ETV Bharat / health

ముల్తానీ మట్టి - ముఖాన్ని మాత్రమే కాదు జుట్టునూ మెరిపిస్తుంది! ఇలా వాడండి! - Hair Benefits Of Multani Mitti

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 5:26 PM IST

Multani Mitti Benefits For Hair : ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఆహారపు అలవాట్లు, వివిధ రకాల హెయిర్‌ కేర్‌ ప్రాడక్ట్‌లను వాడటం వల్ల చాలా మంది జుట్టు రాలడం, చిట్లి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, ఇలాంటి వారు ముల్తానీ మట్టితో కొన్ని రకాల హెయిర్‌ ప్యాక్‌లు ట్రై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Multani Mitti
Multani Mitti Benefits For Hair (ETV Bharat)

Hair Benefits Of Multani Mitti : ముల్తానీ మట్టితో ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకోవడం వల్ల మొటిమలు, జిడ్డు చర్మం తగ్గిపోయి ఫేస్‌ అందంగా కనిపిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది అందరికీ తెలిసిందే! అయితే, ముల్తానీ మట్టితో కొన్ని రకాల హెయిర్‌ ప్యాక్‌లు వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టుకి ఉన్న మురికిని, చుండ్రుని వదిలేలా చేస్తుందని.. జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి కురులను మృదువుగా, మెరిసేలా చేస్తుందంటున్నారు. కాబట్టి, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ముల్తానీ మట్టి హెయిర్‌ ప్యాక్‌లను ట్రై చేయాలని సూచిస్తున్నారు.

బియ్యప్పిండి, పెరుగు : ఒక గిన్నెలో ముల్తానీ మట్టి, బియ్యప్పిండి సమాన భాగాలుగా తీసుకోవాలి. ఇందులో కప్పు పెరుగు, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దీనిని మాడు నుంచి జుట్టు చివర్లకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత కెమికల్స్‌ లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఉన్న మురికి, చుండ్రు వదులుతుందని చెబుతున్నారు.

నిమ్మరసం, పెరుగు : ఒక గిన్నెలో నాలుగు చెంచాల ముల్తానీ మట్టిని తీసుకుని.. ఇందులో 2 చెంచాల నిమ్మరసం, చెంచా పెరుగు చేర్చి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచు చేయడం వల్ల కురులు నిగనిగలాడతాయి. ఈ మిశ్రమంలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు చుండ్రుని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

2017 లో "జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ముల్తానీ మట్టి చుండ్రును తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో పాకిస్తాన్‌లోని పంజాబ్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు.

అలర్ట్ : అమ్మాయిలూ అవాంఛిత రోమాలను షేవ్‌ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే కొత్త సమస్యలు!

గుడ్డులోని తెల్లసొన, నువ్వుల నూనె : ముందుగా కప్పు ముల్తానీ మట్టిని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో గుడ్డులోని తెల్లసొన, ఓ కప్పు నువ్వుల నూనె చేర్చి బాగా కలిపి తలకు పట్టించి ఆరనివ్వాలి. ఒక ఇరవై నిమిషాలాగి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. తర్వాత శీకాయతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

గులాబీనీళ్లు : ముల్తానీ మట్టికి కప్పు గులాబీనీళ్లు కలిపి బాగా మిక్స్‌ చేయండి. దీనిని తలకు ప్యాక్‌లాగా వేసుకోవాలి. ఇలా తరచు ప్యాక్‌ వేసుకోవడం వల్ల చుండ్రుకి కారణమయ్యే జిడ్డూ, దుమ్మూ, దూళిని మట్టి గ్రహిస్తుంది. ఆపై బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుని మాడుకి రక్తప్రసరణా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మాడుపై పీహెచ్‌ శాతాన్ని సమన్వయం చేస్తుందంటున్నారు.

నీళ్లు కలిపి పేస్ట్‌ : తల జిడ్డుగా ఉండే వారు ముల్తానీ మట్టి ప్యాక్‌ ట్రై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నీళ్లలో ముల్తానీ మట్టిని కలిపి తలకు పట్టించాలి. తర్వాత రసాయనాలు లేని షాంపుతో లేదా కుంకుడుకాయ రసంతో తల స్నానం చేస్తే జిడ్డు తగ్గిపోతుంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇంట్రస్టింగ్ : ఈ చిన్న టిప్స్​ పాటిస్తే చాలు - జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది!

పడుకునే ముందు పాదాలు కడుక్కుంటున్నారా? లేకుంటే మీ బెడ్ అంతా క్రిములే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.