ETV Bharat / health

పిల్లలకు నువ్వుల లడ్డు ఇలా చేసి ఇచ్చారంటే - మస్త్ స్ట్రాంగ్​గా, బలంగా తయారవుతారు! - Sesame Seeds Laddu Recipe

Sesame Seeds Health Benefits : మీ పిల్లలు బలంగా, స్ట్రాంగ్​గా తయారవ్వాలా? అయితే, మీ చిన్నారుల డైట్​లో నవ్వుల లడ్డు తప్పనిసరిగా చేర్చాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దానిలోని పోషకాలు పిల్లల ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయంటున్నారు. మరి, నువ్వుల లడ్డుతో కలిగే ప్రయోజనాలేంటి? దానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Sesame Seeds
Sesame Seeds Laddu
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 10:19 AM IST

Sesame Seeds Laddu Health Benefits : పిల్లలు ఎదిగే క్రమంలో వారికి సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. అలా అందించినప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు ఎలాంటి ఫుడ్ చేసి పెడితే ఎక్కువ పోషకాలు అంది ఆరోగ్యవంతంగా, బలంగా తయారవుతారని ఆలోచిస్తుంటారు. మీరూ అలా ఆలోచిస్తున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నువ్వుల(Sesame Seeds) లడ్డు తయారు చేసి పెట్టండని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, నవ్వుల లడ్డు పిల్లల డైట్​లో చేరిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నువ్వుల లడ్డుతో పిల్లలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మూలకాలు పుష్కలంగా ఉన్న నువ్వులు.. ఎదుగుతున్న పిల్లలలో బలమైన ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిలో ఉండే మోనో అసంతృప్త కొవ్వులు వారి మెదడు అభివృద్ధికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. నువ్వులలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదల, కండరాల అభివృద్ధికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నువ్వులు.. పిల్లల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా బలమైన రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదేవిధంగా నువ్వులలోని పోషకాలు వారికి సహజమైన శక్తిని అందిస్తూ రోజంతా యాక్టివ్​గా ఉండడానికి సహాయపడతాయి. అలాగే సీసమ్ సీడ్స్​లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చిన్నారుల్లో జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులను మీ పిల్లలకు ఇలా లడ్డూల రూపంలో చేసి అందిస్తే ఎంతో ఇష్టంగా తినడం పక్కా! అంటున్నారు నిపుణులు.

సమ్మర్​లో మీ పిల్లలకు ఈ స్నాక్స్ - టేస్టీ అండ్ హెల్తీ!

నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • 1 కప్పు - నువ్వులు
  • 1/2 కప్పు - కొబ్బరి పొడి
  • 1 కప్పు - తురిమిన బెల్లం
  • చిటికెడు - యాలకుల పొడి
  • 1/4 కప్పు - నెయ్యి

నువ్వుల లడ్డు తయారీ విధానం :

  • ముందుగా మందపాటి అడుగున్న బౌల్​ తీసుకొని నువ్వులను బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని మరో పాత్రలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఆలోపు కొబ్బరి పొడిని అదే బౌల్​లో కాస్త వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నెయ్యి వేసుకొని అది కాస్త కరిగాక బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆపై మధ్యమధ్యలో కలుపుతూ బెల్లం పాకంలా మారాక.. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఒక ప్లేట్​ తీసుకొని దానికి కాస్త నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి. అది కాస్త చల్లారాక చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మిశ్రమం ఎక్కువగా చల్లారకుండా చూసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నువ్వుల లడ్డూలు రెడీ!
  • ఇక వీటిని మీ పిల్లలకు కొన్ని నట్స్​తో సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం పిల్లలే కాదు ఎవరూ తిన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా? - పేరెంట్స్​గా మీరు ఇవి పాటించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.