ETV Bharat / health

హెయిర్ స్ట్రెయిటెనింగ్ Vs హెయిర్ స్మూతింగ్ - మీకు ఏది సూట్​ అవుతుందో తెలుసా? - Hair tips

Hair Straightening Vs Hair Smoothing : అమ్మాయిల అందాన్ని మెరిపించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. హెయిర్‌ అందంగా కనిపించడానికి చాలా మంది హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ స్మూతింగ్ చేయించుకుంటారు. అయితే.. ఈ ట్రీట్‌మెంట్‌ జుట్టు రకాన్ని బట్టి చేయించుకోవాలని.. అందరికీ ఒకే రకం సూట్ కాదని మీకు తెలుసా? మరి.. మీకు ఏది సెట్ అవుతుందో ఇలా తెలుసుకోండి.

Hair Straightening Vs Hair Smoothing
Hair Straightening Vs Hair Smoothing
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 3:13 PM IST

Hair Straightening Vs Hair Smoothing : నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో అందంగా కనిపించడానికి మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల కాస్మొటిక్‌ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. చర్మ సౌందర్యంతోపాటు జుట్టు కూడా అందంగా కనిపించడానికి బ్యూటీపార్లర్​కు వెళ్లి హెయిర్ స్ట్రెయిటెనింగ్, హెయిర్ స్మూతింగ్ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటున్నారు. అయితే.. చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. ఏదైతే ఏముందిలే అని చేయించుకుంటారు. కానీ.. ఇలా చేయొద్దని నిపుణులంటున్నారు. ఎటువంటి హెయిర్‌ ఉన్న వారికి ఏ ట్రీట్‌మెంట్‌ సూట్ అవుతుందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

హెయిర్ స్ట్రెయిటెనింగ్ :
హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకోవడం వల్ల జుట్టు చిక్కులు లేకుండా స్ట్రెయిట్‌గా మారుతుంది. మొట్ట మొదటి సారిగా ఈ ట్రీట్‌మెంట్‌ ఆఫ్రికాలో జరిగిందట. అక్కడ జుట్టురాలుతున్న వారు ఆ సమస్యను తగ్గించుకోవడానికి హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకున్నారట. సాధారణంగా ఇందులో రెండు రకాలున్నాయి. ఒకటి టెంపరరీ హెయిర్ స్ట్రెయిటెనింగ్, రెండోది పర్మనెంట్‌ హెయిర్ స్ట్రెయిటెనింగ్.

టెంపరరీ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటే జుట్టు విడదీసిన తర్వాత మళ్లీ మామూలుగానే చిక్కులుగా మారుతుంది. అదే పర్మనెంట్‌ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకుంటే 3-6 నెలల వరకూ జుట్టు స్ట్రెయిట్‌గా ఉంటుంది. కానీ.. ఈ ట్రీట్‌మెంట్‌లో కొన్ని రకాల కెమికల్స్‌ ఉపయోగిస్తారు. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.

స్కార్ఫ్‌ ధరిస్తే మొటిమలు వస్తున్నాయా? - క్రీమ్స్ వాడకుండా ఇలా తగ్గించుకోండి!

హెయిర్ స్మూతింగ్ :
హెయిర్ స్మూతింగ్ ట్రీట్‌మెంట్‌ను 'బ్రెజిలియన్ కెరాటిన్ ట్రీట్మెంట్' లేదా 'బ్రెజిలియన్ బ్లోఅవుట్ ట్రీట్మెంట్' అని కూడా అంటారు. దీనిని బ్రెజిల్‌ దేశంలో 2003లో కనుగొన్నారట. ఈ హెయిర్ స్మూతింగ్ ట్రీట్‌మెంట్‌ జుట్టును తాత్కాలికంగా అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో ముందుగా మీ హెయిర్‌ను ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో నానబెట్టి ఎండబెడతారు. ఆ తర్వాత స్ట్రెయిటెనింగ్‌ మెషీన్ల సహాయంతో స్ట్రెయిట్‌గా చేస్తారు. అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే.. హెయిర్ స్ట్రెయిటెనింగ్‌లో ఉపయోగించే కెమికల్స్‌ కంటే ఈ హెయిర్ స్మూతింగ్ ట్రీట్‌మెంట్‌లో వాడే కెమికల్స్‌ తక్కువ దుష్ప్రభావాలను అందిస్తాయట.

ఎవరికి ఏది బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది ?

  • ఉంగరాల జుట్టు ఉన్న వారు హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకోవాలి.
  • మీ జుట్టు అందంగా ఉండేదాన్ని బట్టి 8-12 వారాలకు ఒకసారి చేయించుకుంటే మంచిది.
  • హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకునే ముందుగా జుట్టుకు హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని అప్లై చేసుకోవాలి.
  • జుట్టు చిక్కులుగా ఉండేవారు హెయిర్ స్మూతింగ్ చేసుకుంటే మంచిదని నిపుణులంటున్నారు.

హెయిర్ స్ట్రెయిటెనింగ్ సైడ్ ఎఫెక్ట్స్ :

  • హెయిర్ స్ట్రెయిటెనింగ్‌ను స్కాల్ప్ పై ఉపయోగించకూడదు.
  • ఎందుకంటే అక్కడ చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది.
  • హెయిర్ స్ట్రెయిటెనింగ్‌ సరిగ్గా చేయకపోతే జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పల్చబడడం, జుట్టు నెరిసిపోవడం, జుట్టు చిట్లడం, చివర్లు చిట్లడం వంటివి జరుగుతాయి.

హెయిర్ స్మూతింగ్ సైడ్ ఎఫెక్ట్స్ : జుట్టు రాలడం, స్కాల్ప్‌పై చికాకు రావడం, కొంత మందిలో కెమికల్స్‌ వల్ల అలర్జీలు రావొచ్చు.

చివరిగా : మీరు హెయిర్ స్ట్రెయిటెనింగ్ గానీ లేదా హెయిర్ స్మూతింగ్ చేయించుకునే ముందు మీ జుట్టు రకానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించడం మంచిది.

పిల్ల‌ల్లో స్థూల‌కాయం త‌గ్గాలా? అందుకోసం పెద్ద‌లు చేయాల్సిన ప‌నులివే!

కాఫీ బంద్ చేయలేకపోతున్నారా? - బదులుగా ఇవి తాగండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.