Good Sleeping Position Direction: రాత్రి పూట పడుకునే భంగిమకు ఆరోగ్యానికి సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కుడి వైపు కన్నా.. ఎడమ వైపునకు తిరిగి పడుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. 2007లో Journal of Clinical Gastroenterologyలో ప్రచురితమైన Sleep Position and Gastroesophageal Reflux Disease" అనే అధ్యయనంలో తేలింది. జీర్ణక్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైములు విడుదలవుతాయని వెల్లడించారు. ఫలితంగా ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- శరీరంలోని మలినాలను తొలగించాలంటే ఎడమ పక్కకి తిరిగి నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా శరీరం డీటాక్సిఫికేషన్ జరిగి ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. దీంతో తలనొప్పి, దీర్ఘకాలిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుందని వివరించారు.
- పొట్ట కింది భాగంలో ప్లీహముతో అనేక శరీర అవయవాలకు సంబంధం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎడమ వైపు పడుకుంటే ఈ వ్యవస్థకు రక్త సరఫరా మెరుగవుతుందని వివరించారు.
- గర్భిణులు ఎడమ పక్కకి పడుకోవడం వల్ల బిడ్డ కదిలేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా రక్త సరఫరా మెరుగుపడుతుందని.. ఇంకా వెన్నుముక, మోకాళ్లు సపోర్ట్‌గా నిలుస్తాయని వివరించారు.
- ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల గుండెకు రక్తసరఫరా తేలికగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గుండెపోటు, సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని వివరించారు.
- ఎడమ వైపు నిద్రించడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్త సరఫరా వేగంగా జరిగి మలినాలు బయటకు వెళ్లిపోతాయని వివరించారు.
- వెన్నుముకను దృఢంగా ఉంచడంతో పాటు కండరాల పనితీరును మెరుగుపరుస్తుందని అంటున్నారు. శరీరానికి తగిన విశ్రాంతి కూడా లభిస్తుందని వివరించారు.
- ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల భవిష్యత్తులో అల్జీమర్స్ లాంటి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా శరీరంలో వాపును తగ్గించడంలోనూ సహాయ పడుతుందని వివరించారు.
- కుడివైపునకు తిరిగి నిద్రపోయే వారిలో గుండెల్లో మంట, అజీర్తీ వంటి సమస్యలు వస్తున్నాయని అనేక అధ్యయనాల్లో తేలిందని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు రోజు చపాతీలు తింటున్నారా? ఇలానే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో గొంతు నొప్పితో బాధపడుతున్నారా? - ఈ ఔషధం తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనట!