ETV Bharat / health

గంజిని వేస్ట్​గా పారబోస్తున్నారా? మీ జుట్టుకు ఇలా వాడి చూడండి- హెయిర్​ సేఫ్​! - Hair Growth With Rice Water - HAIR GROWTH WITH RICE WATER

Hair Growth With Rice Water : బియ్యం కడిగిన నీళ్లను వృథాగా పారేస్తున్నారా? అయితే మీరు చాలా చాలా మిస్​ అవుతున్నారన్న మాట. ముఖ్యంగా సౌందర్య ప్రియులు ఈ నీటిని పారబోస్తే ఎన్నో లాభాలను పారేస్తున్నట్లేనట. మీరు రోజూ పడేసే రైస్​ వాటర్ లేదా గంజి​ వల్ల వెంట్రుకలకు అనేక లాభాలు చేకూరుతాయట. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Maintain Good Hair With Rice Water
Hair Growth With Rice Water
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 9:14 AM IST

Hair Growth With Rice Water : ప్రతిపూట కాకపోయినా ప్రతిరోజు మన వంటింట్లో లభించే గంజి లేదా రైస్​ వాటర్​తో బోలెడన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా సౌందర్య ప్రియులు వీటిని సరిగ్గా వాడితే ఎలాంటి క్రీములు, లోషన్లు, నూనెలు, షాంపూలు లాంటివి అవసరమే లేదు. బియ్యం కడిగిన నీళ్లలోని పోషక విలువలు అందాన్ని రెట్టింపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా వెంట్రుకలకు రైస్​ వాటర్​ను(Rice Water For Hair) ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

మెరిసే కురులు
రైస్​ వాటర్​ మీ వెంట్రుకలకు సహజమైన మెరుపునిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్​ వెంట్రుకలకు రక్షణ పొరను ఏర్పాటు చేసి అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

బలం
బియ్యం కడిగిన నీళ్లలోని అమినో యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్​ జుట్టుకు చక్కటి పోషణను అందిస్తాయి. కుదుళ్ల నుంచి బలాన్ని చేకూర్చి వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి. అలాగే కుదుళ్లకు అవసరమైన సహజమైన పీహెచ్​ లెవెల్స్​ను పెంచి జుట్టు పొడిబారకుండా చూస్తాయి.

పట్టులా మృదువుగా
రైస్​ వాటర్​ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది. చాలా మందికి వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి పెరుగుదల ఆగిపోతుంది. బియ్యం కడిగిన నీటిలో ఉండే పోషకాలు, అమైనో యాసిడ్లు, విటమిన్లు మీ జుట్టును కుదుళ్ల నుంచి చివర్ల వరకూ ఆరోగ్యంగా ఉంచుతాయి. తరచూ మీ జుట్టుకు రైస్​ వాటర్​ను పట్టించడం వల్ల పగుళ్లు తగ్గి మంచి ఎదుగుదల కనిపిస్తుంది.

దురదకు చెక్​
చాలామందికి తలలో తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య దురద. చెమట, చుండ్రు లాంటి చాలా కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. అలాంటి వారికి రైస్​ వాటర్​ బాగా ఉపయోగపడతాయి. బియ్యం కడిగిన నీళ్లలో మీ తలలో ఉన్న దురద, చికాకును తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

చిక్కు సమస్య రానివ్వదు
బియ్యం కడిగిన నీటిని తరచుగా తలకు పట్టించడం వల్ల మీ వెంట్రుకలు మృదువుగా మారడమే కాకుండా చిక్కులు రాకుండా చేస్తుంది. ఫలితంగా మీరు మీకు నచ్చినట్టుగా ఎలాంటి హెయిర్​ స్టైల్​ వేసుకున్నా చిక్కు సమస్య అనేదే ఉండదు.

తయారీ విధానం

  • సగం కప్పు బియ్యం తీసుకుని వాటిని బాగా కడగండి.
  • అందులో ఒకటి నుంచి రెండు కప్పుల నీటిని పోసి కనీసం రెండు గంటలపైన లేదా రాత్రంతా నానబెట్టండి.
  • ఉదయాన్నే బియ్యం నుంచి నీటిని వేరు చేసి 5 నుంచి 10నిమిషాల పాటు వాటిని వేడి చెయ్యండి. నీరు కాస్త చిక్కబడ్డాక స్టవ్​ ఆపి, ఒక అరగంట వరకూ చల్లారనివ్వండి.

ఎలా రాసుకోవాలి

  • గోరు వెచ్చగా ఉన్న బియ్యం నీటిని మీ తల కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించి బాగా మర్దనా చేయండి.
  • 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉండి తరువాత తలను శుభ్రంగా కడుక్కోండి.
  • వారానికి కనీసం ఒక్కసారైనా ఇలా చేస్తే మీ జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కడుపుబ్బరంగా అనిపిస్తుందా? సమస్యకు ఫుల్​స్టాప్​ పెట్టండిలా! - Solution For Stomach Bloating

వేసవిలో ఫ్రిజ్​ నీళ్లు తాగితే - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - HEALTH PROBLEMS WITH FRIDGE WATER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.