ETV Bharat / health

అలర్ట్‌ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 5:20 PM IST

Foods That Increase Stress : ప్రస్తుత జనరేషన్‌లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో 'ఒత్తిడి' ఒకటి. చాలా మంది ఈ స్ట్రెస్‌ అనేది.. ఎక్కువ పని చేయడం వల్ల కలుగుతుందని అనుకుంటారు. ఇది కొంత వరకు నిజమే కానీ.. మనం తీసుకునే ఆహారం కూడా ఆందోళనను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు..!

Foods That Increase Stress
Foods That Increase Stress

Foods That Increase Stress : ఈ రోజుల్లో చాలా మధ్య ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల పొద్దున లేచిన దగ్గర నుంచి.. రాత్రి నిద్ర పోయే వరకు ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. దీనివల్ల చాలా మందిలో ఒత్తిడి, మానసిక సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా స్ట్రెస్‌కు గురయ్యేలా చేస్తుందని అంటున్నారు! అవునండీ.. రోజు మనం తీసుకునే ఫుడ్ సైతం మనల్ని ఒత్తిడికి లోనయ్యేలా చేస్తుందట. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చక్కెర :
రోజువారి ఆహారంలో షుగర్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒక్కసారిగా శరీరంలో చక్కెర స్థాయులు పెరగడం, తగ్గడం కూడా స్ట్రెస్‌ను కలుగజేస్తుందని అంటున్నారు. తీపి పదార్థాలను దీర్ఘకాలికంగా ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్‌ వ్యాధి, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

కెఫీన్ :
కెఫీన్‌ ఉండే కాఫీ, టీ, కోలా వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆందోళన సమస్యలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు పెరుగుతాయని అంటున్నారు. కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అడ్రినల్‌ గ్రంథులకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే కెఫీన్ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగి.. చివరికి ఆందోళనను కలిగిస్తుందని తెలియజేస్తున్నారు.

ఫ్రైడ్‌ ఫుడ్‌ :
నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం వల్ల కూడా ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో అధిక మొత్తంలో ట్రాన్స్‌ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమవుతుందని అంటున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి.. క్రమంగా శరీరంలో ఒత్తిడి, ఆందోళనలకు కారణమవుతుందని తెలియజేస్తున్నారు.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు :
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తయారు చేయడానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను ప్రాసెసింగ్ ద్వారా తొలగిస్తారు. వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. పాలిష్‌డ్ బియ్యం, పాస్తా, ప్యాకెజ్‌డ్‌ ఫుడ్‌, వైట్‌ బ్రెడ్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటివి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

కృత్రిమ తీపి పదార్థాలు :
ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరగకూడదని, షుగర్‌ స్థాయులు నియంత్రణలో ఉండాలని చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌లను వినియోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌, ఎలుకలలో కృత్రిమ చక్కెర అస్పర్టేమ్‌తో పరిశోధన నిర్వహించారు. ఇందులో అస్పర్టేమ్ వల్ల ఎలుకలలో ఆందోళన కలిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్‌ అస్పర్టేమ్‌ను ఒకసారి తీసుకున్న తరవాత.. అది మిథనాల్‌, అస్పార్టిక్ యాసిడ్, ఫెనైల్‌అలనైన్‌గా విచ్ఛిన్నమవుతుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కంటి చూపు మందగించిందా? డైట్​లో ఈ ఆహారాలు చేర్చుకోవడం మస్ట్!

ఆఫీస్ స్ట్రెస్‌ నుంచి రిలాక్స్‌ పొందాలా? సాయంత్రం ఈ పనులు చేయండి!

దంతాలు ఆరోగ్యంగా ఉండి తెల్లగా మెరిసిపోవాలా? ఈ ఫుడ్స్​తో రిజల్ట్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.