Dont Overcooked These Foods: చాలా మంది ఆహార పదార్థాలను ఎక్కువ సేపు ఉడికిస్తారు. కానీ.. అలా చేయకూడదని అంటున్నారు నిపుణులు. కూరగాయలను ఎక్కువసేపు ఉడికిస్తే.. వాటిలోని విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఆవిరైపోతాయి. అంతేకాకుండా ఎక్కువగా ఉడికించిన లేదా బర్న్ చేసిన ఆహారంలో.. హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAs) అనే రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ స్టోరీలో చెప్పే ఆహార పదార్థాలను ఎక్కువసేపు ఉడికించవద్దని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
ఆకుకూరలు: పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఇంకా ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అయితే.. అధికంగా ఉడికించడం వల్ల అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. అందువల్ల ఎక్కువగా కుక్ చేయొద్దు. వాటి పోషక విలువలను కాపాడుకోవడానికి స్టీమింగ్ పద్ధతులను ఎంచుకోవడం మంచిది.
వయసును బట్టి నడక - మీరు రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?
బ్రోకలి: బ్రోకలిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఉడికించడం వల్ల పోషకాలు ఆవిరైపోతాయి. ఎక్కువగా ఉడికించడం వల్ల ముఖ్యంగా విటమిన్ సి కోల్పోతాము.
టమాట: టమాటలు లైకోపీన్‌ను కలిగి ఉంటాయి. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో సంబంధం ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. టమాటలను వండడం వల్ల కొన్ని పోషకాల జీవ లభ్యత పెరుగుతుంది. అయితే వీటిని అధికంగా ఉడికించడం.. లైకోపీన్ కంటెంట్‌లో తగ్గుదలకు దారి తీస్తుంది.
గింజలు: గింజలు పోషకాలకు కేంద్రాలుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, వివిధ విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అయినప్పటికీ.. వాటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేయడం వల్ల కొన్ని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సహా వాటి పోషక పదార్ధాలు తగ్గుతాయి. ముడి లేదా కనిష్ఠంగా ప్రాసెస్ చేసిన గింజలను తీసుకోవడం వల్ల వాటి పోషక ప్రయోజనాలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ టాప్-7 టిప్స్ మీకోసమే!
తృణధాన్యాలు: తృణధాన్యాలు సమతుల ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ.. తృణధాన్యాలను అతిగా ఉడికించడం లేదా ప్రాసెస్ చేయడం వల్ల వాటిలోని కొన్ని ఫైబర్ కంటెంట్, కొన్ని B విటమిన్లు కోల్పోవచ్చు. అందువల్ల వీటిని కాపాడే వంట పద్ధతులను ఎంచుకోవడం మంచిది.
ఫిష్: చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అయినప్పటికీ, చేపలను ఎక్కువగా ఉడికించడం వలన ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల నష్టానికి దారి తీస్తుంది. ఎందుకంటే.. అవి అధిక ఉష్ణోగ్రతల్లో సున్నితంగా ఉంటాయి. స్టీమింగ్ లేదా బేకింగ్ వంటి సున్నితమైన వంట పద్ధతుల ద్వారా చేపల్లోని పోషక విలువలను కాపాడుకోవచ్చు.
ఫస్ట్‌టైమ్ మేకప్ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!
గుడ్లు: ప్రొటీన్, బి-విటమిన్, మరిన్నింటిని అందించే పోషకాలు కలిగిన ఆహారం గుడ్డు. వీటిని అతిగా ఉడికించడం, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడకబెట్టడం లేదా వేయించడం వల్ల B12, ఫోలేట్ వంటి పోషకాలను కోల్పోతాయి.
బెర్రీస్: బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. బెర్రీలను వండడం లేదా ప్రాసెస్ చేయడం వల్ల వాటి విటమిన్ సి కంటెంట్ తగ్గుతుంది. బెర్రీలను తాజాగా లేదా తక్కువ వేడిలో తీసుకోవడం వల్ల వాటి పోషక ప్రయోజనాలను నిలుపుకోవచ్చు.
బంగాళాదుంపలు: ఆలుగడ్డలో పోషకాల కంటెంట్ ఎక్కువ. కానీ.. ఎక్కువగా ఉడకబెట్టిన బంగాళాదుంపల్లో విటమిన్లు, ఖనిజాలు తగ్గిపోతాయట.