Foods To Eat In Each Decade Of Life : బతకడానికి ఆహారం తీసుకోవాలి కానీ, అందరి శరీర అవసరాలూ ఒకటి కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల పోషకాల అవసరాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. ఏజ్‌ను బట్టీ మారిపోతుంటాయి. మరి ఏ దశలో ఎలాంటి తీసుకోవాలో చూద్దామా?
ఏ వయసులో ఏం తినాలంటే?
10-15 ఏళ్ల వయసులో : ఎదిగే ఆడపిల్లలకు ప్రొటీన్ ఎక్కువగా అవసరముంటుంది. కానీ, ఈ జనరేషన్ పిల్లలు ఇష్టపడే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఎదుగుదల తగ్గి ఊబకాయం సమస్య బారిన పడుతుంటారు. దీనివల్ల హార్మోన్ల మార్పులు చిన్న వయసులోనే రుతుక్రమం ఆరంభం కావడం. ఇలా కా కూడదంటే వారికిచ్చే డైట్‌లో ఎగ్స్, ఆకు కూరలు, తాజాపండ్లు, ఆకుపచ్చని కూరగాయలతో పాటు నట్స్, వేరుశనగ, గోధుమలు, పెసలు వంటి పదార్థాలు ఉండేలా చూడండి. స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు బదులు ఫ్రూట్ సలాడ్, నువ్వులు, డ్రైఫ్రూట్స్ లడ్డూలు వంటివి ఇస్తే మంచిది. స్నాక్స్ అంటే మొలకల చాట్, సెనగలు, బొబ్బర్లతో చేసిన వడలు లాంటివి రుచి చూపించండి. ఇవన్నీ రుచికరంగా ఉంటాయి. దేహానికి శక్తిని ఇస్తాయి.
15-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు : టీనేజీ వయస్సు మొదలుకుని ముప్పైల వరకూ మహిళల జీవితంలో కీలకదశ. ఉన్నత చదువులూ, కెరియర్, వివాహం లాంటి లైఫ్‌లో ఎన్నో కీలక ఘట్టాలు జరిగేది ఇప్పుడే, ఈ హడావుడిలో పడి సరైన పోషకాహారం తీసుకోనివారు కొందరుంటే, బరువు పెరిగిపోతామనే భయంతో లెక్కలు వేసుకుని ఆహారాన్ని తినేవారు మరికొందరు. ఇలా చేయడం నెలసరి మీదే కాదు, పునరుత్పత్తి సామర్థ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అందాన్ని కాపాడుకోవాలన్నా : ఆరోగ్యానికే కాదు అందాన్ని కాపాడు కోవాలన్నా తగిన పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి. అందుకే అధిక కెలొరీలు ఉండే పప్పుధాన్యాలు, నట్స్, పండ్లు, ఫిష్, సోయాలను తగు మోతాదులో తీసుకోవాలి. తృణధాన్యాలు, లోఫ్యాట్ ప్రొడక్ట్స్, ఆకుపచ్చని కూరగాయలు తినాలి. రక్తహీనత రాకుండా పాలు, పౌల్ట్రీ, చేపలు, బచ్చ కూర, తోటకూర బీన్స్, కాయధాన్యాలు వంటి ఐరన్ పుష్కలంగా ఉండే వాటిని డైట్లో చేర్చుకోవాలి.
30-40 ఏళ్ల వయసువారు : ఈ దశలో వ్యక్తిగత, వృత్తి బాధ్యతలనేవి పెరుగుతాయి. దీనికితోడు హార్మోన్ల హెచ్చు తగ్గులు శారీరకంగా, మానసికంగా అలసటను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడంతో పాటు అధికబరువు, డిప్రెషన్ లాంటి పలు అనారోగ్య సమస్యలకూ దారితీయొచ్చు. ఈ పరిస్థితి రాకుండా పీచు పదార్థాలను తీసుకోవాలి. డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, సితో పాటు కొన్ని ఖనిజాలు అవసరమవుతాయి. ఇవి ఆస్టియోపొరోసిస్, అధిక రక్తపోటు(బీపీ), హృద్రోగ సమస్యలు, మదుమేహం కొన్ని రకాల క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి. ఇవి గుడ్లు, బీన్స్, నట్స్ - సీడ్స్ లభిస్తాయి. పండ్లు కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాల్లోనూ తగుమొత్తంలో ఉంటాయి.
40-60 ఏళ్ల వయసులో : చాలామంది మహిళల్లో 45-55 ఏళ్ల మధ్య మెనోపాజ్ దశఅనేది ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, అలసట, ఒత్తిడి, నీరసం, వెజైనా పొడిబారిపోవడం వంటి చికాకు లెన్నో కనిపిస్తాయి. వీటికితోడు వయసు పెరిగేకొద్ది ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వేదిస్తుంటాయి. ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించాలంటే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమవుతాయి. ఇవి గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు- మాంసం, చేపలు, ఆకుకూరలు, బ్రకోలీ, బార్లీ లాంటి వాటిలో ఈ పోషకాలు లభిస్తాయి.
60 ఏళ్లు పైబడిన మహిళలకు తీసుకునే ఆహారం త్వరగా జీర్ణమయ్యేదిగా ఉండేవిధంగా చూసుకోవాలి. అధికరక్తపోటు(బీపీ), మధుమేహం, గుండె జబ్బులు(హృద్రోగ సమస్యలు) ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఆహారంలో చక్కెర, ఉప్పు తగ్గించి వాడాలి. తగినంత ప్రొటీన్ కోసం బీన్స్, బఠాణీలు, కాయధాన్యాలు, సీఫుడ్, పాల ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు, కూరగాయలు, పండ్ల ముక్కలను తీసుకోవాలి. నీళ్లను తగుమొత్తంలో తాగాలి.
తియ్య తియ్యని సీతాఫలం - ఔషధ గుణాలు పుష్కలం
ఇంట్లో కెమికల్ ఫ్రెష్నర్స్ ఎందుకు? - ఈ సహజ పరిమళాలు వెదజల్లండి! - ఆరోగ్యం, ఆనందం మీ సొంతం