ETV Bharat / health

మునగాకు నుంచి వేర్ల వరకూ అన్నింటితో లాభాలే- ఈ విషయాలు తెలుసా? - Health Benefits Of Drumstick Tree

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 2:26 PM IST

Drumstick Tree Leaves Health Benefits : మునగకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వాటితో సాంబార్, పప్పు, కారం పొడి లాంటి రకరాల ఆహార పదార్థాలు తయారు చేయడం కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ మునగాకు నుంచి వేర్ల వరకూ మీ కలిగించే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Etv Bharat
Etv Bharat

Drumstick Tree Leaves Health Benefits : ప్రకృతిలోని ప్రతి చెట్టు ఓ ప్రత్యేక లాభాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదం, వృక్షశాస్త్రం ప్రకారం ప్రతి మొక్కలో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందులో ఓ అద్భుతమైన మొక్క మునగ. మునగ చెట్టులో ఒకటి కాదు, కొన్ని వందల రకాల ఔషధ గుణాలుంటాయట. మునగ ఆకులు, కాయలు, బెరడు, పూలు, రసం, వేర్లు ఇలా ప్రతీది ఔషధాల తయారీలో ఉపయోగపడి, అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుందట. ఎన్నో రకాల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను నయం చేయగల శక్తి మునగ చెట్టుకు ఉందట. ఇవే కాకుండా మునగకాయలతో కూర, సాంబార్, మునగాకుతో కారంపొడి, మునగ రసంతో రొట్టెలు, ఇలా చాలా రకాలుగా మనం వాడే మునగ చెట్టు చేసే ఆ అద్భుతాలేంటో తెలుసుకుందాం.

చర్మ సంరక్షణకు!
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మునగ ఆకులు నిస్తేజమైన చర్మానికి తిరిగి తేజస్సు ఇవ్వగలవు. చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా తయారుచేయడంతో పాటు ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తాయట. మునగ ఆకు పేస్టు రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

కురుల ఎదుగుదలకు!
మునగ ఆకు రసం జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా సహాయపడుతుందట. దీన్ని తలకు రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గి, జుట్టు ఒత్తుగా మారుతుందట. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారేందుకు మునగాకు రసం బాగా పనిచేస్తుందట.

యాంటీ ఇన్ఫ్లమేటరీలతో!
మునగ ఆకులో ఐసోథియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో పలు చోట్ల వచ్చే వాపు, నొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే దీంట్లోని విటమిన్-సి, జీటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్‌ఫెరోల్ వంటి ముఖ్యమైన పోషకాలు నిండిన రోగనిరోధక శక్తిని బలపరిచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ!
కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి మునగ మంచి ఔషధంగా చెప్పవచ్చు. మునగ ఆకులు శరీరంలోని కొవ్వు తగ్గించడంలో గణనీయపాత్ర పోషిస్తాయని ఆయుర్వేదంలో నిరూపితమైంది. మునగాకుతో పప్పు, లేదా మునగాకు కారంపోడి తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ధమని గోడలలో ఫలకం ఏర్పడటాన్ని మునగాకు నిరోధిస్తుంది.

బరువు విషయానికొస్తే!
రోజూవారీ ఆహారంలో మునగను చేర్చుకోవడం పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మునగాకుతో టీ, మునగాకు పొడి, మునగాకు టమాట, మునగాకు పప్పు ఇలా ఏదో రకంగా మునగను తినడం వల్ల మీ శరీర బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది.

కాలేయానికి కాపలా!
మునగాకు పేస్టు, మునగాకు పొడి యాంటీ ట్యూబర్ క్యులర్ డ్రగ్స్ కారణంగా వచ్చే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇవి కాలేయాన్ని ఎల్లప్పుడూ రక్షించే సామర్థ్యం కలిగి ఉంటాయి. దెబ్బతిన్న కాలేయ కణాలను సరిచేయడానికి, ఆక్సీకరణ స్థాయిలను తగ్గించడానికి, ప్రోటీన్ స్థాయిలను మెరుగుపరచడానికి మునగ చెట్టు భాగాలన్నీ మీకు చక్కగా ఉపయోగపడతాయి.

కరివేపాకు మజ్జిగ తాగితే ఎన్నో లాభాలు! స్కిన్ ఇన్ఫెక్షన్లు దూరం! - Curry Leaves Buttermilk Benefits

ఈ పది లక్షణాలు కనిపిస్తే మలేరియా బారినపడ్డట్లే- అవేంటంటే? - Malaria Symptoms In Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.