ETV Bharat / health

హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? డిన్నర్​ టైమ్​లో ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​ అంటున్న నిపుణులు!

Healthy Dinner Habits : ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్​లోకి మంచి ఆహారం తీసుకోవాలి. అయితే, కొంత మంది డిన్నర్‌ టైమ్‌లో చేసే పొరపాట్ల వల్ల వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా ఉండటానికి డిన్నర్‌ టైమ్‌లో ఏం చేయాలో వివరిస్తున్నారు.

Healthy Dinner Habits
Healthy Dinner Habits
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 3:22 PM IST

Healthy Dinner Habits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే ఆహరంలో పోషకాలు, విటమిన్లు, పిండి పదార్థాలు అధికంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ విషయంలో సరైనా జాగ్రత్తలు పాటించినా.. డిన్నర్‌ విషయానికి వచ్చే సరికి కొన్ని తప్పులు చేస్తారని అంటున్నారు. దీనివల్ల వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే డిన్నర్‌ టైమ్‌లో ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

హెల్దీగా ఉండటానికి డిన్నర్‌ టైంలో ఇలా చేయండి :
సూర్యాస్తమయానికి ముందు లేదా రాత్రి 7 గంటలలోపు భోజనం చేయండి : మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ సూర్యాస్తమయానికి ముందు గానీ లేదా రాత్రి 7 గంటలలోపు డిన్నర్‌ను కంప్లీట్​ చేయాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు. అలాగే తిన్న ఆహారం తొందరగా జీర్ణమై హాయిగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. దీనివల్ల మీరు మరుసటి రోజు చురుకుగా ఉంటారంటున్నారు. 2014లో 'Journal of Clinical Hypertension'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, రాత్రి 7 గంటల లోపు భోజనం తిన్న వ్యక్తుల్లో రక్తపోటు తగ్గిందని పరిశోధకులు పేర్కొన్నారు.

రాత్రి 7 గంటల తర్వాత ఏం తినాలో? ఏం తినకూడదో మీకు తెలుసా?

నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి : హెల్దీగా ఉండాలంటే నైట్ టైమ్‌లో ఆయిల్‌లో ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులంటున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం కాదని చెబుతున్నారు. అందుకే తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

నీరు ఎక్కువగా తాగండి : మనలో చాలా మంది రాత్రి సమయంలో నీరు తక్కువగా తీసుకుంటారు. కానీ, ఇలా చేయవద్దని నిపుణులంటున్నారు. తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. అలాగే సూప్‌లను కూడా తాగవచ్చు. దీనివల్ల కూడా జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని చెబుతున్నారు.

మాంసాహారం తగ్గించండి : కొంత మందికి నైట్‌ టైమ్‌లో మాంసాహారం తినడం అలవాటుగా ఉంటుంది. కానీ, ఇలా తినడం వల్ల మనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నాన్‌వెజ్‌ ఫుడ్‌ జీర్ణం కావడానికి చాలా టైమ్‌ పడుతుందని.. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చని అంటున్నారు.

తృణధాన్యాలను ఆహారంగా తీసుకోండి : రాత్రి భోజనంలో ఎక్కువగా ఫైబర్‌ ఉండే తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి సులభంగా జీర్ణమవడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుందని పేర్కొన్నారు.

తక్కువగా తినండి : రాత్రి సమయంలో శారీరక శ్రమ ఉండదు, కాబట్టి ఆహారాన్ని తక్కువగా తినాలి. దీనివల్ల మరుసటి రోజు చురుకుగా పని చేస్తామని నిపుణులంటున్నారు. ఇలా డిన్నర్ టైమ్‌లో జాగ్రత్తలు పాటించడం వల్ల హెల్దీగా ఉండవచ్చని నిపుణులంటున్నారు.

పరీక్షల టైమ్​లో పిల్లలకు ఈ ఫుడ్స్​ పెడితే - జ్ఞాపక శక్తి ఓ రేంజ్​లో పెరుగుతుంది!

మద్యం తాగే ముందు ఇవి తినండి - ఆరోగ్యం సేఫ్​గా ఉంటుందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.