ETV Bharat / health

చ‌ర్మంపై దద్దుర్లా? షుగ‌ర్ టెస్ట్ చేయించుకుంటే బెటర్​! - Skin Rashes Causes

Diabetes Skin Problems : షుగ‌ర్​- చాప‌కింద నీరులా విస్త‌రించే వ్యాధి. దీని వ‌ల్ల చ‌ర్మంపై కూడా ప్రభావం పడుతుందని చాలా త‌క్కువ మందికే తెలుసు. షుగ‌ర్​ కారణంగా చ‌ర్మంపై ద‌ద్దుర్లు కూడా వ‌స్తాయి. అస‌లు షుగ‌ర్​ వ్యాధికి చ‌ర్మానికి సంబంధం ఏంటి? చర్మంపై వచ్చే ద‌ద్దుర్ల‌ు షుగర్​కు సంకేతమా? దాని నుంచి ఎలా బయటపడాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Diabetes Skin Problems
Diabetes Skin Problems
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 4:55 PM IST

Diabetes Skin Problems : ఈ కాలంలో షుగ‌ర్​ వ్యాధి నిశబ్ద సునామీలా మారుతోంది. ఉరుముల్లేని పిడుగుల్లా విరుచుకుప‌డుతూ త‌ల నుంచి గోటి దాకా మొత్తం శ‌రీరాన్ని వ్యాధుల కుపంటిలా మారుస్తుంది. ఈ భయానక వ్యాధిని ఒక్క మాట‌లో సైలెంట్​ కిల్ల‌ర్​గా చెప్ప‌వ‌చ్చు. జ‌బ్బు ఏదైనా దాని ప్ర‌భావం ముందుగా మ‌న చ‌ర్మంపైనే చూపిస్తుందనేది వాస్తవం. నూటికి 70 మంది మ‌ధుమేహం వ్యాధిగ్రస్తుల్లో ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు డాక్ట‌ర్లు. దీని వ‌ల్ల షుగ‌ర్​ దాడి మ‌న చ‌ర్మంపై ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో షుగ‌ర్ వ‌ల్ల మ‌న చ‌ర్మానికి ఎదురయ్యే చిక్కులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌ర్మం మ‌న ఒంటికి ర‌క్ష‌ణ క‌వ‌చం మాత్ర‌మే కాదు చ‌క్క‌టి ఆరోగ్యానికి చిరునామా కూడా. డాక్ట‌ర్​ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన‌ప్పుడు క‌ళ్లు, నోటితో పాటు మ‌న చ‌ర్మాన్ని కూడా క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డం చాలా మందికి అనుభ‌వ‌మే. ఎందుకంటే మ‌న ఒంట్లోని అనారోగ్యం తాలూకు ల‌క్ష‌ణాలు చ‌ర్మంపై చాలా వ‌ర‌కు ప్ర‌తిబింబిస్తూ ఉంటాయి. ఈ సంకేతాల‌ను పసిగ‌ట్ట‌డం ద్వారా వైద్యులు చాలా వ‌ర‌కు అనారోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. షుగ‌ర్​తో బాధ‌ప‌డేవారి చ‌ర్మంలో కూడా అనేక లక్షణాలు క‌నిపిస్తాయి. నూటికి 70 శాతం మంది వ్యాధిగ్ర‌స్థుల్లో చ‌ర్మానికి సంబంధించి ఏదొ ఒక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

చర్మంపై దురదలు ఎందుకు వస్తాయి?
రక్తంలో షుగ‌ర్ లెవెల్స్​ ఎక్కువ అవ్వటం వ‌ల్ల దాన్ని బ‌య‌టకు పంపేందుకు శ‌రీర క‌ణాల్లోని నీరును ఉప‌యోగించుకుంటుంది. త‌ద్వారా షుగర్​ పేషెంట్స్​ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ‌్తుంటారు. ఈ కణాల్లో నీరు త‌గ్గ‌డం వ‌ల్ల శ‌రీరం పొడిబారి దుర‌ద ప్రారంభ‌మ‌వుతుంది. ఫైటో కైన్స్​ అనే ఇన్​ఫ్ల‌మేట‌రీ క‌ణాలు అధికం కావ‌డం వ‌ల్ల కూడా శరీరంలో దుర‌దలు రావ‌డాన్ని చూడవచ్చు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్ర‌త్త‌లు ఇవే.

  • చ‌లికాలం రాక‌ముందే మ‌న శ‌రీరానికి స‌రిపోయే మాయిశ్చ‌రైజ‌ర్లు వాడాలి. దానికన్నా ముందు చర్మానికి కొబ్బ‌రినూనెను రాసుకోవాలి. అయితే రంగులు, ప్రిజ‌ర్వేటివ్​లు లాంటి రసాయనలు లేకుండా ఉన్నవి మాత్రమే వినియోగించండి.
  • రోజుకు క‌నీసం 9 గ్లాసుల నీళ్లు తాగండి.
  • త‌డి బ‌ట్టలు వేసుకోవడం మానేయండి.
  • అధిక చెమ‌ట పట్టే ప‌నులు చేయ‌కుండా ఉండటమే మేలు.
  • వీలైనంత వరకు వేడినీళ్లతో కాకుండా చన్నీటితో స్నానం చేసేందుకు చూడండి.
  • ఎక్కువ నుర‌గ వ‌చ్చే స‌బ్బులు వాడ‌కండి.
  • ఒమెగా ఫ్యాట్స్​​ ఎక్కువగా ఉన్న ఆహార ప‌దార్థాలను మీ డైట్​లో చేర్చుకోండి.

బాడీకి సిగ్నల్స్​ ఇస్తుంది!
సాధారణంగా షుగ‌ర్​ వ్యాధితో బాధపడేవారి ర‌క్తంలో గ్లూకోజ్​ శాతం అధికంగా ఉంటుంది. అయితే దీని బారిన పడకముందు చ‌ర్మం మన‌కు కొన్ని రకాల సంకేతాలను ఇస్తుంది. అవేంటంటే?

  • అరికాళ్లు, అరిచేతులు, మోకాళ్లు ద‌గ్గ‌ర చ‌ర్మం పొడిబారుతుంది. తద్వారా దుర‌ద ప్రారంభ‌మ‌వుతుంది.
  • చంక‌లు, ఛాతీ లాంటి జాయింట్స్​ ప్రాంతాల్లో ఇన్​ఫెక్ష‌న్లు సోకుతాయి.
  • ర‌క్తంలో యూరియా శాతం పెర‌గ‌డం వల్ల కూడా చ‌ర్మ‌ంపై దుర‌ద‌లు వ‌స్తుంటాయి.
  • శరీరానికి సరిపడా నీరు తీసుకోకున్నా దుర‌దలు వచ్చే అవకాశం ఉంది.

పరిష్కారం లేదా?
డయాబెటిస్​ పేషెంట్లకు ఎక్కువగా చీము, పొక్కులు, రాచ‌పుండ్లు, కాళ్లల్లో వాపు రావ‌డం, పులిపిర్లు, చంక‌ల్లో ఇన్​ఫెక్ష‌న్లు లాంటి సమస్యల బెడ‌ద ఉంటుంది. ఇందుకోసం త‌గిన యాంటిబయోటిక్​ మందుల్ని వాడితే సరిపోతుంది. తద్వారా ఈ రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. షుగ‌ర్​తో బాధపడేవారు తరచూగా లివ‌ర్​, కిడ్నీ సహా ఇత‌ర వైద్యప‌రీక్ష‌లు చేయించుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యల నుంచి జాగ్ర‌త్త ప‌డవచ్చు.

షుగర్​ మందులు కారణం కావచ్చు!
సాధార‌ణంగా షుగ‌ర్​ వ్యాధి బారినప‌డ్డ 5 నుంచి 10 ఏళ్ల త‌ర్వాత దాని ప్ర‌భావం మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల‌పై ప‌డుతుంది. కానీ, చ‌ర్మం విష‌యంలో మాత్రం వ్యాధి వ‌చ్చే ముందే స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. మెడ మీద న‌లుపు, చ‌ర్మం ముడ‌త‌లు, పులిపిర్లు లాంటివి నిత్యం వేధిస్తుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల కింది భాగంలో దురద ఎక్కువ‌గా ఉంటుంది. మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉండడం కోసం తరచూ వాడే మందులు కూడా చర్మ సమస్యలకు కారణం అవుతుంటాయి.

షుగ‌ర్​ బారి నుంచి చ‌ర్మాన్ని కాపాడుకునేందుకు ఇవి పాటించండి.

  1. రక్తంలో గ్లూకోజ్​ లెవెల్స్​ను పెరగకుండా చూసుకోవాలి. దానిని ఎప్పటికప్పుడు అదుపు చేయాలి.
  2. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి.
  3. మరీ వేడి నీళ్లతో కాకుండా గోరు వెచ్చ‌టి నీటితో స్నానం చేయండి.
  4. యాంటీ బ్యాక్టీరియ‌ల్​ స‌బ్బులు వాడ‌టం మంచిది.
  5. స్నానం చేసిన త‌ర్వాత యాంటీ ఫంగ‌ల్​ పౌడ‌ర్లను వాడవచ్చు.
  6. బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకండి.
  7. వారానికోసారి మీ కాళ్లను, చేతుల‌ను నిశితంగా గ‌మ‌నించండి.
  8. చ‌ర్మంపై ఏ చిన్న స‌మ‌స్య క‌నిపించినా వెంటనే సంబంధిత డాక్టర్​ను సంప్రదించండి.
  9. వైద్యుల సలహాల మేరకు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తగిన చికిత్స తీసుకోండి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హ్యాంగోవరా? ఈ ఆయుర్వేద సూపర్​ టిప్స్​తో చెక్ పెట్టండిలా!

ఈ పోపు దినుసుతో మీ గుండె పదిలం- రోజూ పరగడుపున తింటే సరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.