ETV Bharat / health

పిల్లల్లో ఫ్యాటీ లివర్‌ సమస్య - తల్లిదండ్రులు మేల్కోకుంటే ఇబ్బందే!

Causes Of NAFLD In Children : పిల్లలు పదేళ్లు కూడా నిండకుండానే.. బస్తాల్లాంటి పొట్టలేసుకొని తిరుగుతుంటారు! దీనికి ప్రధాన కారణం అధిక బరువు. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అందులో ఒకటి ఫ్యాటీ లివర్‌. మరి.. ఇది పిల్లల్లో ఎందుకు వస్తుంది? పిల్లలు దీని బారిన పడకుండా ఏం చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Causes Of NAFLD In Children
Causes Of NAFLD In Children
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 4:01 PM IST

Causes Of NAFLD In Children : మారిపోయిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. పెద్దవాళ్లనే కాదు.. పిల్లలనూ ఈ సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి వాటిలో నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (NAFLD) ఒకటి. దీనివల్ల చిన్నవయసులోనే కాలేయం దెబ్బతినడం వంటి తీవ్రమైన అనారోగ్యంతోపాటు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. పిల్లల్లో NAFLD సమస్య రావడానికి గల కారణాలు ఏంటీ ? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ ఎలా? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

ఫ్యాటీ లివర్‌ అంటే?
అతిగా ఆహారం తిన్నప్పుడు.. ఆ తీసుకున్న ఆహారం మొత్తాన్నీ కాలేయం ప్రాసెస్ చేయలేకపోతుంది. ఇలా ప్రాసెస్ చేయలేక మిగిలిన ఫుడ్ మొత్తం కొవ్వు రూపంలోకి మారి, కాలేయంలో పేరుకుపోతుంది. ఈ సమస్య ఎక్కువగా మద్యం తాగే వారిలో వస్తుంది. కానీ.. మద్యం అలవాటు లేకపోయినా కూడా.. కొందరిలో ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. దీన్నే NAFLD అంటారు.

పిల్లల్లో NAFLD రావడానికి కారణాలు ?

  • అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే.. పిల్లల్లో NAFLD సమస్య రావడానికి ప్రధాన కారణం.
  • ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు ఉండే పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటిని తరచుగా తినడం వల్ల NAFLD సమస్య వస్తుంది.
  • అలాగే పిల్లలు ఆటలు ఆడకపోతే.. మార్నింగ్ వర్కవుట్స్ చేయకపోతే.. శారీరక శ్రమకు దూరమైపోతారు. ఫలితంగా కూడా NAFLD వస్తుంది.
  • ఇంకా.. ఇళ్లలో ఎక్కువ సేపు టీవీలు, సెల్‌ఫోన్లకే అతుక్కుపోయి బరువు పెరగడం వల్ల కూడా NAFLD బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లక్షణాలు ?

  • కొంత మంది పిల్లల్లో NAFLD లక్షణాలు కనిపించకపోవచ్చు.
  • కొంతమంది పిల్లల్లో మాత్రం.. కడుపు నొప్పి, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • 2017లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్' నివేదిక ప్రకారం NAFLD సమస్య ఉన్న పిల్లల్లో కడుపు నొప్పి, అలసట, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయట. ఈ పరిశోధనలో 8-19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న 10,739 మంది పిల్లలు పాల్గొన్నారు.
  • పరిస్థితి తీవ్రమైతే.. కొంత మంది బరువు తగ్గుతారు.
  • కాళ్లు వాపు కూడా వస్తుంది.
  • కామెర్లు లేదా చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

  • పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
  • జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ వంటి వాటిని తినిపించకూడదు.
  • స్కూల్లో ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
  • అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా చూడాలి.
  • పిల్లలకు తృణధాన్యాలు ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా అందించాలి.
  • చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకూ నిషేధించాలి.

నీళ్లు తక్కువ తాగితే కిడ్నీలకు డేంజర్ - మరి ఎక్కువగా తాగితే?

పుదీనాతో కొలెస్ట్రాల్​, ఎసిడిటీ సమస్యలు దూరం! మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

పిల్లల్లో మెమరీ పవర్​ పెరగాలా? - డైలీ ఈ యోగాసనాలు వేస్తే వారికి తిరుగుండదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.