Beauty Benefits of Drinking Haldi Water : పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకే డైలీ మనం చేసుకునే అన్ని వంటకాల్లో దాదాపుగా పసుపును వినియోగిస్తుంటాం. ఇది వంటలకు రంగు, రుచిని ఇవ్వడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు.. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పసుపు(Turmeric Powder) చాలా కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని సుగుణాలు, ఔషధ గుణాలు పలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసి మోముకు మెరుపును తెచ్చిపెడతాయంటున్నారు. అయితే, అందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజూ పసుపు వాటర్‌ను తాగడమే! ఇలా డైలీ తాగడం వల్ల అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం : పసుపులో ఉండే పోషకాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కణాలు దెబ్బతినకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు డైలీ పసుపు నీరు తీసుకోవడం ద్వారా మంచి గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చంటున్నారు.
మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది : పసుపులో ఉండే కర్కుమిన్.. బ్యాక్టీరియాతో పోరాడటానికి, వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మొటిమల చికిత్సలో, మచ్చలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
యవ్వనంగా కనిపిస్తారు : మీరు డైలీ పసుపు వాటర్ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను అడ్డుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చిన్న వయసులో వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఇది ముఖంపై ముడతలు, గీతలు రాకుండా చేసి.. నవయవ్వనంగా ఉంచేలా తోడ్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు పసుపు కలిపిన నీరు లేదా పసుపు ఆధారిత క్రీమ్‌ను కళ్ల కింద అప్లై చేయడం ద్వారా ఈజీగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.
2019లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. డార్క్ సర్కిల్స్ ఉన్న వారు రోజుకు రెండు సార్లు పసుపు ఆధారిత క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని డెర్మటాలజీ అండ్ కాస్మెటిక్ సర్జరీ విభాగంలో పని చేసే డాక్టర్. సంజయ్ శర్మా పాల్గొన్నారు. పసుపులోని పోషకాలు కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
ముఖం తళతళ మెరిసిపోవాలా? కరివేపాకుతో ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయండి! - Curry Leaves Benefits
గాయాలను నయం చేస్తుంది : పసుపులోని కర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై గాయాలను నయం చేయడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
అదనపు సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది : సాధారణంగా చర్మంపై సెబమ్ ఉత్పత్తి పెరగడం వల్ల చర్మంపై ఎక్కువ నూనె ఉత్పత్తై జిడ్డుగా మారుతుంది. ఫలితంగా ఫేస్‌పై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. అదే మీరు పసుపు వాటర్ తీసుకోవడం వల్ల సెబమ్ ఉత్పత్తి నియంత్రణలో ఉండి జిడ్డు చర్మం ఏర్పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా.. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో పసుపు వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తామర, సోరియాసిస్, రోసేసియా.. వంటి చర్మ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ అలవాట్లు ఫాలో అయ్యారంటే - అద్దిరిపోయే అందం మీ సొంతం! - Korean Habits for Good Health