Benefits of Applying Coconut Oil On Body : కొబ్బరితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయో మనందరికీ తెలిసిందే. అయితే కొబ్బరే కాదు దాని నుంచి తయారుచేసే సహజమైన నూనెతో కూడా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. మనం సాధారణంగా అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం రోజూ తలకు కోకోనట్ ఆయిల్ రాసుకుంటాం. కానీ, అదే కొబ్బరి నూనె(Coconut Oil)ను శరీరానికి అప్లై చేయడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ, ఆ ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది : కొబ్బరి నూనెను కాప్రిక్, లారిక్ యాసిడ్ అని కూడా పిలుచుకుంటాం. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కోకోనట్ ఆయిల్లో విటమిన్ కె, ఎ ఇంక ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇందులో ఉండే యాంటీ-మైక్రోబయల్ ప్రాపర్టీ చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అలాగే దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు డెడ్ సెల్స్‌ను తొలగించి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలెర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.
అధిక మాయిశ్చరైజింగ్ : కొబ్బరి నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఇది స్కిన్‌ను మృదువుగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రై, రఫ్ స్కిన్ కోసం ఇది మంచి హోం రెమిడీ. ముఖ్యంగా పొడి చర్మాన్ని నిరంతరంగా తేమగా ఉంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారినట్టుగా, గరుకుగా ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ఉపయోగించాలి. ఇలా తరచుగా చేయడం వలన మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
మొటిమలను తగ్గిస్తుంది : కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. దీనిలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్ చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి కారణమవుతాయి. పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీ ఫేస్‌పై ఉండే చర్మ రంధ్రాలు మూతపడినట్టు అర్థం. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రాత్రి పూట కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే ఆ రంధ్రాలు తెరుచుకుని మొటిమలు తగ్గుతాయంటున్నారు నిపుణులు.
Coconut Health Benefits In Telugu : అధిక బరువు, జుట్టు సమస్యలకు కొబ్బరితో చెక్!
కొల్లాజెన్ స్థాయిలను పెంచుతుంది : కొబ్బరి నూనెను శరీరానికి అప్లై చేయడం ద్వారా మీరు పొందే మరో ప్రయోజనం ఏంటంటే.. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్, కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇవి చర్మ కణాల పునరుత్పత్తి, రిపేర్ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
టోన్ స్కిన్ : కోకోనట్ ఆయిల్ నల్లటి వలయాలు, నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపు, ముఖం ఎరుపును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ నూనె చర్మాన్ని టోన్ చేయడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల కొల్లాజెన్ సహజ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపర్చడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కాబట్టి మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓసారి కొబ్బరినూనె ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మార్పు మీరే గమనిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
కొబ్బరి పీచును పారేస్తున్నారా? - ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!