Best Exercises to Get Rid of Double Chin : అందం విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని చిన్న చిన్న సమస్యలు ముఖ వర్చస్సును దెబ్బతీస్తుంటాయి. అలాంటి సమస్యల్లో ఒకటి.. డబుల్ చిన్! గడ్డం దగ్గర అదనపు లేయర్‌లా కనిపించే ఈ సమస్యతో నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు చాలా మంది. దాంతో అందానికి అడ్డంగా మారే డబుల్ చిన్(Double Chin) ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. కొన్ని వర్కౌట్స్ ఫాలో అవ్వడం ద్వారా డబుల్ చిన్‌ను సులభంగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చూయింగ్ గమ్ నమలడం : డబుల్ చిన్ సమస్యతో బాధపడే వారు చూయింగ్ గమ్ నమలడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది పటిష్టంగా తయారవుతాయి. అందుకోసం.. రోజుకి కనీసం గంటపాటు వీటిని నమలడం ద్వారా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు ఈజీగా కరగడమే కాకుండా మంచి ముఖ వర్ఛస్సును సొంతు చేసుకోవచ్చంటున్నారు. అయితే, ఇక్కడ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ఎంచుకోవడం మంచిది.
గడ్డాన్ని స్ట్రెచ్ చేయడం : డబుల్ చిన్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ వర్కౌట్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. గడ్డాన్ని స్ట్రెచ్ చేయడం ద్వారా డబుల్ చిన్ ప్రాబ్లమ్ తగ్గడమే కాకుండా మీ ముఖం, మెడ కండరాలకి మంచి వ్యాయామం లభిస్తుందంటున్నారు. ఇది ఎలా చేయాలంటే.. ముందుగా నిలబడి తలని పైకి ఎత్తాలి. ఆపై నోటి లోపలికి నాలుకని లాగాలి. ఈ పొజిషన్లో 5 సెకన్లు పాటు తలను అలాగే ఉంచి ఆపై తలను కిందకి దించాలి. ఈ విధంగా రోజుకి 5 నుంచి 6 సార్లు చేయడం వల్ల మీ చిన్ మజిల్స్ మృదువుగా మారి డబుల్ చిన్ తగ్గుతుందట!
ఈ అలవాట్లు ఫాలో అయ్యారంటే - అద్దిరిపోయే అందం మీ సొంతం!
నాలుకని బయటపెట్టడం : ఇది కూడా డబుల్ చిన్ సమస్యను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. మీ నాలుకని వీలైనంత వరకు బయటకు చాచాలి. ఆ తర్వాత నాలుకని అటూ ఇటూ కదపాలి. అదే పొజిషన్లో 10 సెకన్ల పాటు ఉండాలి. ఇదీ ఒక యోగాసనమే. దీనినే సింహక్రియ అంటారు. రోజుకి రెండు, మూడు సార్లు ఈ వర్కౌట్ చేయడం వల్ల డబుల్ చిన్ తగ్గడమే కాకుండా గొంతు కండరాలు బలోపేతం అవుతాయంటున్నారు.
టెన్నిస్ బాల్ రూల్ : డబుల్ చిన్ సమస్యను తగ్గించుకోవడానికి ఇది కూడా మంచి వర్కౌట్ అంటున్నారు నిపుణులు. ఎలా చేయాలంటే.. ముందుగా ఒక టెన్నిస్ బాల్‌ను తీసుకొని దాన్ని గడ్డం కింద ఉంచి తలను కిందకి వంచాలి. గడ్డం మధ్యలో బాల్ని నొక్కుతూ ఐదు సెకన్ల పాటు హోల్డ్ చేయాలి. ఈ విధంగా రోజుకి 2 సార్లు చేయడం ద్వారా గడ్డం నుంచి ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గి ఈ సమస్య తగ్గిపోతుంది!
నెక్ రౌండ్ : మెడని రౌండ్‌గా తిప్పడం ద్వారా కూడా డబుల్ చిన్ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇది మెడపై ఫ్యాట్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీన్ని ఎలా చేయాలంటే.. ముందుగా కుర్చీపై కూర్చొని గడ్డాన్ని మీ ఛాతీ వరకు దించుకోవాలి. ఆపై తలను చుట్టూ తిప్పాలి. ప్రతి సైడ్‌కి 5 సెకన్ల పాటు ఈ విధంగానే చేయాలి.
మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ! - Skin Care Tips