ETV Bharat / health

వ్యాయామానికి బదులుగా ఓ మాత్ర‌! వర్కౌట్ చేయ‌ని లోటు తీరుస్తుందా? - Can Exercise Pill Replace Workout - CAN EXERCISE PILL REPLACE WORKOUT

Can Exercise Pill Replace Workout : మ‌న‌లో చాలా మంది కొన్ని స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు ట్యాబ్లెట్స్​ను ఉప‌యోగిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వినియోగిస్తారు. అయితే, భ‌విష్య‌త్తులో వ్యాయ‌మం చెయ్య‌కున్నా, పిల్స్ వేసుకోవ‌డం ద్వారా ఆ ప్ర‌యోజనం పొందే అవ‌కాశ‌ముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ పిల్స్ ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

Can Exercise Pill Replace Workout
Can Exercise Pill Replace Workout
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 7:26 AM IST

Can Exercise Pill Replace Workout : కాలం బాగా మారిపోయింది. రోజురోజుకీ టెక్నాల‌జీ పెరిగిపోవ‌డం వల్ల మాన‌వ జీవ‌న శైలిలో భారీ మార్పులు సంభ‌వించాయి. ప‌నుల‌న్నీ సుల‌భ‌మ‌య్యాయి. బ‌ద్ద‌కం పెరిగింది. దీంతో పాటు సౌక‌ర్యాలూ పెరిగాయి. ఈ క్రమంలో కొన్ని స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు పిల్స్​ను ఉప‌యోగిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇప్పడు ఇలాంటి పిల్స్​ను వ్యాయ‌మం కోసం కూడా వినియోగిస్తున్నారు. ఇంత‌కీ ఆ ఎక్స‌ర్​సైజ్ పిల్ అంటే ఏంటి? అది ఎలా ప‌నిచేస్తుంది అనే వివ‌రాలు తెలుసుకుందాం.

కొంద‌రు శాస్త్రవేత్త‌లు కాంపౌండ్స్​ను క‌నిపెట్టారు. అవి వ‌ర్క‌వుట్ ఫిజిక‌ల్ బూస్టింగ్​ను ప్రోత్స‌హించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతాయి. భ‌విష్య‌త్తులో ఇది మెట‌బాలిజం పెరిగేందుకు తోడ్ప‌డుతుంద‌ని, కండ‌రాల ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్య‌మైంది. దాని స్థానాన్ని ఎవ‌రూ భర్తీ చేయ‌లేరు. కానీ అందుకు సంబంధించి కొన్ని ప్ర‌త్యామ్నాయ మార్గాలున్నాయ‌ని ప్ర‌ధాన శాస్త్రవేత్త అయిన బాహా ఎల్జెండి అన్నారు. ఎల్జెండి బృందం సృష్టించిన కొత్త స‌మ్మేళ‌నాలు భ‌విష్య‌త్తులో వ్యాయామ మాత్ర‌గా ప‌నికొస్తుంద‌ని వారు న‌మ్ముతున్నారు.

ఈ ఎక్స‌ర్​సైజ్ పిల్ మీ ఫిట్​నెస్ ల‌క్ష్యాల్ని చేరుకోవ‌డంలో సాయం ప‌డ‌దు కానీ, మిగ‌తా వాటికి ఉప‌యోగ‌ప‌డుతుంది. గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు, కండరాల క్షీణత వంటి వాటికి చికిత్స చేయడానికి సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. వృద్ధులు, క్యాన్స‌ర్ కార‌ణంగా బ‌ల‌హీనంగా మారిన, ఎక్సర్​సైజ్ చేయ‌లేని వ్య‌క్తుల‌కు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతే కాకుండా బ‌రువు తగ్గించ‌డానికి వాడే మందుల వ‌ల్ల కలిగే న‌ష్టం నుంచి కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పని తీరు ఎలా ?
శాస్త్రవేత్తల బృందం ఈ స‌మ్మేళ‌నాన్ని త‌యారు చేయ‌డానికి 10 సంవత్సరాలు ప‌ట్టింది. ఈస్ట్రోజెన్-సంబంధిత గ్రాహకాలు (ఒక రకమైన హార్మోన్ రిసెప్టర్) అనే ప్ర‌త్యేక ప్రోటీన్ల‌ను యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రొటీన్లు మ‌న కండ‌రాల్లో వ్యాయామం ప్ర‌భావాన్ని నియంత్రిస్తాయి. ఈ మాత్ర‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలుక‌ల‌పై జ‌రిపిన ప్ర‌యోగాల్లో మాత్ర‌మే విజ‌య‌వంత‌మ‌య్యాయి. ఎలుకల RNAలోని వివిధ సమ్మేళనాల ప్రభావాలను పోల్చ‌డం ద్వారా, కణాల ప్రతిస్పందన బలాన్ని శాస్త్రవేత్తలు పెంచారు.

ఎలుకలపై పరీక్షించినప్పుడు, ఈ సమ్మేళనం అలసట-నిరోధకత కలిగిన కండరాల ఫైబర్‌ను పెంచిందని బృందం కనుగొంది. తరువాత, ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు ఎలుకల ఓర్పు మెరుగుపడిందనే విష‌యాన్నీ గ‌మ‌నించింది. ఎలుక‌ల్లో ప్ర‌యోగం చేశారు కానీ, మానవులపైదీని ఆచ‌ర‌ణ చాలా క‌ష్టం. పిల్​ను తీసుకురావ‌డానికి చాలా ప‌రీక్ష‌లు చేయాల్సి ఉంటుంది. ఎలుక‌లే కాకుండా ఇత‌ర జంతువుల్లో కూడా ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని శాస్త్రవేత్త‌లు యోచిస్తున్నారు.

కొరియన్స్​లా మీ స్కిన్​ కూడా నిగనిగలాడాలా? ఈ సింపుల్​ టిప్స్​ పాటిస్తే చాలు​! - Korean Skin Care

మీరు ఎక్కువగా బరువు పెరుగుతున్నారా ? అయితే, డైలీ లైఫ్‌లో ఈ తప్పులు చేస్తున్నట్లే! - Causes Of Obesity

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.