ETV Bharat / health

దీపావళి తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు! - POST DIWALI HEALTH CARE TIPS

-దీపావళి సందర్భంగా జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి - మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

Post Diwali Health Care Tips
Health Care Tips (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Oct 31, 2024, 9:40 AM IST

Post Diwali Health Care Tips: పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆనందకరంగా జరుపుకొనే పండగల్లో ఒకటి.. దీపావళి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతుంటారు. అలాగే ఈ సమయంలో పిండి వంటలు, స్వీట్లకు ఎలాంటి కొదువ ఉండదు. ఈ క్రమంలోనే డైట్ చేసే వారికి కళ్ల ముందు వివిధ వంటకాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే తినకుండా ఉండలేరు.

దీంతో ఇలాంటి సందర్భాల్లో రోజు తినేదానికంటే కాస్త ఎక్కువే లాగించేస్తుంటారు. ఫలితంగా పండగ తర్వాత వివిధ జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాగే దిపాళీ వేళ కాల్చే టపాసుల కారణంగా తలెత్తే పొగ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాకాకుండా ఉండాలంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రముఖ న్యూటిషనిస్ట్ డాక్టర్ ఇషి ఖోస్లా. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దీపావళి వంటి పండగల తర్వాత మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉందంటున్నారు డాక్టర్ ఇషి ఖోస్లా. అందులో ముఖ్యంగా మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లను క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం చాలా అవసరమంటున్నారు. అంటే.. డైలీ డైట్​లో పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల పోషకాహారం ఉండేలా చూసుకోవాలి. అందులోనూ ప్రధానంగా విటమిన్ సి, ఇ, కాపర్, మెగ్నీషియం, సెలీనియం, జింక్‌తో సహా తగినంత యాంటీఆక్సిడెంట్‌లు శరీరానికి అందేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్​ఫుడ్స్​ని తక్కువగా తీసుకోవడం, వీలైతే అస్సలు తీసుకోకపోవడం మంచిదంటున్నారు.

తగినన్ని వాటర్ తీసుకోవాలి : చాలా మంది ఫెస్టివల్ సమయాల్లో వివిధ పనుల్లో పడి వాటర్ తగినంత తీసుకోరు. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు జీర్ణ సమస్యలూ వస్తాయి. అందుకే అలాంటి సందర్భాల్లో కచ్చితంగా తగినన్ని వాటర్ తీసుకోవడం, వీలైతే కొబ్బరి నీళ్లు, హెల్దీ జ్యూస్​లు తాగితే ఇంకా మంచిదంటున్నారు.

ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆకలి తగ్గుతుంది. దాంతో మీ ముందు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా.. తక్కువ మోతాదులో తీసుకుంటారు. అలాగే, ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు పోవడానికి సహాయపడుతుంది. దాంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా.. మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు.

టైమ్​కి తినేలా చూసుకోవాలి : పండగల సమయంలో కొందరు పూజలు, అన్ని పనులు అయ్యాక తింటుంటారు. ఇంకొందరు తినడం మానేస్తారు. లేదంటే ఆలస్యం అయిందని బాగా ఎక్కువగా తినేస్తుంటారు. ఈవిధంగా తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రధానంగా మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. జీర్ణక్రియ డ్యామెజ్ అవుతుంది. కాబట్టి అలాకాకుండా గట్ సిస్టమ్ హెల్దీగా ఉండాలంటే సమయానికి, కంట్రోల్​గా తినేలా చూసుకోవాలంటున్నారు.

గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు :

  • ఫెస్టివల్స్ టైమ్​లో స్వీట్స్ తీసుకోవడం స్కిప్ చేయలేము కాబట్టి లైట్​గా తీసుకునేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎక్కువగా స్వీట్స్ తింటే కడుపు ఉబ్బరం, డయేరియా, తిన్నది అరగకపోవడం, మలబద్ధకం ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.
  • అలాగే ఈ సమయాల్లో మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అవసరమైతే ఈ అలవాట్లను దూరం చేసుకోవడం కోసం.. గ్రీన్ టీ, సలాడ్స్, ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవడం బెటర్. ఎందుకంటే అవి హెల్దీ రిప్లేస్​మెంట్స్ అని చెప్పుకోవచ్చు.
  • కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. నిద్ర, నిద్ర విధానం ప్రేగు అలవాట్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, డైలీ వాకింగ్, జాగింగ్ వంటి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయంటున్నారు.
  • ఇవేకాకుండా.. ఒత్తిడి పెంచుకోకుండా రిలాక్సింగ్ వ్యాయామాలు, విషయాలపై ఫోకస్ పెట్టాలి. ఇకపోతే టపాసుల వల్ల వచ్చే పొగ బారిన పడకుండా మాస్క్​ పెట్టుకోవడం వంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలన్నీ ఫాలో అయితే జీర్ణ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుకోవచ్చంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఇషి ఖోస్లా.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

షుగర్​ బాధితులకు దీపావళి స్వీట్స్ - ఈ మిఠాయిలు​ హ్యాపీగా తినేయొచ్చట!

దీపావళి టపాసులు - మరి, ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.