ETV Bharat / health

మీ పాదాల్లో ఈ తేడాలున్నాయా? - అయితే మీకు ఆ రోగాలు రాబోతున్నట్టే!

Feet Tell about Your Health : మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామనే విషయాన్ని.. మన పాదాలే చెబుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాబోయే వ్యాధికి సంబంధించిన లక్షణాలు.. ముందుగా పాదాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు. మరి.. వాటిని ఎలా గురించాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 1:06 PM IST

Feet
Feet Tell about Your Health

Feet Tell about Your Health : శరీరంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. దానికి సంబంధించిన లక్షణాలు పాదాల్లో కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ విషయాన్ని ముందుగానే గుర్తిస్తే.. వేగంగా నయం చేసుకోవచ్చంటున్నారు. మరి.. పాదాలు(Feet) చేసే హెచ్చరికలను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్లాంటర్ ఫాసిటిస్ : పాదాల అరికాళ్లలో నొప్పిని కలిగించే పరిస్థితిని ప్లాంటర్ ఫాసిటిస్ అంటారు. ఇది మడమ నుంచి కాలి వరకు విస్తరించి ఉన్న పాదాల్లోని కణజాలం వాపు వల్ల వస్తుంది. అంటే.. అరికాళ్లలో ఉండే ఈ మందపాటి కణజాలం పాపునకు లోనైనప్పుడు ఈ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. దీనిని మీ పాదాలపై ఒత్తిడి తెచ్చినప్పుడు చాలా త్వరగా గమనించవచ్చు.

మధుమేహం : మీ పాదాలలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అంటే.. తిమ్మిర్లు రావడం, బర్నింగ్ సెన్సేషన్, పాదాలు చల్లగా అనిపించడం, జలధరింపులు, అరికాళ్లలో స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు అలర్ట్ కావాలి. ఎందుకంటే ఇవి మధుమేహానికి సంబంధించిన లక్షణాలు కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.

గౌట్ వ్యాధి : శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. దీని అత్యంత సాధారణ లక్షణం పాదాల్లో మంటగా అనిపించడం. నిప్పుల మీద నడుస్తున్న ఫీలింగ్ అనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అది మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.

అథ్లెట్ ఫూట్ : ఇది పాదాలను ప్రభావితం చేసే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది సోకినప్పుడు పాదాల మధ్య చర్మం ఎర్రగా మారి దురదగా అనిపిస్తుంది. పొలుసులుగా మారుతుంది. మీ పాదాల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది అథ్లెట్ ఫూట్​గా అనుమానించి.. వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

హీల్ స్పర్ : పాదాల వెనుక భాగంలో ఉండే ఎముక బయటకు పెరగడాన్ని హీల్ స్పర్ అంటారు. ఇది వస్తే​ పాదాల వంపు, మడమ ఎముక మధ్య కాల్షియం తక్కువై నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. తీవ్రమైన మంట, నొప్పిని కలిగిస్తుంది. ఇది అంతర్గత సమస్య కాబట్టి రోగనిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం బెటర్.

ఊబకాయం : శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయవలసి వచ్చినప్పుడు అనేక కీళ్ళు, కండరాలపై, ముఖ్యంగా పాదాలలో ఉన్న వాటిపై ఎక్కువ బరువు, ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ కారణంగా చీలమండ నొప్పి ఉంటాయి. వేగంగా బరువు పెరగటానికి ఇతర సంకేతాలు ఉన్నప్పటికీ.. పాదాలలో నొప్పి ఎక్కువగా ఉంటూ.. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.

ఇవేకాకుండా.. మరికొన్ని వ్యాధులు వచ్చే ముందు కూడా.. ఆ లక్షణాలు పాదాల్లో కనిపిస్తాయని చెబుతున్నారు. అందువల్ల.. మీ పాదాల్లో ఏదైనా తేడాగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

కీళ్లలో వచ్చే గౌట్​ నొప్పితో బాధపడుతున్నారా? వీటికి దూరంగా ఉంటే వెంటనే తగ్గిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.