Best Time To Shower For Sleep : సాధారణంగా మనమంతా ఉదయం, సాయంత్రం స్నానం చేస్తుంటాం. మరి ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? నిపుణులు ఏం అంటున్నారు. ఏ టైంలో స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేస్తే మంచిదా? చల్లని నీటితో స్నానం చేస్తే మంచిదా? సాయంత్రం సుఖవంతమైన నిద్రకోసం స్నానం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా? ఇలాంటి సందేహాలకు ఈ కథనంలో సమాధానాలు తెలుసుకుందాం.!
స్లీప్ ఫౌండేషన్ సర్వే
వివిధ వయస్సుల వారు ఏ టైంలో స్నానం చేస్తారో అనే అశంపై స్లీప్ ఫౌండేషన్ 2022లో సర్వేల్లో నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న ఔత్సాహికులు తమ అభిప్రాయల్ని పంచుకున్నారు. ఉదయం స్నానం చేస్తామంటూ 42 శాతం మంది తెలపగా. 38 శాతం మంది సాయంత్రం జలకాలాడుతామని వెల్లడించారు. మరో ఇరవై శాతం మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించటంలో తటస్థంగా ఉన్నారు.
శాస్త్రవేత్తల అభిప్రాయాలు
పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలపై 2019లో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన నిర్వహించారు. రాత్రి పడుకోబోయే ముందు బాత్ టబ్, గోరువెచ్చని నీటిలో విశ్రాంతి తీసుకోవడం వల్లశరీరానికి స్వాంతన చేకూరుతుందని గుర్తించారు.
జీవన చక్రంపై ప్రభావం
శరీర ఉష్ణోగ్రతలు మనిషి జీవన చక్రంపై ప్రభావం చూపిస్తాయి. అయితే, సాయంత్రం వెచ్చని నీటీతో స్నానం చేయడంవల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. రక్త ప్రవాహం అదుపులో ఉండేందుకు సహాయ పడుతుంది. తద్వారా త్వరగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది.
కండరాలకు స్వాంతన
ఉదయం నుంచి శరీరంలోని వివిధ కండరాలు పనిచేసి అలసి పోతాయి. అలాంటప్పుడు సాయంత్రం వేడినీటితో స్నానం చేయడం వల్ల కండరాలకు స్వాంతన చేకూరుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుందని పడుకోగానే నిద్రపడుతుందని నిపుణులు తెలిపిరారు.
శరీరంపై క్రిములు దండయాత్ర చేయకుండా
చాలా మంది ఉదయం నుంచి వివిధ పనులు చేసి ఇంటికి రాగానే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే, అలా చేయడం ద్వారా శరీరంపై ఉన్న క్రిములు మన బెడ్‌పై తిష్టవేసే ప్రమాదం ఉందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరించారు. అందుకే పడుకునే ముందు స్నానం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. స్నానం చేయండం ద్వారా శరీరంపై ఉండే క్రిములు చాలా మట్టుకు నశిస్తాయని ఆరోగ్యవంతమైన నిద్రకోసమే కాదు, శరీరం కోసం సైతం సాయంత్రం స్నానం అవసరమని చర్మవ్యాధి నిపుణులు పేర్కొన్నారు.
ఉదయం పూట స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు
ఉదయం పూట స్నానం చేయడం వల్ల సైతం ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. వారి అభిప్రాయం ప్రకారం ఉదయం షవర్ చేయడం వల్ల చర్మంలోని కణాలు ఉత్తేజం చెందుతాయని, తద్వారా రోజు అంతా ఉల్లాసంగా కనిపిస్తారు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది.
మీకు కొన్ని కలలే ఎందుకు గుర్తుంటాయి? నిద్రలో జరిగే వింత విషయాలు తెలుసా? - Facts About Sleep