ETV Bharat / health

లంచ్​ బదులు ఈ సలాడ్​లు ట్రై చేస్తే - ఈజీగా బరువు తగ్గుతారు!

Weight Loss Salads: మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదా? అయితే ఓసారి ఈ సలాడ్లను ట్రై చేయమంటున్నారు నిపుణులు. దీంతో ఈజీగా బరువు తగ్గడమే కాదు.. ఆరోగ్యకరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మధ్యాహ్నం టైమ్ తీసుకోవాల్సిన ఆ సలాడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Weight Loss Salads
Weight Loss Salads
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 11:12 AM IST

Weight Loss Salads for Lunch: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి.. ఇలా పలు కారణాల వల్ల ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత, లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలోనే బరువు ఎక్కువ ఉన్నవారు ఎలాగైనా వెయిట్ లాస్(Weight Loss) అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి బరువు పెరగడం సులభం, కానీ దానిని తగ్గించడం అంత సులువైన పని కాదు. మరి మీరు కూడా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. ఓసారి మీ డైట్​లో లంచ్​కు బదులుగా ఈ సలాడ్స్ చేర్చుకుంటే.. ఈజీగా బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గ్రీక్ సలాడ్ : బరువు తగ్గాలనుకునే వారికి ఈ క్లాసిక్ మెడిటరేనియన్ సలాడ్ మధ్యాహ్న భోజనం కోసం ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. టమాటాలు, కీరదోసకాయలు, ఎర్ర ఉల్లిపాయలు, కలమటా ఆలివ్‌లు, ఫెటా చీజ్ లాంటి పదార్థాలు గ్రీక్ సలాడ్​లో ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఒరేగానోతో ఈ సలాడ్​ను సింపుల్​గా గార్నిష్​ చేసుకుని తినొచ్చు.

గ్రిల్డ్ చికెన్ అవకాడో సలాడ్ : ఈ సలాడ్​ కూడా బరువు తగ్గడానికి బెటర్ ఆప్షన్​ అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో గ్రిల్డ్​ చికెన్, అవకాడో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. అయితే ఈ సలాడ్ మరింత రుచికరంగా, పోషకరమైన ఆహారంగా మారడానికి కొన్ని టమాటాలు, కీర దోసకాయ ముక్కలు, ఫెటా చీజ్​ను యాడ్ చేసుకోవచ్చుంటున్నారు.

రోస్టెడ్ వెజిటబుల్స్​ క్వినోవా సలాడ్ : క్వినోవాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఆరోగ్యకరమైన భోజన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సలాడ్ కోసం ముందుగా బంగాళాదుంపలు, బెల్ పెప్పర్స్, బ్రోకలీ వంటి మీకు ఇష్టమైన కూరగాయలను రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత రుచి కోసం దానికి కొద్దిగా ఉడికించిన క్వినోవాను యాడ్ చేసుకోవాలి. అలాగే చివరగా పుదీనా, నిమ్మరసం, ఆలివ్​ నూనెతో సింపుల్​గా గార్నిష్​ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సలాడ్ రెడీ. ఇక లంచ్​కు బదులుగా దీనిని తిన్నా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

కాబ్ సలాడ్ : ఇది ప్రొటీన్-ప్యాక్డ్ సలాడ్. ఇందులో గ్రిల్డ్ చికెన్, ఉడికించిన గుడ్లు, అవకాడో, బేకన్, టమాటాలు, చీజ్ ఉంటాయి. వీటిని ముక్కలుగా చేసుకొని లైట్​గా గార్నిష్​ చేసుకోవాలి. అయితే ఈ కాబ్ సలాడ్ కూడా బరువు తగ్గడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

గ్రీన్స్‌ ట్యూనా సలాడ్ : లంచ్​కు బదులుగా మీరు ఈ గ్రీన్స్​ ట్యూనా సలాడ్ తీసుకున్నా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దీనిని చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు కొన్ని ఆకుకూరలు, కీర దోసకాయ ముక్కలు, చెర్రీ టమాటాలు, క్యాన్డ్ ట్యూనా సెలెరీ, ఎర్ర ఉల్లిపాయలు తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. అంతే గ్రీన్స్ ట్యూనా సలాడ్ రెడీ.

చిక్‌పీస్‌ రెయిన్‌బో సలాడ్ : ఈ సలాడ్ కూడా బరువు తగ్గడానికి ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగురంగుల సలాడ్‌లో ఎర్ర క్యాబేజీ, క్యారెట్లు, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలు, చిక్‌పీస్ వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్‌లు ఉంటాయి. అవసరమైతే దీనిని ఆలివ్ నూనె, వెనిగర్​తో సింపుల్​గా డ్రెస్సింగ్ చేసుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన చిక్​పీస్ రెయిన్​బో సలాడ్ మీ ముందు ఉంటుంది. ఇలా మేము పైన చెప్పిన సలాడ్లను కొన్ని రోజులు మీరు మధ్యాహ్నం భోజనానికి బదులుగా తీసుకున్నారంటే మీకే మీ వెయిట్​లో తేడా కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Skipping Health Benefits : పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా?.. రోజూ 'స్కిప్పింగ్'​ చేస్తే చాలు!

వాకింగ్​తో వెయిట్ లాస్​- వారంలో ఎన్ని రోజులు, ఎంత సేపు నడవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.