Natural Home Remedies For Blackheads : కొంతమంది చాలా అందంగా, ఫెయిర్‌గా ఉంటారు. కానీ.. ముక్కు, చెంపలు, గడ్డం దగ్గర బ్లాక్‌హెడ్స్ సమస్యతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు, లోషన్లు యూజ్ చేస్తుంటారు. మరికొందరు బ్లాక్‌హెడ్స్ తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్స్‌ను ఆశ్రయిస్తూ ఉంటారు. అలాకాకుండా వంటింట్లో లభించే ఈ పదార్థాలతో బ్లాక్‌హెడ్స్‌ను(Blackheads) ఈజీగా మాయం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తేనె, నిమ్మరసం : ఈ హోమ్ రెమిడీ బ్లాక్‌హెడ్స్ తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా ఒక చిన్న బౌల్లో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, చక్కెర తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని వాటర్‌తో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కొద్దిరోజుల్లోనే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు.
బొప్పాయి : బ్లాక్‌హెడ్స్ నివారణలో బొప్పాయి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికోసం బాగా పండిన బొప్పాయి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. తర్వాత అందులో పావుస్పూను శనగపిండి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి 25 నిమిషాలు ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల సమస్యను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పాలు : కొద్దిగా పచ్చిపాలు తీసుకొని వాటితో బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని వాటర్‌తో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేస్తే.. బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయంటున్నారు నిపుణులు.
డెలివరీ అయినా ముఖంపై నల్లమచ్చలు తగ్గడం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ఆల్ క్లియర్!
కొబ్బరి నూనె : దీనిలోని ఔషధ గుణాలు నల్లమచ్చలను పోగొట్టడంలో బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక చిన్న బౌల్లో టీ స్పూన్ చొప్పున పసుపు, కొబ్బరినూనె తీసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చూసుకోవాలి. ఆపై దాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి పావుగంట ఆగి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
2019లో 'Journal of Dermatological Treatment'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. పసుపులోని ఔషధగుణాలు బ్లాక్‌హెడ్స్‌ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పుణెలోని భారతీ విద్యాపీఠంలో చర్మవ్యాధి శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎ. దండోరే పాల్గొన్నారు. పసుపు సంబంధిత రెమిడీలు బ్లాక్‌హెడ్స్ నివారణకు చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
పుదీనారసం : ఒక బౌల్లో చెంచా పుదీనారసం, అరచెంచా పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని సమస్య ఉన్నచోట అప్త్లె చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారినికోసారి క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చంటున్నారు నిపుణులు. అయితే.. ఈ చిట్కా పాటించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ తప్పకుండా అప్త్లె చేసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి.
అరటిపండు : చిన్న బౌల్లో పండిన ఒక అరటిపండు గుజ్జు, చెంచా తేనె, రెండు చెంచాల గ్రౌండ్ ఓట్స్ తీసుకొని.. మిక్స్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. తర్వాత వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మొటిమలు, నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? - ఇలా ఈజీగా పోగొట్టండి!