Can We Drink Green Tea in Summer : ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ఆరోగ్యానికి మంచిదని గ్రీన్ టీ తాగుతున్నారు. డైలీ ఈ టీని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే, కొంతమందికి సమ్మర్‌లో గ్రీన్ టీ తాగడం మంచిదేనా అని సందేహం కలుగుతుంది ? మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ టీని పోషకాల పవర్ హౌజ్ అని కూడా అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, కాటెచిన్స్, ఆమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా మనం సొంతం చేసుకోవచ్చు. అయితే వేసవి కాలంలో గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో ఈ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని అంటున్నారు.
గ్రీన్ టీ తాగడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గుతారు : గ్రీన్ టీలో పాలీఫెనాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే పొట్ట చుట్టూ ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ గ్రీన్ టీ తాగాలని సూచిస్తున్నారు. 2018లో "అపెటైట్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్. అకిర ఇమాముర (Dr. Akira Imamura) పాల్గొన్నారు. అధిక బరువుతో బాధపడే వారు రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
షుగర్ అదుపులో : ప్రస్తుతం డయాబెటిస్ బాధితులు సంఖ్య పెరుగుతుంది. అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజూ ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అంటున్నారు.
రోజుకొకటి తప్పనిసరి- పండ్లు తింటూ ఈజీగా బరువు తగ్గండిలా! - Weight Loss Tips
మెదడు చురుకుగా పనిచేస్తుంది : రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో స్టిమ్యులేటర్ కెఫెన్ ఉంటుంది. కాఫీలో ఉండేంత కెఫెన్ లేకపోయినా కూడా.. ఇది మీ మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రీన్ టీ మన రక్తనాళాల లైనింగ్‌ను రిలాక్స్‌గా ఉంచడం ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- గ్రీన్ టీ తాగడం వల్ల రొమ్ము, అన్నవాహిక, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదం తగ్గుతుంది.
- గ్రీన్ టీ తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.