ETV Bharat / health

టెన్షన్​తో భేజా ఫ్రై అవుతోందా? - ఇది నోట్లో వేసుకోండి - క్షణాల్లో హుష్ కాకి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 4:55 PM IST

Health Benefits of Chewing Gum : ఈ రోజుల్లో అనేక మంది ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలంలో ఇవి తీవ్ర దుష్ఫలితాలను చూపిస్తాయి. అందుకే.. ఈ స్ట్రెస్​కు గల కారణాలేంటో పరిశీలించి.. శాశ్వతంగా నిర్మూలించాలి. ఆలోపు తాత్కాలికంగా ఒత్తిడిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? అన్నప్పుడు సింపుల్ చిట్కా చూపిస్తున్నారు నిపుణులు. దీని ద్వారా.. చిటికెలో స్ట్రెస్​ను వదిలించుకోవచ్చని చెబుతున్నారు!

Chewing Gum
Health Benefits of Chewing Gum

Chewing Gum Health Benefits : ఒత్తిడి అందరిలో ఉంటుంది. కానీ.. దాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవడమే మనం చేయాల్సింది. లేకపోతే.. లాంగ్​ టైమ్​లో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. తాత్కాలికంగా స్ట్రెస్​ను తగ్గించుకునే మార్గం ఒకటుందని నిపుణులు సూచిస్తున్నారు. అదే.. 'చూయింగ్ గమ్' నమలడం!

చాలా మంది సరదాకోసం చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ.. దీని ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. క్రీడాకారులు మైదానంలో నమిలేది అందుకేనట! 'చూయింగ్ గమ్​'పై "నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్" (NCBI) జరిపిన పరిశోధనలో కూడా ఈ విషయం వెల్లడైంది. చూయింగ్ గమ్ నమలడం వల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

NCBI పరిశోధనల ప్రకారం.. ఒత్తిడి, ఆందోళన నివారించడంలో చూయింగ్ గమ్ శక్తివంతంగా పనిచేస్తుందట. దాంతో.. చేసే పనిపై మరింత దృష్టి పెరుగుతుందని.. ఫలితంగా సక్సెస్​ రేటు పెరుగుతుందట. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. పరీక్షలకు ముందు చూయింగ్ గమ్ నమలడం వల్ల.. విద్యార్థుల్లో ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని, తద్వారా చక్కగా ఎగ్జామ్​ రాస్తారని చెబుతున్నారు.

ఫిన్లాండ్ పరిశోధనల ప్రకారం.. జిలిటాల్ కలిగి ఉన్న చూయింగ్ గమ్ చెవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. అదేవిధంగా.. చూయింగ్ గమ్ నమలడం.. ముఖ కండరాలకు వ్యాయామాన్ని అందిస్తుంది. శారీరకంగా శ్రమించే సమయంలో అథ్లెట్లకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందట.

లైకుల బాధ, కామెంట్ల వార్ - సోషల్‌ మీడియా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి?

ఎవరు ఏ కారణంతో చూయింగ్‌ గమ్‌ తిన్నా.. దాని వల్ల టెన్షన్​ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, భయాలకు కారణమయ్యే అడ్రినలిన్‌ అనే హార్మోన్‌ స్రావాన్ని ఇది అడ్డుకుటుందట. ఫలితంగా.. ఒక తెలియని ధైర్యంగా కూడా ఉంటుందట. చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల మెదడుకి రక్తప్రసరణ జరిగి, జ్ఞాపకశక్తి కూడా పెరిగినట్లూ కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి.

అదేవిధంగా.. చూయింగ్ గమ్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తుందని లూసియానా విశ్వవిద్యాలయం పేర్కొంటోంది. కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్‌ తినాలనిపించినప్పుడు.. చూయింగ్‌ గమ్‌ నమిలితే వాటిమీదకు మనసు పోకుండా ఉంటుందనీ.. దాంతో బరువు తగ్గుతారనీ రోడ్‌ యూనివర్సిటీ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ చూయింగ్ గమ్స్​ నమిలేవాళ్లు.. మిగిలినవాళ్లకన్నా 68 శాతం క్యాలరీలు తక్కువగా తీసుకుంటారనీ.. క్యాలరీలు కూడా ఐదు శాతం అదనంగా ఖర్చవుతాయనీ నిపుణులు గుర్తించారు.

చూశారుగా.. చూయింగ్ గమ్​తో ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి! అయితే.. మధుమేహం లేదా ఇతర ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు మాత్రం చూయింగ్ గమ్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ కంటెంట్ లేని చూయింగ్ గమ్స్​ సెలక్ట్ చేసుకోవాలని చెబుతున్నారు.

మీరు తరచూ చిరాకు పడుతున్నారా? - ఇలా బయటపడండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.