ETV Bharat / health

బరువు తగ్గాలా? రోజు తినేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలట! సన్నగా మారిపోతారట!! - WEIGHT LOSS TIPS IN TELUGU

-బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? -ఆహారం తినే సమయంలో ఈ మార్పులు చేస్తే చాలట!

Eating Time Table for Weight Loss
Eating Time Table for Weight Loss (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Dec 6, 2024, 11:00 AM IST

Eating Time Table for Weight Loss: ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు వల్ల చాలా మంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని తగ్గించుకునేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కానీ వ్యాయామమే కాకుండా సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. బరువు అదుపులో ఉండడానికి తినే సమయానికి మధ్య సంబంధం ఉందని Journal of the Academy of Nutrition and Dieteticsలో తేలింది. Eating frequency, timing, and weight loss: A systematic review అనే అధ్యయనంలో పరిశోధకులు డాక్టర్ de la Iglesia R పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి మధ్య చాలా సమయం ఉండాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కొవ్వు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వివరించారు.
  • వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి భోజనం చేసేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా శరీరంలో పెరిగిన కొవ్వును కరిగించడానికి కొంత సమయం ఉంటుందని తెలిపారు.
  • ఆహారం సరైన సమయానికి తీసుకోవడం ద్వారా గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు సమానంగా విడదులవుతాయని చెబుతున్నారు. ఫలితంగా ఆకలి ఎక్కువగా వేయదని.. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటారని వివరించారు.
  • కొందరూ మధ్యమధ్యలో ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇలా తినడం వల్ల కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారం తిన్న తర్వాత సాధ్యమైనంత వరకు చిరుతిళ్లను దూరంగా పెట్టాలని వివరించారు.
  • ముఖ్యంగా ఉదయం అల్పాహారం త్వరగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా రక్తంలోని చక్కెర శాతం స్థిరంగా ఉంటుందని.. ఫలితంగా బరువు అదుపులో ఉంటుందన్నారు.
  • శరీరానికి తగ్గట్లుగానే ఆహార నియమాలు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం కావడమే కాకుండా బరువును కూడా నియంత్రించుకోవచ్చని అంటున్నారు.
  • వీలైనంత వరకు సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొవ్వును పెంచే ఆహారం, మసాలాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
  • సమయంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఇతర సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్స్ ఉపవాసం చేయొచ్చా? ఫాస్టింగ్​తో కలిగే బెనిఫిట్స్ ఏంటి?

కళ్లద్దాలు రోజు పెట్టుకుంటే చూపు మందగిస్తుందా? సైట్ వస్తే తగ్గించుకోవచ్చా? కళ్లకు ఏం తింటే బెస్ట్?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.