ETV Bharat / health

చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నారా? కీళ్లవాతం వచ్చే ఛాన్స్ ఉందట జాగ్రత్త! - GUM INFECTION CAUSE JOINT PAIN

-చిగుళ్ల నొప్పితో కీళ్లవాతం వచ్చే ఛాన్స్! -ఇలా చేస్తే తగ్గించుకోవచ్చంటున్న నిపుణులు

Gum Infection Cause Joint Pain
Gum Infection Cause Joint Pain (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Nov 9, 2024, 7:08 PM IST

Can a Gum Infection Cause Joint Pain: చిగుళ్ల జబ్బు ఉన్నవారిలో కీళ్ల నొప్పి తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. ఇవి రెండూ వేర్వేరే అయినా చిగుళ్లు, కీళ్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటోందని.. ఒకటి జబ్బు పడితే మరోటీ అదే దారిలో నడుస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకుంటే కీళ్లవాతం వచ్చే స్వభావం ఉన్నా జబ్బుగా మారకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండింటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే కీళ్ల నొప్పులను నివారించుకోవటం, తగ్గించుకోవటం సాధ్యమవుతుందని ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ ఎం వికాస్ గౌడ్ అంటున్నారు.

"చిగుళ్ల జబ్బును (పెరియోడాంటల్‌ డిసీజ్‌) చాలా మందిలో తరచుగా చూస్తుంటాం. చిగుళ్ల నుంచి రక్తం రావడం, ఉబ్బటం, నొప్పి వంటి వాటితో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవటం. ఫలితంగా పళ్లకు గార పట్టటం, మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇంకా మనం తినే ఆహార పదార్థాల ముక్కలు దంతాల మధ్యలో ఇరుక్కుపోతుంటాయి. అయితే, వీటిని సరిగా శుభ్రం చేసుకోకపోతే అక్కడ బ్యాక్టీరియా పెరిగి, పొరలా ఏర్పడుతుంది. ఫలితంగా ఇది చిగుళ్లకు, దంతాలకు గట్టిగా అతుక్కుపోతుంది. ఇంకా పొగ తాగటం, పాన్, గుట్కా నమలటం వల్ల దంతాల మీద పడే మచ్చలూ ప్రమాదంగా మారతాయి. వీటిల్లోనూ రకరకాల బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్లను చికాకు పరుస్తాయి. గారలోని బ్యాక్టీరియా ఆమ్లాలను, విషతుల్యాలను ఉత్పత్తి చేసి చిగుళ్లను దెబ్బతీసి ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. తొలిదశలో ఇన్‌ఫెక్షన్‌ చిగురుకే పరిమితమైతే (జింజివైటిస్‌) వాపు, ఎరుపు, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. పళ్లు తోముకునే సమయంలో చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసనా రావచ్చు. అయితే, వీటికి సరైన చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రమై పెరియోడాంటైటిస్‌ తలెత్తుతుంది. తర్వాతి దశలో ఇన్‌ఫెక్షన్‌ దంతాలకు దన్నుగా నిలిచే కణజాలానికీ వ్యాపిస్తుంది. ఇది క్రమంగా దవడ ఎముకకూ విస్తరించే అవకాశం ఉంటుంది. ఫలితంగా చిగుళ్లకు, దంతాలకు మధ్య ఖాళీలు ఏర్పడి పళ్లు పట్టు సడలి, చివరికి ఊడిపోతాయి."

--డాక్టర్ ఎం వికాస్ గౌడ్, డెంటల్ సర్జన్

అక్కడికే పరిమితం కాదు
అయితే, చిగుళ్ల జబ్బు కేవలం నోటికి పరిమితమని అనుకోవటానికి అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కూ గుండెజబ్బుకూ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. మధుమేహం, అల్సర్లు, కిడ్నీ జబ్బుల వంటి వాటినీ చిగుళ్ల జబ్బు ఉద్ధృతం చేస్తున్నట్టు తేలింది. వీటితో పాటు తాజాగా కీళ్ల నొప్పులకు కారణం అవుతున్నట్లు బయటపడింది. వయసు మీద పడటం వల్ల తలెత్తే మామూలు కీళ్ల నొప్పుల్లోనే కాకుండా.. మన రోగనిరోధక శక్తి మీదే దాడి చేయటం వల్ల తలెత్తే కీళ్లవాతం (రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌) సమస్యకు దారి తీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పరస్పర ప్రోత్సాహం
చిగుళ్ల జబ్బు, కీళ్లనొప్పులు రెండూ వాపు ప్రక్రియతో ముడిపడినవేనని డాక్టర్ వికాస్ గౌడ్ తెలిపారు. వీటిల్లో శరీర రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. చిగుళ్ల జబ్బుకు కారణమయ్యే పి.జింజివలిస్‌ బ్యాక్టీరియాతో ప్రేరేపితమైన వాపు ప్రక్రియ కీళ్ల మీదా ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి రెండూ ఒకేరకం రోగనిరోధక ప్రతిస్పందన మార్గాలను కలిగి ఉంటాయని ఆయన వివరించారు. ముఖ్యంగా వాపును ప్రేరేపించే సైటోకైన్లు చిగుళ్లనే కాకుండా కీళ్లలోని కణజాలాన్నీ దెబ్బతీస్తాయని వెల్లడించారు. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉద్ధృతం కావటంలో దీర్ఘకాల చిగుళ్ల జబ్బు పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కీళ్లవాతం గలవారికి చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువని ఒక అధ్యయనం వెల్లడైంది. కీళ్లవాతం లేనివారిలో 28% మందిలో చిగుళ్ల జబ్బుతో బాధపడుతుండగా.. కీళ్లవాతం గలవారిలో 65% మంది చిగుళ్ల జబ్బుతో ఉన్నట్టు మరో అధ్యయనంలో స్పష్టమైంది. తీవ్ర చిగుళ్ల జబ్బు మూలంగా కీళ్లవాతమూ ఉద్ధృతమవుతుందని.. ఇవి రెండూ పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని అంటున్నారు.

