ETV Bharat / health

రోజూ లవంగాలు తింటే - మీ బాడీలో అద్భుతాలు జరుగుతాయని తెలుసా? - Cloves Health Benefits - CLOVES HEALTH BENEFITS

Cloves Health Benefits : మసాలాల్లో రారాజుగా పిలుచుకునే లవంగాన్ని రుచికోసం డైలీ వివిధ కూరల్లో వాడుతాం. ఇక మాంసాహార వంటకాల్లో అయితే ఈ మసాలా దినుసు తప్పనిసరిగా ఉండాల్సిందే! అయితే, ఎన్నో పోషకాలు ఉన్న లవంగాలను రోజూ తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Benefits of Cloves Chew Everyday
Cloves Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 2:28 PM IST

Health Benefits of Cloves Chew Everyday : ప్రతి వంటింట్లోని పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో లవంగం ఒకటి. ఈ లవంగాలు కూరలకు మంచి టేస్ట్, వాసన ఇవ్వడమే కాకుండా.. మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు అందించి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే.. వీటిని అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉంటాం. కానీ.. అనేక ఔషధగుణాలు కలిగి ఉన్న లవంగాలను(Cloves) రోజూ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి : మీ డైలీ డైట్​లో లవంగాలను చేర్చుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఐసోఫ్లేవోన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా సెల్యులార్ డ్యామేజ్​ను నివారించి గుండె జబ్బులు, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయంటున్నారు.

ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి : లవంగాలలో పుష్కలంగా ఉండే మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్ ఎముకల సాంద్రతను నిర్వహించడానికి దోహదం చేస్తాయంటున్నారు. అలాగే ఈ సమ్మేళనాలు ఎముక కణజాలాన్ని సరిచేయడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. ఫలితంగా వివిధ ఎముకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి : మీరు రోజూ లవంగాలు తినడం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతుందని నిపుణులు సూచిస్తున్నారు. 'జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ అనాలిసిస్‌'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లవంగాల పదార్థాలు మీ ఇమ్యూనిటీ పవర్​ను పెంచడంలో సహాయపడతాయని కనుగొన్నారు. అలాగే, ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాలు రక్తంలో టాక్సిన్స్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ఉదర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు లవంగం మంచి హోమ్ రెమిడీగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి వివిధ జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

నెల రోజులు మీ డైట్​లోంచి అన్నం తీసేస్తే ఏమవుతుందో తెలుసా? - నమ్మలేని నిజాలు!

దంత ఆరోగ్యానికి మేలు : లవంగాల్లో యాంటీ జింజివిటీస్, యాంటీప్లేక్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు ఆస్రా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కు చెందిన డాక్టర్ జగదీష్ జె హిరేమత్. ఇవి నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయంటున్నారు. పురుషులలో నోటి దుర్వాసన, పీరియాంటైటిస్‌ను నివారించడానికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు.

ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం : లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఫ్లూ, జలుబు, బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు డాక్టర్ జగదీష్. అలాగే లవంగాలలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయంటున్నారు.

ఇలా తీసుకుంటే ఆరోగ్యం : రోజూ లవంగాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. రోజుకు ఒకటి నుంచి రెండు లవంగాలు వంటి చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు. రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం లవంగాలను టీ రూపంలో లేదా భోజనంలో చేర్చడం ద్వారా వాటిని తీసుకోవచ్చంటున్నారు.

లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు : లవంగాలు డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అధిక వినియోగం కాలేయం దెబ్బతినడానికి దారితీస్తుందని డాక్టర్ హిరేమత్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లివర్ సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అలాగే.. గర్భిణీ స్త్రీలు, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునేవారు లవంగాలను జాగ్రత్తగా వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్ హిరేమత్.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు స్పైసీ ఫుడ్​కు దూరంగా ఉంటున్నారా! - ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.