ETV Bharat / health

మీ ఇంటి దగ్గర్లో కిరాణా దుకాణాలు లేవా? అయితే మీ పిల్లల్లో ఊబకాయం వచ్చే ఛాన్స్​ ఉందట! వెంటనే జాగ్రత్త పడండి!! - CHILD OBESITY CAUSES AND EFFECTS

-ఆ ప్రాంతాల్లోని పిల్లల్లో ఊబకాయం వస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడి -వివిధ వయసుల పిల్లల్లో బీఎంఐ ఆధారంగా పరిశోధన

Child Obesity Causes and Effects
Child Obesity Causes and Effects (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 19, 2024, 12:37 PM IST

Child Obesity Causes and Effects: మీ ఇంటి చుట్టు పక్కల మంచి కిరాణా దుకాణాలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు లభించే వనరులు ఏం లేవా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో నివసించే పిల్లల్లో ఊబకాయం ముప్పు పెరగటానికీ ఎక్కువ అవకాశం ఉంటోందని పరిశోధకులు వెల్లడించారు. Paediatr Child Health అనే జర్నల్​లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. "Food Insecurity and Obesity in Children: A Systematic Review" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో కెనడాలోని McMaster University అసోసియేట్ ప్రొఫెసర్ Elizabeth Lee Ford-Jonesతో పాటు మరో పరిశోధకురాలు Janice Ke పాల్గొన్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఈ నేపథ్యంలోనే పిల్లల్లో ఊబకాయం విషయాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి పరిశోధకులు ఇటీవల దృష్టి సారించారు. చిన్న వయసులో ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవటం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యం మీద చూపే ప్రభావాలను నిశితంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో భాగంగా పుట్టినప్పుడు, ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల వయసులో ఉన్న పిల్లలను విభజించి వారి.. శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ)ని విశ్లేషించారు. ఇందులో పట్టణాల్లో అర మైలు, గ్రామాల్లో 10 మైళ్ల కన్నా ఎక్కువ దూరంలో దుకాణాలు ఉండటాన్ని ఆహార పదార్థాలు అంతగా అందుబాటులో లేని ప్రదేశాలుగా పరిగణనలోకి తీసుకున్నారు. బాల్యంలో ఇలాంటి ప్రాంతాల్లో నివసించిన పిల్లలకు ఊబకాయం ముప్పు 50% కన్నా ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అంతగా అందుబాటులో లేని ప్రదేశాల్లో నివసించిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో, అలాగే బాల్యంలో ఇలాంటి ప్రాంతాల్లో గడిపిన పిల్లల్లో మరింత బలమైన సంబంధం కనిపిస్తున్నట్టూ అధ్యయనంలో బహిర్గతమైంది.

అందుకే ఈ దశల్లో మంచి ఆహారం లభించే ప్రాంతాల్లో నివసించేలా చూసుకుంటే భవిష్యత్తులో ఊబకాయం ముప్పు తగ్గించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల వంటి పదార్థాలు అంతగా అందుబాటులో లేకపోతే అనారోగ్యకర ఆహారం తినే అవకాశం ఎక్కువని.. తద్వారా ఇది చివరికి ఊబకాయానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పార్కులకు తరచూ వెళ్తున్నారా? ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి!

మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.