ఏంటీ సంబంధం?
కీళ్లవాతం అనేది కేవలం కీళ్లలోనే మొదలు కావటం లేదని, శరీరంలోని ఇతర భాగాల్లో పుట్టుకొచ్చే ఆటోయాంటీబాడీలు దీనికి బీజం వేస్తున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. నోట్లోని బ్యాక్టీరియా కూడా ఇలాంటి ఆటో యాంటీబాడీలకు కారణమవుతుందని చెబుతున్నారు. పి.జింజివలిస్‌ అనే బ్యాక్టీరియాలో ఉండే పీప్యాడ్‌ అనే ఎంజైమ్‌ ఒంట్లోని ప్రొటీన్లను మార్చేస్తుందని.. అప్పుడు శరీరం వాటిని శత్రువులుగా భావించి, వాటి మీద దాడి చేయటానికి యాంటీబాడీలను సృష్టిస్తుందని వివరించారు. ఫలితంగా ఇవి కీళ్ల మీదుండే ప్రొటీన్ల మీద దాడి చేసే క్రమంలో కీళ్లనూ దెబ్బతీస్తాయని తెలిపారు. కీళ్లవాతం, ఇతర రకాల కీళ్లనొప్పులు గలవారి కీళ్లలోని ద్రవంలోనూ నోట్లోని బ్యాక్టీరియా ఉంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది దెబ్బతిన్న చిగురు కణజాలం నుంచి రక్తంలోకి ప్రవేశించి, కీళ్లకు చేరుకుంటోందని నిపుణులు భావిస్తున్నారు.

నివారించుకోవచ్చా?
చిగుళ్ల జబ్బును నివారించుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కీళ్లవాతాన్ని సూచించే రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ (ఆర్‌ఎఫ్‌) ఉన్నా సరే.. అందరికీ జబ్బుగా మారాలనేమీ లేదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఆర్‌ఎఫ్‌ 7, 8 దాటితే కీళ్లవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. కానీ చిగుళ్లు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కీళ్లవాతం రాకుండా చూసుకోవచ్చని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల వయసుతో పాటు వచ్చే కీళ్ల నొప్పులనూ నివారించుకోవచ్చని.. ఒక వేళ నొప్పులున్నా తీవ్రం కాకుండా కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

  • తరచుగా దంత వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.. ముఖ్యంగా కీళ్లనొప్పులు గలవారు కచ్చితంగా చేసుకోవాలని.. వీలైనంత తర్వగా చిగుళ్ల జబ్బును గుర్తిస్తే చికిత్స తేలికవుతుంద్నారు.
  • రాత్రి పడుకునే ముందు, ఉదయం నిద్ర లేచాక రోజుకు రెండుసార్లు బ్రష్‌తో పళ్లను తోముకోవాలని చెబుతున్నారు.
  • రాత్రిపూట సన్నటి దారంతో పళ్ల మధ్య చిక్కుకున్న శుభ్రం చేసుకోవాలని తెలిపారు.
  • ప్రతి ఆర్నెల్లకో, ఏడాదికో నిపుణులతో దంతాలను శుభ్రం చేయించుకోవాలని సూచిస్తున్నారు.
  • పళ్లు తోముకుంటున్నప్పుడు రక్తం వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదని.. నొప్పి, ఉబ్బు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బిగ్ అలర్ట్ : రోడ్ సైడ్ టి​ఫిన్ చేస్తున్నారా? - క్యాన్సర్ ముప్పు తప్పదట!

అలర్ట్​: లంగా నాడాతో "క్యాన్సర్​" - మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.