగ్రత: శరీర ఉష్ణోగ్రత 104F లేదా 40C కంటే ఎక్కువ అయిందంటే అది హీట్ స్ట్రోక్‌కు ప్రధాన సంకేతం.
- మానసిక స్థితి: ఎండ వేడికి గందరగోళం, ఆందోళన, సరిగ్గా మాట్లాడలేకపోవడం, చిరాకు, మతిమరుపు, మూర్చ వంటి లక్షణాలు హీట్‌స్ట్రోక్‌ను సూచిస్తాయి. తలనొప్పి వస్తుంది.
- చెమట: వేసవిలో చెమట చాలా కామన్. అయితే అది తీవ్రమైనప్పుడు హీట్‌స్ట్రోక్ సూచికగా భావించాలి. వాతావరణం శరీరానికి అనుకూలంగా లేనప్పుడు చర్మం పొడిగా, ఎర్రగా మారుతుంది.
- వాంతులు, వికారం: హీట్‌స్ట్రోక్ వచ్చినప్పుడు కడుపు జబ్బుపడినట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.
- హార్ట్ రేట్: శరీరం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తిరిగి చల్లబరిచేందుకు గుండె చాలా వేగంగా కొట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
హీట్‌స్ట్రోక్‌కి ఎలా చికిత్స చేయాలి?
శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే అధికంగా పెరిగితే హీట్ స్ట్రోక్ వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎండ వేడికి కుప్పకూలినప్పుడు వెంటనే మనం శరీరం చల్లబడేలా చేయాలి. ఇది తక్షణమే ప్రాణాలను కూడా బలి తీసుకోగలదు. కాబట్టి వీలైనంత వరకూ వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. అలా కుదరనప్పుడు,
- హీట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఎండ నుంచి నీడ ఉన్న ప్రాంతంలోకి, కూలర్ లేదా ఏసీ లాంటి చల్లటి వాతావరణంలోకి తీసుకెళ్లాలి.
- ఆ వ్యక్తి తల, మెడ, చంక వంటి శరీర భాగాలో చల్లని వస్త్రాలు లేదా ఐస్ ప్యాక్‌లను ఉంచాలి. లేదా చల్లటి నీటితో స్నానం చేయించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. శరీర ఉష్ణోగ్రత సుమారు 101-102F(38-39C)కి చేరుకునే వరకూ శీతలీకరణ ప్రయత్నాలు చేస్తుండాలి.
- బాధితులు స్పృహలోనే ఉండి మింగ గలిగితే చల్లటి నీరు లేదా జ్యూస్‌లను తాగించాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు సహాయపడతాయి.
- ముఖ్యంగా హీట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఆస్పిరిన్, ఎసిటోమైనోఫైన్ వంటి మందులు ఇవ్వడం మానుకోండి. ఇలాంటి పరిస్థిలో ఇవి శరీరానికి మరింత హాని చేస్తాయి.
హీట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఈ చర్యలు చేసట్టడం వల్ల మీరు ఆ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టిన వారవుతారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డయాబెటిస్ పేషెంట్లు ఏ టైమ్‌లో వ్యాయామం చేస్తే మంచిది? - Diabetes Patients Exercise Time