Health Benefits Of Eating Soaked Raisins : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందించాలి. మన శరీరానికి శక్తిని ఇచ్చే వాటిలో ఉదయం మనం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యమైంది. అలాంటి ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా శరీరానికి శక్తినిచ్చే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. అలాంటి వాటిల్లో మిల్లెట్స్, ప్రొటీన్స్, పాలు, గింజలు, పండ్లు ఉండే విధంగా చూసుకోవాలి.
అయితే ప్రతిరోజూ నానబెట్టిన ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల రోజు మొత్తం శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఎండుద్రాక్ష జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఐరన్ లెవల్స్ పెంచడంతోపాటు ఎముకలను స్ట్రాంగ్‌గా మారుస్తుంది. ఎండు ద్రాక్షలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో చూద్దాం.
1. బరువును తగ్గిస్తుంది :
ఎండు ద్రాక్షలో సహజచక్కెరలు ఉంటాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ వీటిలోని ఫైబర్ వల్ల త్వరగా ఆకలి తీరిపోతుంది. అంతేకాదు ఇవి తింటే ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల మరలా మరలా తినాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మీరు బరువు తగ్గుతారు.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :
ఎండిన ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అవి సహజ ఔషధంలా పనిచేస్తాయి నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే మలబద్ధకం తగ్గుతుంది. ప్రేగు కదలికలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇవి సహకరిస్తాయి.
3. రోగనిరోధక శక్తిని పెంచుతాయి :
ఎండుద్రాక్షలో విటమిన్లు బి, సి అధికంగా ఉంటాయి. ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి. ఎండుద్రాక్షలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు జ్వరాలు, ఇన్‌ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి.
4. శరీరానికి బలాన్ని ఇస్తాయి :
ఎండుద్రాక్షలో సహజమైన ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. కనుక ఇవి మనలోని బలహీనతను రూపుమాపుతాయి. బరువు పెరగకుండా సహాయపడతాయి.
5. ఎముకలను బలంగా ఉంచుతాయి :
ఎముకల బలహీనత అనేది మహిళల్లో ఒక తీవ్రమైన సమస్య. మరి ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలకు కాల్షియం చాలా ముఖ్యం. నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల కాల్షియం భర్తీ చేసుకోవచ్చు. ఎండుద్రాక్షలో కాల్షియంతోపాటు సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. నానబెట్టిన ఎండుద్రాక్షను ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి.