ETV Bharat / health

ఆరోగ్యానికి మంచిదని 'అల్లం' ఎక్కువగా తీసుకుంటున్నారా? - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - Ginger Side Effects

Ginger Side Effects : వంటింట్లో ఉండే అల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనిని వంటల్లోనూ ఎక్కువగా వాడుతుంటాం. అయితే.. అధికంగా అల్లాన్ని వినియోగించడం వల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు!

Ginger Side Effects of Consuming Too Much
Ginger Side Effects (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 4:44 PM IST

Ginger Side Effects of Consuming Too Much : మనం ఛాయ్ దగ్గర నుంచి అన్ని రకాల కూరల్లో అల్లం ఎక్కువగా వాడుతుంటాం. జలుబు, దగ్గు, నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉపశమనం పొందేందుకు కూడా దీనిని ఉపయోగిస్తుంటాం. అయితే.. "అతి ఏదైనా అనర్థమే" అన్నట్టుగా.. అల్లం ఎక్కువగా తీసుకున్నా కూడా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణ సంబంధిత సమస్యలు : మన బాడీలోని జీర్ణవ్యవస్థను అల్లం ఉత్తేజపరుస్తుంది. అందుకే.. చాలా మంది ఆరోగ్య రీత్యా దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే.. ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదంటున్నారు నిపుణులు. పరగడుపున అల్లం తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గుండెలో మంట, డయేరియా వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే అల్లాన్ని అధికంగా తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

2016లో 'న్యూట్రిషన్ రీసెర్చ్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అల్లం అధికంగా తీసుకున్న వ్యక్తులు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను ఎక్కువగా అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘై జియాటాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ షు-హువాన్ లి పాల్గొన్నారు. అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది : అల్లం మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే హైపోగ్లైసీమియాకు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితికి దారితీస్తుందంటున్నారు. హైపోగ్లైసీమియా వల్ల కింది సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

  • వణుకు
  • చెమటలు పట్టడం
  • తలనొప్పి
  • ఆకలి లేదా వికారం
  • క్రమరహిత లేదా వేగవంతమైన హృదయ స్పందన
  • అలసట
  • చిరాకు లేదా ఆందోళన

కాబట్టి.. డయాబెటిస్‌ మందులు వాడుతున్నవారు అల్లం ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

అలర్జీ, చర్మ సమస్యలు : కొంతమందికి అల్లం మేలు చేస్తుందని.. మరికొందరికి ఇబ్బందులు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

అధిక రక్తస్రావం : అల్లం సహజంగా రక్తాన్ని పలుచన చేసే లక్షణాలతో నిండి ఉంది. గుండెలో రక్త ప్రసరణను నియంత్రించడంలో, పెంచడంలో సహాయపడుతుంది. అయితే.. పలు ఆరోగ్య సమస్యలుండి రక్తాన్ని పలుచనచేసే మందులు వాడుతున్నవారు అల్లం విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో అల్లం తీసుకోవడం వల్ల రక్త స్రావం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తలనొప్పి : అల్లం రక్తపోటును తగ్గించడంలో సహాయపడినప్పటికీ ఎక్కువగా మోతాదులో తీసుకుంటే అది మీకు తేలికపాటి తలనొప్పిని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మీ ఆహార అవసరాలను తీర్చడానికి రోజుకు 4 గ్రాముల అల్లం తీసుకుంటే సరిపోతుందట!

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్​గా ఉండడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.