ETV Bharat / health

గ్యాస్ సమస్య వేధిస్తోందా? అయితే ఈ సింపుల్​ చిట్కాలతో చెక్​ పెట్టేయండి! - Gastric Problem Solution In Telugu - GASTRIC PROBLEM SOLUTION IN TELUGU

Gastric Problem Solution In Telugu : సరైన సమయానికి ఆహారం తినకపోవడం దగ్గరి నుంచి జీర్ణ వ్యవస్థలో తలెత్తిన సమస్యల కారణంగా పొట్టలో గ్యాస్ సమస్య వేధిస్తుంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ గ్యాస్ సమస్య తలెత్తుంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. గ్యాస్​ సమస్యను ఎలా నియంత్రించాలో వివరంగా తెలుసుకుందాం.

Gastric Problem Solution In Telugu
Gastric Problem Solution In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 1:33 PM IST

Gastric Problem Solution In Telugu : సమయానికి భోజనం చేయకపోవడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్య మొదలవుతుంది. కారణాలు ఏవైనా కానీ పొట్టలో గ్యాస్ మొదలైతే, అది దీర్ఘకాలం పాటు వేధించే సమస్యగా మారుతుంది. చాలామంది మందులు వేసుకుంటేనో లేదంటే ఇతర మార్గాల ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు అనుకుంటారు. కానీ ఆహారం, జీవన శైలిలో మార్పులతో గ్యాస్​ను తగ్గించుకోవచ్చు. అవసరమైతే మందులను వాడటం ద్వారా పొట్టలో గ్యాస్​ సమస్యలను నివారించుకోవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. దానిని ఎలా నియంత్రించాలో చూద్దాం.

ఈ మార్పులు అవసరం
మన జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చుని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో గ్యాస్ సమస్యను తీవ్రతరం చేసే పొగతాగడం, కాఫీ తాగడం, చాక్లెట్లు తినడం లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవ్వు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలను తినాలని సలహా ఇస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యాలీఫ్లవర్, బ్రొకొలి, దోసకాయలు తింటే మేలు అని చెబుతున్నారు.

తప్పులు అసలు చేయకండి
మనలో చాలామందికి తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించే అలవాటు ఉంటుంది. ఇది పొట్టలో గ్యాస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుందని వైద్యులు అంటున్నారు. తిన్న వెంటనే నిద్రపోతే అరగక ఆహారం నోట్లోకి వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. చికెన్, చేపలు లాంటి వాటిని ఉడికించి లేదా కాల్చినా మంచిదే కానీ, వాటికి ఆయిల్ కలిపి ఏం చేసినా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు వైద్యులు.

పొట్టలో గ్యాస్ సమస్య మరీ వేధిస్తుంటే నివారణగా కింద పేర్కొన్న చిట్కాలను పాటించవచ్చు.

పుదీనా/పుదీనా టీ : పుదీనా ఆకులను నమిలినా లేదంటే పుదీనా టీ తాగినా పొట్టలో గ్యాస్ సమస్య నుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

చమోమిలే టీ (చామంతి) : చామంతితో చేసిన టీని తాగితే కూడా మంచి ఫలితం లభిస్తుంది.

యాక్టివేటెడ్ చార్ కోల్ ట్యాబ్లెట్లు : పొట్టలో అధిక గ్యాస్ వేధిస్తున్నప్పుడు గ్యాస్ సమస్య నుంచి విముక్తి కోసం యాక్టివేటెడ్ చార్ కోల్ ట్యాబ్లెట్లను డాక్టర్ల సలహా మేరకు వేసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్ : పొట్టలో గ్యాస్ సమస్య వేధిస్తున్నట్లయితే నీళ్లు, టీతో కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగితే సత్వర ఉపశమనం లభిస్తుంది.

లవంగాలు : గ్యాస్ సమస్య మరీ తీవ్రంగా వేధిస్తుంటే లవంగాలను తింటే మంచింది. లవంగాలు నూనెను ఆహారంలో వాడటం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే? - how much water to drink in Summer

TB తగ్గాక మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - World TB Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.