ETV Bharat / health

జీడిపప్పు తెగ తినేస్తున్నారా? బరువు పెరిగిపోయే ఛాన్స్ ఉంది- జాగ్రత్త! - Side Effects Of Cashews - SIDE EFFECTS OF CASHEWS

Cashew Side Effects : జీడిపప్పంటే మీకు చాలా ఇష్టమా? ఆరోగ్యానికి మంచివనీ, టేస్టీగా ఉంటాయని జీడిపప్పులను తెగ తింటున్నారా? మరి వీటిని ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

cashew side effects
cashew side effects
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 8:50 AM IST

Cashew Side Effects : డ్రైఫ్రూట్స్ అన్నింటిలో చాలా మంది ఇష్టంగా తినేవి జీడిపప్పు. అమోఘమైన రుచి కలిగిన జీడిపప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంటారు కనుక చాలా మంది వీటిని ఎక్కువ తినేస్తారు. నేరుగా మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్, స్వీట్ ఐటమ్స్​లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.

నిజానికి ప్రొటీన్లు, రాగి, మాంగనీస్, జింక్, మెగ్నీషియం లాంటివి అధికంగా ఉండే జీడిపప్పులు మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయి. అలాగని వీటిని ఎంత మొత్తంలో అయినా తినొచ్చా? జీడిపప్పులను ఎక్కువగా తింటే ఏం అవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే!
మార్కెట్లో జీడిపప్పులు రకరకాల స్నాక్స్ రూపంలో లభిస్తాయి. అలా దొరికే సాల్డెడ్ జీడిపప్పును అధికంగా తినడం వల్ల మీ శరీరంలో సోడియం పెరుగుతుంది. ఇది మీ రక్తపోటును పెంచుతుంది. వాస్తవానికి ఉప్పు లేని జీడిపప్పుల్లోనే 3.4 మిల్లీ గ్రామల సోడియం ఉంటుందట. అలాంటిది వీటిని మరింత సాల్ట్ జతచేసి తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమేనట.

బరువు పెరిగిపోతారు!
జీడిపప్పులను అతిగా తినడం వల్ల కలిగే మరో సమస్య ఏంటంటే బరువు పెరగడం. ఇవి మంచి కొవ్వులను కలిగి ఉన్నప్పటికీ.. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. 18 జీడిపప్పుల్లో దాదాపు 160 నుంచి 200 కేలరీల వరకూ ఉంటాయట. కాబట్టి వీటిని తినడం వల్ల శరీర బరువు సులువుగా పెరుగుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు 28 గ్రాములకు మించి!
ఎక్కువ మొత్తంలో జీడిప్పులను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉందట. వీటిలో ఉండే ఆక్సాలెట్స్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక రోజుకు 28గ్రాములకు మించి జీడిపప్పులను తినద్దని వైద్యులు సూచిస్తున్నారు.

చర్మ సమస్యలు కూడా!
జీడిప్పులను అతిగా తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ లాంటి మంచి గుణాలు ఎన్నో ఉన్నప్పటికీ చర్మానికి హాని చేసే యురోషియోల్ లాంటి టాక్సిన్ ను కలిగి ఉంటాయట. ఇది చాలా హానికరమైన టాక్సిర్ గా డెర్మటాలజిస్టులు చెబుతారు. జీడిప్పులను ఎక్కువ తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, మంట లాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రుచినీ లాభాలను మాత్రమే చూసి జీడిపప్పులను అతిగా తినకుండా మితంగా తినండి లాభాలు పొందండి!

రాత్రి పూట జ్వరం తరచూ ఇబ్బంది పెడుతుందా? లైట్​ తీసుకోవద్దు- ఈ జాగ్రత్తలు మస్ట్​! - Causes Of Night Fever In Telugu

కూరలో మసాలా ఎక్కువైందా? డోంట్​ వర్రీ- ఈ ఇంటి చిట్కాలతో అంతా సెట్​! - Reduce Spiciness Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.