Can Smoking Increase Belly Fat : ధూమపానం దీర్ఘకాలికంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాలకు స్మోకింగ్ కారణమవుతుందని అందరికీ తెలుసు. కానీ స్మోకింగ్ కారణంగా బరువు పెరుగుతారి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి బెల్లీ ఫ్యాట్ వస్తుందనీ ఎంత మందికి తెలుసు? అవును ధూమపానం కేవలం లంగ్స్, గుండెపై మాత్రమే కాదు జీవక్రియ, శరీర బరువు విషయాల్లో కూడా ప్రభావం చూపుతుందట. సాధారణ జీవక్రియ ప్రక్రియలు, ఆహార అలవాట్లకు కూడా స్మోకింగ్ ఆటంకం కలిగిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
సిగరెట్లలో ఉండే నికోటిన్ ఒత్తిడి కలిగించే కారిస్టాల్ అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ ఉండే ప్రాంతంలో కొవ్వు అధికంగా పేరుకునేలా చేస్తుంది. అంతేకాదు ధూమపానం ఇన్సులిన్ సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. ఇది ఇతర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు వేగంగా పేరుకుపోయేలా చేస్తుంది.
శరీరానికి ధూమపానం చేసే మరో నష్టం ఏంటంటే? స్మోకింగ్ చేసేవారు దీర్ఘకాలికంగా రుచిని కోల్పోతారు. ఆరోగ్యకరమైన ఆహారాలను స్వయంగా దూరంగా ఉండేలా హానికరమైన కొవ్వులు, అధిక కేలరీలు కలిగిన ఆహారాలు తీసుకునేలా స్మోకింగ్ అలవాటు ప్రేరేపిస్తుంది. ఇలా జీవక్రియపై, ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపి పొట్ట చుట్టు హానికరమైన కొవ్వు పెరుగుదలకు దారితీస్తుందీ చెడ్డ అలవాటు.
దూరం పెట్టక తప్పదు!
బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మొదట చేయాల్సిన పని స్మోకింగ్కు దూరంగా ఉండటం. ఒకేసారి కాకపోయినా క్రమ క్రమంగా అయినా ధూమపానాన్ని తప్పకుండా మానేయాల్సి ఉంటుంది. శరీరంలోని హార్మోన్లు నియంత్రణలతో ఉండాలన్నా, పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉండాలన్నా స్మోకింగ్ అలవాటు దూరం పెట్టక తప్పదు. ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల దీర్ఘకాలికంగా వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస సమస్యలు, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండచ్చు.
ధూమపానం మానేయడమే కాకుండా!
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే? ధూమపానం మానేయడమే కాకుండా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. చక్కెరతో కూడిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఆల్కాహాల్ వంటి వాటికి దూరంగా ఉండి కేలరీలను ఎప్పుడు నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు జీవక్రియ పనితీరును మెరుగుపరచడానికి రన్నింగ్, వాకింగ్, వ్యాయామాలు, యోగా వంటివి తరచూ చేస్తుండాలని నిపుణులు సూచిస్తుంటారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డిప్రెషన్ సమస్య స్త్రీలలోనే ఎక్కువట- ఎందుకంటే? - Women Depression Reasons