Health Benefits Of Curry Leaves Water : కరివేపాకు కేవలం కూరల్లో రుచి, వాసనను ఇవ్వడం మాత్రమే కాదు, మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఆకు తింటే కలిగే లాభాలు అన్నిఇన్ని కావు. చాలా మంది కరివేపాకును తేలిగ్గా తీసుకుంటారు. కూరలో కనిపించిందంటే చాలు దానిని పక్కకు పారేస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు పరగడుపున కరివేపాకు నీళ్లు తాగడం ద్వారా శరీరానికి కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం ఇప్పటి నుంచి దానిని మీరు అయిష్టంగా చూడరు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకుతో లాభాలు
Curry Leaves Water In Empty Stomach : నానబెట్టిన కరివేపాకు నీళ్లను రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఆహారం అరిగేందుకు సహాయం
కరివేపాకు నీటిని ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కరివేపాకు ఆకులు మీ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది
కరివేపాకులో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు నీటిని ప్రతిరోజు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు పదార్ధాలను బటయకు పంపిస్తుంది. బాడీ సిస్టమ్‌ను కంట్రోల్లో పెడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
జుట్టు పెరుగుదల
శిరోజాలు ఆరోగ్యకరంగా పెంచే లక్షణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కరివేపాకు నీటిని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ఇది జుట్టు కుదుర్లను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.
చర్మ ఆరోగ్యం
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేస్తుంది. పరగడుపున కరివేపాకు నీళ్లను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ చర్మం సహజసిద్ధంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.
బ్లడ్ షుగర్ కంట్రోల్
కరివేపాకులో హైపోగ్లైసమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పరిగడుపున కరివేపాకు నీళ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గవచ్చు
కరివేపాకు ఆకుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొవ్వును కరిగించడంలో దోహదం చేస్తాయి. తద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.
ఇమ్యునిటీ బూస్టర్
ప్రతిరోజూ పరగడుపున కరివేపాకు నీళ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ కవచంలా రక్షిస్తాయి. మీ శరీరం త్వరగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా కరివేపాకు నిరోధిస్తుంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
కరివేపాకు గుండెకు మేలు చేస్తుంది. గుండెకు హాని కలిగించే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయులు కరివేపాకు నీళ్లు తాగడం ద్వారా తగ్గుతాయి. ప్రతిరోజు కరివేపాకు నీళ్లు తీసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అతిగా గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ 5 సైడ్ ఎఫెక్ట్స్ గ్యారెంటీ!
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సమస్యకు చెక్!