ETV Bharat / health

ఇంట్రస్టింగ్ : మీరు వాడే చక్కెర స్వచ్ఛమైనదేనా? - సింపుల్​గా ఇలా చెక్ చేసుకోండి! - కల్తీదైతే ఇట్టే తెలిసిపోతుంది! - How to Find Adulterated Sugar

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 4:01 PM IST

How to Find Adulterated Sugar : పంచదార.. మనం డైలీ ఉపయోగించే ఆహార పదార్థాల్లో ఒకటి. ఇది లేనిదే టీ, కాఫీ, స్వీట్‌ వంటి వాటిని ప్రిపేర్‌ చేసుకోలేం. అయితే, ప్రస్తుత రోజుల్లో ప్రతీది కల్తీ అవుతున్న క్రమంలో.. మీరు వాడే పంచదార స్వచ్ఛమైనదో? కాదో? ఈ టిప్స్​ పాటించి తెలుసుకుంటే బెటర్​ అంటున్నారు నిపుణులు.

Easy Methods To Find Out Adulterated Sugar
How to Find Adulterated Sugar (ETV Bharat)

Easy Methods To Find Out Adulterated Sugar : నేటి రోజుల్లో ‘కల్తీకి కాదేదీ అనర్హం’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కారణం.. మనం తినే ప్రతి ఆహార పదార్థం కల్తీగా మారుతుంది. ఈ క్రమంలోనే కొందరు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మనం నిత్యం ఉపయోగించే పంచదారను కూడా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా యూరియా, చాక్ పౌడర్, తెల్ల ఇసుక, చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను పొడి చేసి చక్కెరలో కలిపి కల్తీ చేస్తున్నారు. ఫలితంగా ఇలాంటి చక్కెర తినడం ద్వారా డయాబెటిస్, విరేచనాలు, గుండె, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే.. మీరు వాడే చక్కెర(Sugar) మంచిదేనా? లేదా? అనేది ఓసారి పరిశీలించుకొని వాడుకోవడం మంచిదంటున్నారు. అయితే, అందుకోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఈజీగా ఈ టిప్స్​తో కల్తీ పంచదారను గుర్తించొచ్చు.

చక్కెరలో యూరియాను గుర్తించడం: చాలా మంది వ్యాపారులు చక్కెర బరువు పెరగడానికి యూరియాను కలుపుతుంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు వాడే చక్కెరలో యూరియా ఉందో? లేదో తెలుసుకోవడానికి.. ముందుగా గ్లాసు వాటర్ తీసుకొని అందులో టీస్పూన్ చక్కెరను వేసి.. అది పూర్తిగా కరిగే వరకు కలపాలి. అప్పుడు ఆ చక్కెర ద్రావణం నుంచి అమోనియా వాసన వస్తే కల్తీ జరిగినట్టు అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలా కాకుండా వాసన ఏమీ రాకపోతే అది కల్తీ జరగలేదని భావించాలంటున్నారు.

2019లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చక్కెరలో యూరియా కలిపినట్లైతే అది నీటిలో కరిగినప్పుడు అమోనియా వాసన వస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాకిస్థాన్​ కరాచీలోని జిన్నా సింధ్ మెడికల్ యూనివర్శిటీలో డిపార్ట్​మెంట్​ ఆఫ్​ కెమిస్ట్రీలో అసోసియేట్​ ప్రొఫెసర్​ డాక్టర్ మహమ్మద్ ఇక్బాల్ ఆఫ్రిది పాల్గొన్నారు.

పాలల్లో చక్కెర వేసుకొని తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

చక్కెరలో సున్నం లేదా ప్లాస్టిక్ పొడిని గుర్తించడం: మీరు వాడుతున్న చక్కెరలో సున్నం లేదా ప్లాస్టిక్​ వస్తువుల పొడిని గుర్తించేందుకు.. ముందుగా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో ఒక టీస్పూన్ చక్కెర వేసి కరిగించుకోవాలి. అప్పుడు అది పూర్తిగా వాటర్​లో కరిగితే దాన్ని స్వచ్ఛమైనదిగా చెప్పుకోవచ్చంటున్నారు. అలాకాకుండా వాటర్​లో కరగకుండా కొన్ని కణాలు కనిపిస్తుంటే మాత్రం అది కల్తీదని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే.. ప్లాస్టిక్ కణాలు కలిస్తే దాని కణాలు గ్లాసు అడుగు భాగంలో గడ్డకట్టుకుపోవడం కనిపిస్తుందని సూచిస్తున్నారు. ఈ రెండు పరీక్షలే కాకుండా ఇతర టెస్టుల ద్వారా కూడా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవి..

అయోడిన్ పరీక్ష : ఈ పద్ధతి ద్వారా కల్తీ పంచదారను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాసులో కొద్దిగా పంచదార తీసుకొని కరిగించాలి. ఆపై అందులో కొన్ని చుక్కల అయోడిన్​ను యాడ్ చేసుకోవాలి. అప్పుడు అది స్వచ్ఛమైన పంచదార అయితే ఆ ద్రావణం పసుపు రంగులోకి మారుతుందట. అదే.. కల్తీ చక్కెర అయితే ఆ ద్రావణం నీలం లేదా గోధుమ రంగులోకి మారుతుందని అంటున్నారు.

మంటలో కాల్చడం : పేపర్ మీద కొద్దిగా పంచదారను తీసుకొని దాన్ని కాల్చడం ద్వారా కల్తీ చక్కెరను కనుగొనవచ్చంటున్నారు నిపుణులు. అంటే.. అలా కాల్చేటప్పుడు నీలిరంగు మంట వస్తే అది స్వచ్ఛమైన పంచదారగా చెప్పుకోవచ్చట. కానీ, అదే.. కల్తీ పంచదార అయితే పసుపు రంగు మంట వస్తుందట.

వెనిగర్ టెస్ట్ : దీని ద్వారా కల్తీ పంచదారను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్​లో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ చక్కెర వేసి కరిగించండి. ఆపై ఒక చుక్క వెనిగర్ అందులో వేయండి. అప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఆ ద్రావణం ఎరుపు రంగులోకి మారినట్లయితే అది కల్తీ అయిన చక్కెర కావచ్చట. అదే రంగు మారకపోతే మంచి చక్కెరగా భావించవచ్చంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

చక్కెర తింటే - మీ బ్రెయిన్​కు ఏమవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.