Black Salt Water Health Benefits : మనలో చాలా మందికి ఉప్పు అనగానే.. తెల్లగా ఉండేది మాత్రమే గుర్తొస్తోంది. కానీ.. మీకు నల్ల ఉప్పు తెలుసా? ఈ నల్ల ఉప్పును(Black Salt) ఆహారంలో చేర్చుకున్నా.. లేదంటే రోజూ ఒక గ్లాసులో చిటికెడు నల్ల ఉప్పు వేసుకొని తాగినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇంతకీ.. బ్లాక్ సాల్ట్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం : మొదట నలుపు రంగులో ఉండి.. పొడి చేయగానే లేత పింక్ కలర్‌లో కనిపించే బ్లాక్ సాల్ట్‌లో తెల్ల ఉప్పు కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఐరన్, పోటాషియం, మెగ్నీషియం, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
శరీరానికి చలువనిస్తుంది : నల్ల ఉప్పులో బాడీని కూల్‌గా ఉంచడానికి సహాయపడే అనేక గుణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే.. ఎండాకాలంలో శరీరానికి చలువ అందించే ఈ ఉప్పును లెమనేడ్, ఆమ్ పన్నా.. వంటి కొన్ని రకాల సమ్మర్ డ్రింక్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీన్ని 'కూలింగ్ సాల్ట్'గా కూడా పిలుస్తారు.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : బ్లాక్ సాల్ట్ కడుపులోని మలినాలను తొలగించడంలోనూ చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పించడమే కాకుండా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపర్చడానికీ ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.
2018లో 'జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నల్ల ఉప్పు తీసుకున్న వారిలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసన్ రావు పాల్గొన్నారు. నల్ల ఉప్పులోని పోషకాలు కడుపులోని మలినాలను తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు!
జీవక్రియ రేటు పెరుగుతుంది : నల్ల ఉప్పు కలిపిన వాటర్ తాగడం వల్ల శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుందంటున్నారు. ఎందుకంటే ఈ వాటర్‌లో భేదిమందు గుణాలు ఉంటాయని, జీవక్రియ రేటు పెరగడానికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
కాలేయానికి మేలు : బ్లాక్ సాల్ట్ వాటర్ కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో చాలా బాగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఫలితంగా.. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. రక్తంలోని మలినాలను బయటకు పంపడంలో ఈ నీళ్లు తోడ్పడతాయంటున్నారు. అలాగే ఎలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్లూ రాకుండా నివారిస్తుందని చెబుతున్నారు.
కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది : నల్ల ఉప్పులోని పొటాషియం.. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల్ని తగ్గించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, తరచూ కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
చర్మం ఆరోగ్యానికి మేలు చేస్తుంది : నల్ల ఉప్పు తీసుకోవడం ద్వారా చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. నల్ల ఉప్పును మీరు యూజ్ చేసే క్లెన్సర్లు, స్క్రబ్స్‌లో భాగం చేసుకొని వాడితే చర్మం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. ఇది చర్మంపై ఉండే జిడ్డును పోగొట్టడంతోపాటు మొటిమల సమస్యనూ దూరం చేస్తుందంటున్నారు. ఈ ఉప్పును స్నానం చేసే నీటిలో వేసుకున్నా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. నల్ల ఉప్పు జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించడానికి దోహదం చేస్తుంది. బలహీనంగా మారిన కుదుళ్లను బలంగా మార్చుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్ ఇలా టెస్ట్ చేసుకోండయ్యా!