Does Bathing With Salt Water White Hair : నగరాల్లో చాలా చోట్ల బోరు నుంచి వచ్చే వాటర్‌తోనే స్నానం చేస్తుంటారు. కొన్ని చోట్ల బోరు నుంచి ఉప్పు నీరు వస్తుంటుంది. అనివార్యంగా ఆ నీటితోనే స్నానం చేయాల్సి వస్తుంది. మరి.. ఉప్పు నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడిపోతుందా ? జుట్టు దెబ్బతింటుందా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నలకు నిపుణుల సమాధానం ఏంటో తెలుసుకుందాం.
వెంట్రుకల కుదుళ్లలో ఉండే మెలనోసైట్లు మన జుట్టుకు రంగును ఇస్తాయి. అయితే, వయసు పెరిగే కొద్ది ఈ మెలనోసైట్ల సంఖ్య తగ్గడం వల్ల జుట్టు తన సహజ రంగును కోల్పోతుందట. కానీ, చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటానికి చాలా కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలుష్యం, జన్యువులు, పోషకాహార లోపం వంటివి ప్రధాన కారణాలని అంటున్నారు.
ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు తెల్లబడుతుందా ?
సాధారణంగా పొడి జుట్టు సమస్య ఉన్న వారు ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారు తరచుగా ఎక్కువసేపు ఉప్పు నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఇంకా పొడిగా మారుతుందట. ఇంకా జుట్టు రాలడం, జుట్టు చివర్లలో ఉండే వెంట్రుకలు చిట్లిపోవడం జరుగుతుందని చెబుతున్నారు.
పరిశోధన వివరాలు :
'ఉప్పు నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు తెల్లబడుతుందా' అనే విషయంపై 2015లో ''జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్'' ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో 20 మంది పాల్గొన్నారు. అయితే, వీరిని రెండు గ్రూప్‌లుగా విడదీసి కొంత మంది జుట్టును మంచినీటితో, మరికొంత మంది జుట్టుని ఉప్పు నీటితో కడిగారు. అయితే.. ఉప్పునీటితో కడిగిన జుట్టు మంచినీటితో కడిగిన దాని కంటే ఎక్కువ ఒత్తిడికి గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే ఉప్పు నీటిలో కడిగిన జుట్టు తాజా మంచి నీటిలో కడిగిన జుట్టు కంటే ఎక్కువగా విరిగిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ఉప్పు నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు నెరిసిపోతుందని తేల్చారు.
ఉప్పు నీటితో స్నానం చేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి :
- సాల్ట్ వాటర్‌తో తలస్నానం చేయాల్సి వస్తే.. ముందుగా మంచి నీళ్లతో జుట్టును తడుపుకోండి.
- అలాగే స్నానానికి ముందు జుట్టుకు కొద్దిగా కొబ్బరి నూనెను రాసుకోండి.
- తలస్నానం చేసిన తర్వాత కూడా కొబ్బరి నూనెను రాసుకోండి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఉప్పు నీటితో తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు హెయిర్ మాస్క్ లేదా కండీషనర్ అప్లై చేయండి.
- దీనివల్ల జుట్టుకు తేమ అందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ లక్షణాలున్నాయా - గుండెపోటు రాబోతున్నట్టే!
పిల్లల్లో ఉబకాయం - పేరెంట్స్ ఈ పొరపాట్లు అస్సలే చేయొద్దు!
అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!